![WhatsApp's New Update Allows Video Previews in Push Notifications - Sakshi](/styles/webp/s3/article_images/2018/11/23/Untitled-12%20copy_0.JPG.webp?itok=v_DIsicA)
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, ముంబై: ఫేస్‌బుక్ సొంతమైన ప్రముఖ చాటింగ్ యాప్ వాట్సాప్ తన ఐఓఎస్ బీటా యూజర్లకు కొత్త అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఈ అప్‌డేట్‌లో యూజర్లు తమకు వచ్చిన వీడియో మెసేజ్‌లను నోటిఫికేషన్ బార్‌లోనే ప్లే చేసుకునే సదుపాయం కల్పించారు.
అయితే ప్రస్తుతానికి బీటా వెర్షన్ 2.18.102.5కు అప్‌డేట్ అయిన ఐఓఎస్ యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్ కేవలం అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే ఐఓఎస్‌తో పాటు, ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌కు కూడా విస్తరిస్తామని కంపెనీ ప్రతినిథులు వెల్లడించారు. ఈ ఫీచర్‌ను వాడటానికి లేదా ఆపివేయడానికి సెట్టింగ్స్‌లోకి వెళ్లి ప్రివ్యూ మోడ్‌ను ఆఫ్ లేదా ఆన్ చేసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment