WhatsApp Video
-
వాట్సప్ స్టేటస్ పెడుతున్నారా..? అదిరిపోయే అప్డేట్ మీ కోసమే!
మెటా ఆధ్వర్యంలోని వాట్సప్ తన వినియోగదారులకు అదిరిపోయే అప్డేట్ ఇవ్వబోతున్నట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. ఆ కథనాల ప్రకారం..ఇకపై 60 సెకన్ల నిడివితో ఉన్న వీడియోలను సైతం వాట్సప్ స్టేటస్‌లో అప్లోడ్ చేసే అవకాశాన్ని కల్పించనున్నట్లు సమాచారం. వాట్సప్ స్టేటస్‌లో ప్రస్తుతం గరిష్ఠంగా 30 సెకన్ల నిడివి ఉన్న వీడియోలను మాత్రమే పోస్ట్ చేసేందుకు అవకాశం ఉంది. అంతకంటే ఎక్కువ నిడివిఉన్న వీడియోలను నేరుగా పంపించాల్సిందే. స్టేటస్‌లో పెట్టుకునేందుకు అవకాశంలేదు. ఒకవేళ అలా స్టేటస్‌లో పెట్టాలంటే మరో వీడియో కింద మార్చిపెట్టాలి. వీడియో నిడివి పెరుగుతున్న కొద్దీ స్టేటస్ అప్డేట్ల సంఖ్య పెరుగుతుంది. దీన్ని పరిష్కరించేందుకు వాట్సప్ తాజా అప్డేట్ను తీసుకొస్తున్నట్లు తెలిసింది. ఒక నిమిషం నిడివితో ఉన్న వీడియోలను స్టేటస్‌లో అప్లోడ్ చేసే అవకాశం ఉండబోతుందంటూ సమాచారం. ఇప్పటికే దీన్ని ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. కొంత మంది బీటా యూజర్లకు ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. త్వరలో మిగిలిన యూజర్లందరికీ ఇది అందుబాటులోకి రానున్నట్లు తెలిసింది. ఇదీ చదవండి: 23 ఏళ్ల గరిష్ఠానికి చేరిన కీలక వడ్డీరేట్లు.. తగ్గింపు ఎప్పుడంటే.. ఇదిలాఉండగా, పేమెంట్స్‌కు సంబంధించి వాట్సప్ మార్పు చేస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం వాట్సప్‌లో చెల్లింపులు చేయాలంటే త్రీ డాట్స్ మెనూలో పేమెంట్స్‌లోకి వెళ్లాల్సి వస్తోంది. ఇకపై ఆ అవసరం లేకుండా మనం ఎంచుకున్న కాంటాక్ట్ చాట్‌లోనే పై భాగంలో క్యూఆర్ కోడ్ సింబల్ ఉంటుంది. దానిపై క్లిక్ చేసి పేమెంట్ చేయొచ్చు. ఈ ఫీచర్ కూడా త్వరలో అందుబాటులోకి రానుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. -
యువతితో వీడియో కాల్: మీ ఇంటికొచ్చి మీ భార్యకు అన్నీ చెబుతా..
► ఏప్రిల్ 14న అనంతపురంలోని ఓ కాలేజీలో బీఎస్సీ రెండో సంవత్సరం చదువుతున్న విక్రమ్‌కు వీడియోకాల్ వచ్చింది. ఆన్ చేయగానే యువతి నగ్నంగా కనిపించింది. ఇంకేముంది విక్రమ్ ఆసక్తిగా మాట్లాడాడు. కాల్ పూర్తయ్యాక వీడియో రికార్డింగ్ మొత్తం మొబైల్‌కు వచ్చింది. తర్వాత ఆ యువతి డబ్బు డిమాండ్ చేసింది. ► అనంతపురం సాయినగర్‌లో కేఫ్ యజమానికీ ఇలాగే కాల్ రావడంతో మాట్లాడాడు. అమ్మాయి మాటలు నమ్మి ఇంటి చిరునామా, పర్సనల్ మొబైల్ నంబర్ అన్నీ ఇచ్చాడు. మాట్లాడిన వీడియోలు పంపుతూ టార్చర్ పెడుతోందని వాపోయాడు. మీ ఇంటికొచ్చి మీ భార్యకు అన్నీ చెబుతానంటూ కూడా భయపెడుతోందని తెలిపాడు. సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఏదో రకంగా డబ్బు సంపాదించాలి.. కష్టపడకుండానే డబ్బు వచ్చి ఒళ్లో వాలిపోవాలి. చుక్క చెమట పట్టకుండా లక్షాధికారులు కావాలి.. పెడదారిలో వెళుతున్న యువత ఆలోచనలు ఇవీ. సామాజిక మాధ్యమాలు వచ్చిన తర్వాత బ్లాక్‌మెయిలింగ్ మరింతగా పెరిగింది. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా మాయ చేసి మోసగిస్తున్నారు. ఇటీవల అనంతపురంలో జరిగిన కొన్ని ఘటనలతో కుర్రాళ్లు బెంబేలెత్తుతున్నారు. ఆశ పడితే.. అధోగతే! కొంతమంది అమ్మాయిలు వీడియోకాల్ చేస్తారు. ఫోన్ లిఫ్ట్ చేయగానే నగ్నంగా కనిపిస్తారు. వెంటనే ఫోన్ కట్ చేస్తే ఫరవాలేదు. కొంతమంది కుర్రాళ్లు ఇలాంటి దృశ్యాలు చూసి ‘ఆశ’గా మాటలు కలుపుతారు. కుర్రాళ్లను కూడా బట్టలు లేకుండా వీడియోకాల్‌లోకి రావాలని కోరుతారు. ఈ వీడియోను రికార్డింగ్ చేస్తారు. ఇలా మాట్లాడుతుండగానే ఫోన్‌కట్ అవుతుంది. ఆ తర్వాత వాట్సాప్ కాల్ చేస్తారు. బ్లాక్మెయిల్ ఇలా చేస్తున్నారు.. ఎవరైతే వీడియోకాల్‌లో మాట్లాడారో ఆ వీడియోను మొబైల్‌కు పంపిస్తారు. అనంతరం డబ్బులు పంపించాలని డిమాండ్ చేస్తారు. లేదంటే ఈ వీడియోను ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తామని బెదిరిస్తారు. ఈ వీడియోలో ఇరువురి ఫొటోలు ఉంటాయి. కాబట్టి ఒక్కసారిగా అబ్బాయిలు కలవరపాటుకు గురవుతారు. ఎంతోకొంత ఫోన్ పే చేసి వదిలించుకుంటారు. డబ్బులు ఇవ్వకపోతే వీడియోను ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలతో యువకులు బలవన్మరణాలకు పాల్పడుతున్న సందర్భాలూ లేకపోలేదు. ఇది ఒకరకంగా హనీట్రాప్ లాంటిదని పోలీసులు చెబుతున్నారు. సైబర్ మోసాలపై అప్రమత్తం సైబర్ మోసాలు పెరుగుతున్నాయి. మనకు తెలియని వ్యక్తులు వీడియోకాల్ చేసినా, లింక్‌లు పంపినా వాటిని క్లిక్ చేయొద్దు. చాలామంది మొబైల్స్‌లో ఇలాంటి లింకులతో కొత్త యాప్ చేరి మన ఆధారాలన్నీ దొంగల చేతికి వెళుతున్నాయి. ఖాతాల్లో సొమ్ము పోవడానికీ ఇదే కారణం. మొబైల్లో ఉన్న ఇలాంటి దొంగ యాప్‌లను తొలగించడం కూడా చాలామందికి తెలియదు. అందుకే పోలీసులతోనే వీటిని మొబైల్‌నుంచి ఎలా తొలగించాలో ప్రొజెక్టర్ల ద్వారా చూపించి చేయాలని నిర్ణయించాం. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మొబైల్స్‌లో ప్రమాదకర యాప్‌లను తొలగించే ప్రక్రియ చేపడుతున్నాం. – ఆర్ఎన్. అమ్మిరెడ్డి, డీఐజీ, అనంతపురం రేంజ్ -
