Apple Intelligence Features
-
భారత్‌లో యాపిల్ కొత్తగా నాలుగు అవుట్లెట్లు!
ప్రపంచ దిగ్గజ కంపెనీ యాపిల్ భారత్‌లో నాలుగు అవుట్లెట్లను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కంపెనీ సీఈఓ టిమ్‌కుక్ తెలిపారు. భారత్‌లో యాపిల్ ఉత్పత్తుల విక్రయాలు పెరుగుతున్నట్లు చెప్పారు. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రెవెన్యూ గతంలో కంటే 6 శాతం పెరిగి 94.9 బిలియన్ డాలర్ల(రూ.7.9 లక్షల కోట్లు)కు చేరిందని తెలిపారు.ఈ సందర్భంగా యాపిల్ సీఈఓ టిమ్‌కుక్ ముదుపర్లను ఉద్దేశించి మాట్లాడారు. ‘యాపిల్ తాజా త్రైమాసిక ఫలితాల్లో రికార్డు స్థాయి ఆదాయాన్ని నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా భారీగా ఐఫోన్ అమ్మకాలు జరిగాయి. భారతదేశంలో యాపిల్ సేల్స్ గరిష్ఠాలను చేరుకున్నాయి. ఇండియాలో కంపెనీ కార్యకలాపాలు మరింత విస్తరించేందుకు చర్యలు చేపడుతున్నాం. ఇప్పటికే దేశంలో ముంబయి, ఢిల్లీలో రెండు అవుట్లెట్లను ఏర్పాటు చేశాం. రానున్న రోజుల్లో మరో నాలుగు అవుట్లెట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. దీంతో కంపెనీ రెవెన్యూ మరింత పెరిగే అవకాశం ఉంది’ అన్నారు.ఇదీ చదవండి: చాట్‌జీపీటీ కొత్త ఆప్షన్.. గూగుల్‌కు పోటీ ఇవ్వనుందా?మంబయిలో యాపిల్ బీకేసీ, ఢిల్లీలో యాపిల్ సాకెత్ పేరుతో రెండు అవుట్లెట్లను గతంలో ప్రారంభించింది. బెంగళూరు, పుణె, ముంబయి, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ల్లో మరో నాలుగు కొత్త స్టోర్లను ప్రారంభించే యోచనతో ఉన్నట్లు గతంలో ప్రతిపాదించింది. తాజాగా కంపెనీ సీఈఓ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించడం గమనార్హం. ఇటీవల కంపెనీ ఐఫోన్ 16 సిరీస్‌ను ఆవిష్కరించింది. వారం కిందట యాపిల్ ఐఓఎస్ 18.1ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో వినియోగదారులకు వినూత్న ఫీచర్లను అందించినట్లు కంపెనీ తెలిపింది. -
కొత్త అప్డేట్..యాపిల్‌లో అదిరిపోయే ఫీచర్!
ప్రపంచ టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ ఎట్టకేలకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐఓఎస్ 18.1ని విడుదల చేసింది. వినియోగదారులకు మరింత సేవలందిచేలా, యూజర్లను ఆకట్టుకునే కొత్త ఫీచర్లను పరిచయం చేసింది. ప్రధానంగా గతంలో ఐఓఎస్ వర్షన్లో లేని కాల్ రికార్డింగ్ ఫీచర్‌ను కొత్త ఓఎస్‌లో ప్రవేశపెట్టింది. దాంతోపాటు యాపిల్ ఇంటెలిజెన్స్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది.ఐఫోన్ వినియోగదారులు గతంలో తమ కాల్స్‌ను రికార్ట్ చేసుకునే అవకాశం లేకుండా పోయింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని యాపిల్ కొత్తగా ప్రవేశపెట్టిన ఐఓఎస్ 18.1లో ఈ ఫీచర్‌ను అందిస్తున్నారు. ఈ రికార్డ్ చేసిన కాల్ డేటాను రియల్‌టైమ్ ట్రాన్స్క్రిప్షన్ ద్వారా టెక్స్ట్ ఫార్మాట్లో అందించేందుకు వీలుగా యాపిల్ ఇంటెలిజెన్స్ పనిచేస్తుందని కంపెనీ తెలిపింది. అంటే మీరు ఫోన్లో మాట్లాడే మాటలు రికార్డ్ అవ్వడంతోపాటు మీ కన్వర్జేషన్ మొత్తం టెక్స్ట్ ఫార్మాట్లోకి మారుతుంది. అయితే ఈ యాపిల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, జాపనీస్, కొరియన్, ఫోర్చుగీస్, స్పానిష్..వంటి భాషల్లో అందుబాటులో ఉందని తెలిపింది.మీ ఐఫోన్ల్లో కాల్స్ రికార్డ్ చేయడానికి ముందుగా డివైజ్ సెట్టింగ్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా ఐఓఎస్ 18.1 వర్షన్‌ను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది.ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లుయాపిల్ ఇంటెలిజెన్స్ అనేది ఏఐ పవర్డ్ టూల్స్ సూట్‌గా పని చేస్తోంది.మెయిల్, మెసేజ్‌లు, నోట్స్ వంటి యాప్‌లలో సమగ్ర సమాచారాన్ని క్లుప్తంగా అందిస్తుంది.మెయిళ్లు, మెసేజ్‌లకు సంక్షిప్తంగా యూజర్ అనుమతితో రిప్లై ఇస్తుంది.ఏదైనా టెక్ట్స్, ఆర్టికల్ రాసేప్పుడు ప్రూఫ్ రీడింగ్ చేస్తుంది. రైటింగ్ అసిస్టెంట్‌గా పని చేస్తుంది.గ్యాలరీ స్టోరేజీలో ప్రత్యేకమైన రోజుల్లో మీ ఫోటోలు, వీడియోలు కలెక్ట్ చేసి మెమోరీస్‌ను క్రియేట్ చేస్తుంది.యాప్స్ వాడుతున్నప్పుడు ఇంటర్నల్‌గా ఎదురయ్యే ల్యాగ్‌ను తగ్గించేందుకు టూల్‌ను క్లిన్ చేస్తూంటుంది.చాట్‌జీపీటీను ఇంటిగ్రేట్ చేస్తూ కావాల్సిన సమాచారం అందిస్తుంది.ఇదీ చదవండి: మూడు ప్లాంట్ల మూసివేత.. 10 వేల మందికి ఉద్వాసన!ఐఓఎస్ 18.1 అన్ని ఐఫోన్ మోడళ్లలో సపోర్ట్ చేయదు. ఐఫోన్ 11, 12, 13, 14, 15, 16, ఎక్స్ఎస్, ఎక్స్ఆర్, ఎస్ఈ(2వ ఎడిషన్) డివైజ్‌ల్లో మాత్రమే వినియోగించవచ్చు. యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లను మాత్రం ఐఫోన్ 16 సిరీస్, 15 ప్రో సిరీస్, 14 ప్రో సిరీస్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. -
ముందుగానే యాపిల్ ఇంటెలిజన్స్ సూట్..?
సమగ్ర యాపిల్ ఇంటెలిజన్స్ సూట్ త్వరలోనే వినియోగదారులకు అందుబాటులోకి రాబోతున్నట్లు బ్లూమ్‌బర్గ్ నివేదించింది. ముందుగా మార్చి 2025 వరకు దీన్ని యాపిల్ ఉత్పత్తుల్లో తీసుకురావాలని సంస్థ గతంలో అధికారికంగా ప్రకటించింది. కానీ బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం సంస్థ గతంలో అనుకున్న సమయం కంటే ముందుగానే యాపిల్ ఇంటెలిజన్స్ సూట్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపింది.ఐఓఎస్ 18 సిరీస్‌లో యాపిల్ ఇంటెలిజన్స్ ద్వారా ‘సిరి’లో కొన్ని ఫీచర్లను అప్డేట్ చేయాలని భావిస్తోంది. అందుకు అనుగుణంగా మార్చి 2025 నాటికి ఐఓఎస్ 18.4 వెర్షన్లో సమగ్ర యాపిల్ ఇంటెలిజన్స్ సూట్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది. కానీ అంతకుముందే ఈ ఫీచర్లను వినియోగదారులకు అందించనున్నట్లు తెలిసింది. సంస్థ గతంలో ప్రకటించిన విధంగా ఐఓఎస్ 18 సిరీస్ వర్షన్లను ఎప్పుడు అప్డేట్ చేస్తారో తెలిపారు.అక్టోబర్ 2024: ఐఓఎస్ 18.1 ఏఐ ఫీచర్లు ప్రారంభిస్తారు.డిసెంబర్ 2024: ఐఓఎస్ 18.2తో కొన్ని అదనపు ఫీచర్లు ప్రవేశపెడుతారు.జనవరి 2025: ఐఓఎస్ 18.3తో ‘సిరి’ని మరింత మెరుగుపరుస్తారు.మార్చి 2025: ఐఓఎస్ 18.4తో సమగ్ర యాపిల్ ఇంటిలిజెన్స్ సూట్‌ను ప్రవేశపెడుతారు.బ్లూమ్‌బర్గ్ నివేదించిన ప్రకారంగా ముందుగానే యాపిల్ ఇంటిలిజెన్స్ సూట్‌ను ఆవిష్కరిస్తే పైన తెలిపిన ఐఓఎస్ వర్షన్ల విడుదల తేదీల్లో మార్పులుండే అవకాశం ఉంటుంది.ఇదీ చదవండి: కొత్తగా ఉద్యోగంలో చేరారా..? ఇవి తెలుసుకోండి..యాపిల్ ఇంటెలిజన్స్ ‘సిరి’లో గణనీయ మార్పులు చేయబోతున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అందులో ప్రధానంగా సిరి సందర్భోచితంగా వినియోగదారుల అవసరాలు తీర్చనుంది. ఉదాహరణకు మీ స్నేహితుడు మొబైల్లో మీకు తన కొత్త చిరునామాను పంపితే ‘ఈ చిరునామాను తన కాంటాక్ట్ కార్డ్‌కు యాడ్ చేయమని’ చెబితే సిరి ఆ పని పూర్తి చేస్తుంది. సుదీర్ఘ ఈమెయిళ్లు చదవడం సమయంతో కూడుకున్న వ్యవహారం. సిరి సాయంతో దాని సారాంశాన్ని తెలుసుకోవచ్చు. అందుకు అనుగుణంగా రిప్లై ఇవ్వొచ్చు. వీటితోపాటు మరిన్ని ఫీచర్లను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సంస్థ అధికారికంగా ప్రకటించిన తర్వాతే కంపెనీ అందించే ఫీచర్లపై స్పష్టత వస్తుంది.