ఆసక్తికరమైన మరో కొత్త అప్‌డేట్‌పై వాట్సాప్ కసరత్తు చేస్తోంది. ఇదివరకే ఫార్వార్డ్ చేసిన ఫొటోలు, వీడియోలకు వివరణను జోడించే ఫీచర్‌ను తీసుకొస్తోంది. ఇటీవల గూగుల్ ప్లే ద్వారా బీటా వర్షన్ అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఈ అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేసిన కొంతమంది టెస్టర్‌లకు ఇప్పటికే కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్ ఫార్వార్డ్ చేసిన ఫొటోలు, వీడియోలు, GIFలు, డాక్యుమెంట్లకు వివరణలను జోడించేందుకు వీలు కల్పిస్తోంది.
(Isha Ambani: లగ్జరీ ఇంట్లో పార్టీ ఇచ్చిన ఇషా అంబానీ.. వీడియో, ఫొటోలు వైరల్!)
అయితే స్టేటస్ అప్‌డేట్‌లను వీక్షించడం, వీడియోలను డౌన్‌లోడ్ చేయడంలో ఇబ్బందులు వస్తున్నట్లు తెలుస్తోంది. వాట్సాప్ తదుపరి అప్‌డేట్‌తో ఈ సమస్యలను పరిష్కరిస్తుందని భావిస్తున్నారు. ఫార్వార్డ్ చేసిన ఫొటోలు, వీడియోలు, GIFలు, డాక్యుమెంట్లకు మరింత సమాచారాన్ని జోడించాలనుకునే యూజర్లకు కొత్త ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది.
(నిలిచిపోయిన నెట్‌ఫ్లిక్స్.. సబ్‌స్క్రయిబర్ల పరేషాన్)
వాట్సాప్ తాజా అప్‌డేట్ ద్వారా ఫార్వార్డ్ చేసిన ఫొటోలకు ఇదివరకే ఉన్న క్యాప్షన్‌ను తొలగించి సొంత క్యాప్షన్ జోడించవచ్చే అవకాశం ఉంది. ఇలా సొంత వివరణతో ఫార్వార్డ్ చేసినప్పుడు అది అసలైనది కాదని మాత్రం గ్రహీతలకు తెలిసిపోతుంది.
ఈ ఫీచర్ మరింత మంది యూజర్లకు అందుబాటులోకి వచ్చినప్పుడు దాని ప్రయోజనం గురించి మరింత బాగా తెలుస్తుంది. ఫార్వార్డ్ చేసిన ఫొటోలు, వీడియోలు, GIFలు, డాక్యుమెంట్లకు సందర్భం, ఇతర వివరాలను జోడించడం ద్వారా గ్రహీతలు వాటి గురించి మరింత ఎక్కువగా తెలుసుకునేందుకు అవకాశం కలుగుతుంది.
(Dulquer Salmaan: రూ.3 కోట్లు పెట్టి దుల్కర్ సల్మాన్ కొన్న కొత్త కారు ఏంటో తెలుసా?)
Comments
Please login to add a commentAdd a comment