వాట్సాప్ కాల్ సాయంతో ప్రసవం
శ్రీనగర్: నొప్పులతో విలవిల్లాడుతున్న గర్భిణికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్సీ) సిబ్బంది వాట్సాప్ కాల్ సాయంతో సురక్షితంగా ప్రసవం చేసిన సంఘటన జమ్మూకశ్మీర్‌లో జరిగింది. కుప్వారా జిల్లాలోని కెరాన్ పీహెచ్‌సీకి నెలలు నిండి, నొప్పులు మొదలైన గర్భిణిని కుటుంబ సభ్యులు శుక్రవారం రాత్రి తీసుకొచ్చారు. ఎక్లామ్‌ప్సియా, ఎపిసియోటోమీతో బాధపడుతున్న ఆమెకు ప్రసవం జరగడం కష్టతరంగా మారింది. తీవ్రంగా మంచు కురుస్తుండడంతో హెలికాప్టర్లో జిల్లా ఆసుపత్రికి తరలించడం వీలు కాలేదు. దీంతో కెరాన్ పీహెచ్సీ డాక్టర్లు క్రాల్పొరాలోని జిల్లా ఉప ఆసుపత్రి వైద్యులను సంప్రదించారు. ఆఆసుపత్రి వైద్యుడు డాక్టర్ పర్వేజ్ వాట్సాప్ కాల్లో సూచనలు ఇస్తుండగా, కెరాన్ పీహెచ్సీ వైద్యులు మహిళకు విజయవంతంగా ప్రసవం చేశారు. ఆడ శిశువు జన్మించిందని, తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు చెప్పారు. -
వీడియో కాల్‌తో విపత్తు.. ఫోన్ లిఫ్ట్ చేశామో పోర్న్ చిత్రాలతో ఎడిట్ చేసి..
సాక్షి, బెంగళూరు: సైబర్ కేటుగాళ్లు కొత్త అస్త్రంగా వాట్సాప్ వీడియో కాల్ ద్వారా వల వేస్తున్నారు. గుర్తుతెలియని లింక్‌ల ద్వారా అశ్లీల వీడియోలను పంపుతారు, వాటిని చూస్తే చాలు దీనిని అడ్డు పెట్టుకుని బ్లాక్మెయిల్ కు పాల్పడి డబ్బు గుంజేస్తారు. అందులో ఎక్కువగా ఇటీవల విశ్రాంత ఉద్యోగులు, వృద్ధులను టార్గెట్‌గా చేసుకున్నారు. పోర్న్ చిత్రాలతో ఎడిట్ చేసి ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్టా గ్రాంలో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించి పరిచయం చేసుకుని మోసానికి పాల్పడడం, లేదా నేరుగా వాట్సాప్‌లో వీడియో కాల్ చేయడం జరుగుతుంది. వీడియో కాల్చేసి మాట్లాడుతున్న సమయంలో ఒక్కసారిగా నగ్నచిత్రాలు చూపిస్తారు. అలా కాల్‌ను స్క్రీన్‌షాట్ లేదా రికార్డ్ చేసుకుని బ్లాక్‌మెయిల్‌కు దిగుతారు. డబ్బులు ఇవ్వకపోతే లైంగికంగా వేధించారని కేసు పెడతామని, సోషల్ మీడియాలో పోస్ట్ చేసి పరువు తీస్తామని హెచ్చరిస్తారు. దీంతో ఎక్కువమంది డబ్బులు పంపించి మోసపోయారు. అలాగే వాట్సప్, ఎస్ఎంఎస్ల ద్వారా లింక్‌లను పంపి ఇదే తరహా మోసాలు జరుగుతున్నాయి. ఒకరికి రూ. 6.95 లక్షల టోపీ ఆర్పీసీ లేఔట్లో నివాసం ఉండే విశ్రాంత అధికారి వంచనకు గురై రూ.6.95 లక్షలు పోగొట్టుకున్నాడు. గత నెల 20వ తేదీన అంకితా గుప్త అనే మహిళ అతని వాట్సాప్‌కు వీడియో కాల్చేసింది. ఫోన్ తీయగానే అటువైపు నుంచి నగ్నవీడియో కనబడింది. ఈ దృశ్యాలను వంచకులు రికార్డుచేసుకుని వీడియో ఎడిట్ చేశారు. ఫోన్ చేసి డబ్బు డిమాండ్ చేశారు. డబ్బు ఇవ్వకపోతే యువతి నగ్నవీడియో చూడటాన్ని సోషల్‌మీడియాలో అప్లోడ్ చేస్తామని చెప్పి రూ.6.95 లక్షలు కాజేశారు. చివరకు బాధితుడు పశ్చిమ విభాగ సీఈఎన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. చదవండి: (మీరే రూల్స్ ధిక్కరిస్తారా?.. పోలీసులకు క్లాస్ పీకిన మహిళ) సైబర్‌క్రైం పోలీసుల సలహాలు ►ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్టా అకౌంట్ల ప్రొఫైల్స్ లాక్ చేయడం మంచిది. డేటాను నేరగాళ్లు సేకరించే అవకాశం ఉండదు ►గుర్తుతెలియని వ్యక్తుల నుంచి దూరంగా ఉండాలి ►గుర్తుతెలియని నంబరు నుంచి వీడియో కాల్ వస్తే జాగ్రత్త వహించాలి ►అశ్లీల వీడియోలు, ఫోటోలు చూడటం, ఆ వెబ్సైట్లలో చాటింగ్ చేయడం మంచిదికాదు. ►ఎవరైనా బ్లాక్మెయిల్ చేస్తే తక్షణమే సైబర్ క్రైం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. యువతికి రూ.2.33 లక్షల వంచన బనశంకరి: మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లో వరుని కోసం గాలిస్తున్న యువతి నుంచి మోసగాడు రూ.2.33 లక్షలు కాజేశాడు. ఉళ్లాల ఉపనగరకు చెందిన సుస్మిత (28) వరుడు కావాలని వివరాలు నమోదు చేసింది. రాజీవ్ అనే వ్యక్తి పరిచయం చేసుకున్నాడు. నేను విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నానని త్వరలో భారత్‌కు వస్తానని చెప్పాడు. ఇద్దరూ కాల్స్, చాటింగ్ చేసుకుంటూ ఉన్నారు. భారత్‌కు రాగానే పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. కొద్దిరోజులకిందట ఫోన్‌చేసి తాను ఇండియాకు వచ్చానని, తన వద్ద ఉన్న విదేశీ కరెన్సీని మార్చుకోవడానికి కొంత రుసుము కావాలని చెప్పగా సుస్మిత అతని ఖాతాలకు రూ.2.33 లక్షలు పంపింది. ఇక అప్పటి నుంచి రాజీవ్ పత్తా లేడు. దీంతో బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. మీకోసం
ప్రముఖ మెసేంజర్ యాప్ (Whatsapp) వాట్సాప్ అదిరిపోయే ఫీచర్లతో అనతి కాలంలోనే కోట్లాది యూజర్లను సంపాదించుకున్న సంగతి తెలసిందే. ఎప్పటికప్పుడు ఆధునిక టెక్నాలజీతో తమ వినియోగదారులకు సేవలందించడంలో తగ్గేదేలే అన్నట్లు దూసుకుపోతోంది. తాజాగా ఈ యాప్‌లో మరో కొత్త ఫీచర్‌ని జతచేస్తోంది. యూజర్లకు బెస్ట్ కాలింగ్ ఎక్స్పీరియన్స్ కోసం ఈ ఫీచర్‌ని వాట్సాప్ ప్రవేశపెడుతోంది. వాయిస్ కాలింగ్ కోసం కాల్ లింక్‌ల ఫీచర్‌ను విడుదల చేసింది. యూజర్లు కేవలం ఒక ట్యాప్‌లో వాట్సాప్ వాయిస్ కాల్ చేయవచ్చని తెలిపింది. ఈ ఫీచర్ ఉపయోగించాలంటే, యూజర్లు కాల్స్ ట్యాబ్‌లో అందుబాటులో ఉన్న ‘కాల్ లింక్‌లు’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఆ తర్వాత వీడియో లేదా ఆడియో కాల్ లింక్‌ను క్రియేట్ చేసుకుని వారి కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఈజీగా వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. కాల్ లింక్‌లను ఉపయోగించేందకు యూజర్లు వారి వాట్సాప్ యాప్‌ను లేటెస్ట్ వెర్షన్‌కి అప్‌గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. వాట్సాప్‌లో ఈ కాల్ లింక్‌ల ఫీచర్‌ను దశలవారీగా ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు. మెటా సీఈఓ (Meta CEO) మార్క్ జుకర్‌బర్గ్ మాట్లాడుతూ.. 32 మంది వ్యక్తుల కోసం సేఫ్ ఎన్క్రిప్టెడ్ వీడియో కాలింగ్‌ను పరీక్షిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే జూమ్, మైక్రోసాఫ్ట్ టీమ్స్‌తో సహా ఇతర గ్రూప్ వీడియో కాలింగ్ ప్లాట్‌ఫాంలు సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: ఒకటికి మించి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయా? ఇలాగైతే సమస్యలు తప్పవ్! -
ఆ వెబ్‌సైట్‌ను చూస్తుండగా వాట్సాప్‌కు వీడియో.. తీరా చూస్తే అందులో..
అనంతపురం శ్రీకంఠంసర్కిల్: యువత బలహీనతను ఆసరా చేసుకొని.. అందమైన అమ్మాయిలతో వలపు వల విసిరి అడ్డంగా దోచేస్తున్న సైబర్ ముఠా ఆగడాలు పెరిగిపోయాయి. హాయ్ అన్న చిన్న పదానికి స్పందిస్తే చాలు గంటల వ్యవధిలోనే వాట్సాప్ ద్వారా వచ్చే కాల్స్‌ను వద్దనుకున్నా.. టచ్ చేసి తీరుతారు. అందులో నగ్నంగా కనిపించే యువతి ఫొటోను మీరు గమనిస్తుండగా స్క్రీన్ షాట్ తీసి మళ్లీ మీకే పంపుతారు. చదవండి: భర్తను దారికి తెచ్చుకోవాలనుకుంది.. చివరికి షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన భార్య ఆ తర్వాత బ్లాక్మెయిల్.. వేధింపులు షరామాములే. అవతలి వారు డిమాండ్ చేసిన మేరకు డబ్బు చెల్లించుకోకపోతే మానసిక వేదన తప్పదు. ఈ తరహా చిక్కులో పడి ఎందరో నలిగి పోతున్నారు. వారిలో కొందరు ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. మరికొందరు వలపుల వలలో చిక్కుకుని జేబులు గుల్ల చేసుకుంటున్నారు. చాలారోజుల క్రితం రాజస్తాన్‌లోని భరత్‌పూర్‌కు చెందిన ఓ ముఠాను తెలంగాణా పోలీసులు అరెస్ట్ చేసి రూ. 25 కోట్లు కాజేసినట్లు నిర్ధారించారు. 18 రాష్ట్రాల్లో ఈ ముఠా తన నెట్‌వర్క్‌ను విస్తరించినట్లు అప్పట్లో పోలీసులు గుర్తించారు. ఈ లెక్కన వలపుల వల విసరడంలో ఈ ముఠాలు ఎంతగా ఆరితేరాయో ఇట్టే అర్థమవుతోంది. ఫేస్ బుక్‌తో చాటింగ్ ప్రారంభించి...వాట్సప్‌తో వసూళ్లకు దిగుతున్న ఈ ముఠాలతో తస్మాత్ జాగ్రత్త అంటున్నారు అనంత పోలీసులు. మోసపోయిన కొందరు.. శ్రీసత్యసాయి జిల్లా రామగిరి మండలం నుంచి ఉన్నత చదువుల నిమిత్తం నగరానికి వచ్చిన ఓ యువకుడు వలపుల వలలో చిక్కుకున్న వైనం ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రైవేటు హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న ఆ యువకుడు.. రాత్రి వేళ పోర్న్ వెబ్‌సైట్‌ను చూస్తుండగా అతని వాట్సాప్‌కు ఓ వీడియో వచ్చింది. తీరా చూస్తే అందులో తాను చూస్తున్న వీడియోలో అమ్మాయితో తాను ఉన్నట్లుగా ఉంది. అవాక్కైన అతను తేరుకునేలోపు అవతలి నుంచి మరో సందేశం వచ్చింది. తాము కోరిన మేరకు డబ్బు చెల్లించాలని లేకపోతే ఆ వీడియోను వెబ్సైట్లో పెడతామంటూ బెదిరిస్తున్నట్లుగా మెసేజ్ చేశారు. దీంతో తన చదువుల కోసం దాచుకున్న డబ్బు కాస్త బ్లాక్‌మెయిలర్ చెప్పిన ఖాతాకు జమ చేశాడు. ఇంతటితో విషయాన్ని ఆపలేదు. తరచూ డబ్బు కోసం వేధిస్తుండడంతో విషయాన్ని తన మిత్రుల ద్వారా తండ్రికి చేరవేశాడు. తల్లిదండ్రులు ఆ యువకుడిని మందలించి ఫోన్లో బ్లాక్ మెయిల్ చేస్తున్న వారిని గట్టిగా హెచ్చరించడంతో వివాదం సద్దుమణిగింది. కాగా, అప్పటికే ఆ యువకుడు రూ.వేలల్లో బ్లాక్‌మెయిలర్‌కు నగదు బదిలీ చేశాడు. జిల్లా కేంద్రానికి చెందిన ఓ సంఘం నాయకుడి మొబైల్‌కు రాత్రి 10 గంటల సమయంలో హాయ్ ఎలా ఉన్నారంటూ ఓ మెస్సేజ్ వచ్చింది. తెలిసిన వారేమోనని అతను స్పందించాడు. నిమిషాల వ్యవధిలో అతనికి వీడియో ఫోన్ కాల్ వచ్చింది. తీసి చూస్తే న్యూడ్‌గా ఓ యువతి దర్శనమిచ్చింది. మొదట భయపడిన ఆయన కొద్ది క్షణాల పాటు ఆ అమ్మాయి ఎవరోనని చూసి ఫోన్ కట్ చేశాడు. ఇక రాత్రంతా ఒకటే గోల మేము పంపిన నంబరుకు ఫోన్‌పే ద్వారా మీరు డబ్బు పంపక పోతే మీ పరువు తీస్తామంటూ బెదిరింపులకు దిగారు. నేనేం తప్పు చేశానో? చెప్పమంటూ వారితో అతను వాదించాడు. అదే సమయంలో స్క్రీన్ రికార్డు చేసిన చిన్న వీడియో క్లిప్‌ను బ్లాక్‌మెయిలర్ పంపాడు. అందులో ఆ అమ్మాయి న్యూడ్‌గా ఉన్న వీడియోను తాను చూస్తున్నట్లుగా ఉంది. ఈ వీడియోని మీ ఫేస్బుక్లో ఉన్న మిత్రులు, పొలిటికల్ లీడర్లకు పంపుతామని బెదిరించారు. ఏం చేయాలో పాలుపోక తెలిసిన పోలీసు మిత్రుడికి చెప్పి ఆయనతో ఫోన్లో బ్లాక్ మెయిలర్‌ని హెచ్చరికలు జారి చేయించి బయటపడ్డాడు. కాకపోతే అప్పటికే ఆ నేత రూ.18 వేలు ఫోన్‌ఫే ద్వారా బ్లాక్‌మెయిలర్‌కు బదిలీ చేయడం గమనార్హం. రోజుకో రూపంలో మోసాలు సైబర్ నేరగాళ్లు రోజుకో రూపంలో మోసాలకు తెగబడుతున్నారు. స్మార్ట్ ఫోన్ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి. వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో ఉంచకూడదు. సెల్ఫోన్లో చిన్నపాటి ప్రైవసీ సెట్టింగ్ చేసుకుంటే చాలా మంచిది. ప్రధానంగా ఫేస్బుక్ హ్యాక్, వాట్సాప్, మెస్సేంజర్, వీడియో కాల్స్ ద్వారా ఆకర్శించి దోపిడీ చేస్తున్నారు. కొత్త వ్యక్తుల నుంచి వీడియోకాల్స్, సందేశాలకు స్పందించకపోతే సురక్షితంగా ఉన్నట్లే. కాదని ఆకర్శితులైతే బ్లాక్మెయిలర్స్ వలలో పడక తప్పదు. కొత్త వ్యక్తులు పంపే సందేశాలు, లింకులను అసలు ఓపెన్ చేయవద్దు. ఒకవేళ ఇలాంటి ఉచ్చులో పడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. – డాక్టర్ ఫక్కీరప్ప, ఎస్పీ, అనంతపురం -
మాయలేడీలు.. న్యూడ్ వీడియోలతో వలపు వల..
సాక్షి, కామారెడ్డి: అపరిచిత మహిళల ఫోన్ కాల్స్ విషయంలో కొందరు చేస్తున్న ‘తప్పు’టడుగులు వారిని ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. ముందువెన కా ఆలోచించకుండా అపరిచిత మహిళలతో జరిపే సంభాషణలు దారితప్పి వారి మెడకే చుట్టుకుంటున్నాయి. కైపెక్కించే మాయ మాటలతో మాయలేడీలు విసురుతున్న వలలో చిక్కి ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవలి కాలంలో జిల్లాలో పలువురు వలపు వలలో పడి మానసిక ఆందోళనకు గురవుతున్నారు. చదవండి: వివాహేతర సంబంధం.. ఇంట్లో సహజీవనం చేస్తున్న వ్యక్తితో కనిపించడంతో.. తెలిసీ తప్పు చేశామని తరువాత బాధపడుతున్నారు. విషయం ఎవరికీ చెప్పుకోలేక, బయటకు పొక్కితే పరువు ఎక్కడ పోతుందోనన్న ఆందోళనతో మనోవ్యధకు గురవుతున్నారు. భిక్క నూరులో ప్రభుత్వ ఉద్యోగి ఒకరు వలపు వలలో పడిన విషయంలో ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం సంచలనం కలిగించింది. ఇటీవల జిల్లాలో జరిగిన పలు ఘటనలను పలువురు ‘సాక్షి’కి వివరించారు. జిల్లా కేంద్రానికి చెందిన ఓ ఉద్యోగి కూడా వలపు వలలో పడి ఇబ్బందులపాలయ్యాడు. చాలా డబ్బు లు పోగొట్టుకున్నానని బాధితుడు ‘సాక్షి’కి వివరించాడు. ఎల్లారెడ్డికి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి కూడా ఓ తల్లీకూతురు వలపు వలలో చిక్కి ఆర్థికంగా చితికిపోయాడు. వీడియోకాల్స్‌తో తల్లీ కూ తురు న్యూడ్‌గా లైవ్‌లో కనబడడం, దానికి సదరు వ్యక్తి కూడా న్యూడ్‌గా మారి వాళ్లు ఆన్లైన్లో డబ్బు లు పంపమని కోరినపుడల్లా పంపాల్సి వచ్చింది. వేల రూపాయలు వారికి చెల్లించాడు. అప్పట్లో కామారెడ్డి పట్టణంలోని కాకతీయనగర్‌లో నివసించే ఓ గ్రామ స్థాయి ప్రజాప్రతినిధి మాయలేడీల వలలో పడి ఇబ్బందులు పడిన విషయం ‘సాక్షి’ పాఠకులకు విధితమే. వీడియోకాల్‌తో కైపెక్కిస్తున్నారు.. వారం, పది రోజులు మాట్లాడిన మాయలేడీలు ఓ సారి వీడియోకాల్ చేయండి సార్ అంటారు. ఇంకేముంది మనోడు ఆ మాయలో పడి వీడియో కాల్ చేయడం, ఆమెను చూసి చొంగచార్చుకోవడం జరుగుతోంది. రోజూ ఒకటి, రెండు సార్లు వీడియో కాల్ చేస్తూ మరింత దగ్గరవుతున్నారు. భార్య, సెక్స్ విషయాలను ఓపెన్‌గా మాట్లాడుతూ ‘నేను నచ్చా నా’ అంటూ మొదలవుతుంది. వీడియో కాల్లో ఉండగానే న్యూడ్‌గా మారుతున్నారు. దీంతో మగవాళ్లు కూడా ఆ మత్తులో న్యూడ్ అవుతున్నారు. ఎంతోమంది బాధితులు.. మాయలేడీలు విసురుతున్న వలలో చిక్కి ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు. నమ్మించే మాటలతో, కైపెక్కించే వలపులతో వలలో వేసుకుని ఆర్థికంగా, మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు. జిల్లాలో చాలామంది ఇలా మోసపోతూనే ఉన్నారు. కొందరైతే తెలిసి మరీ మోసపోతున్నారు. అయితే తమకు జరిగిన ఇబ్బందిని బయటకు చెప్పుకుంటే పరువు పోతుందని వెనకడుగు వేస్తున్నారు. మాయలేడీల వలలో పడకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. తియ్యటి మాటలతో స్నేహం అపరిచిత మహిళలు ఫోన్ చేసి ‘సార్’ అంటూ తియ్యగా మాట్లాడతారు. ఎవరు అని ప్రశ్నిస్తే మేం వేరే వాళ్లకు కాల్ చేశామని, పొరపాటున మీ కు వచ్చిందంటూ సారీ చెబుతారు. పరవాలేదని అంటే చాలు ‘మీ పేరు, మీ ఊరు సార్, ఏం చేస్తారు సార్’ అంటూ మాటలు కలుపుతారు. ఆడగొంతు, ఆపై తియ్యగా మాట్లాడడంతో సహజంగా మగవాళ్లు వాళ్లతో మాట కలపడం, ఇదే అదనుగా అపరిచిత మహిళ మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుంది. రోజూ కాల్ చేసి ఏదో మాట్లాడుతూ టైంపాస్ చేయడం ద్వారా, ఆమె ఫోన్ కోసం ఎదురుచూసే పరిస్థితిని తీసుకువస్తున్నారు. వీడియో కాల్ రికార్డులు పంపి బ్లాక్ మెయిలింగ్.. పది, పదిహేను రోజులుగా ఫోన్‌కాల్ ఆ తరు వాత వీడియో కాల్స్ ద్వారా దగ్గరైన మహిళలు న్యూడ్ వీడియోలను రికార్డు చేసి, వాటిని వాట్సాప్‌కు పంపుతున్నారు. ఆ వీడియోలను చూసి మనోళ్లు షాక్ అవ్వాల్సిందే. వీడియో క్లిప్పింగులు పంపి, డబ్బులు డిమాండ్ చేస్తున్నా రు. అడిగినన్ని డబ్బులు ఇవ్వకపోతే సోషల్ మీ డియాలో వైరల్ చేస్తామంటూ బ్లాక్ మెయిలింగ్‌కు దిగుతున్నారు. కొందరు బతిమాలుకుని ఎంతో కొంత డబ్బు అప్పగించి క్లోజ్ చేసుకుంటుండగా, డబ్బులు ఇవ్వని వారిని మానసికంగా వేధిస్తున్నారు. -
వీడియో కాల్‌తో వివాహితకు వేధింపులు
సాక్షి, హైదరాబాద్: ఓ వివాహిత ఫొటోలను అశ్లీలంగా మార్చి ఆమె భర్తకు, కుటుంబ సభ్యులకు, స్నేహితులకు వాట్సాప్‌లో పంపించడంతో పాటు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వేధించిన ప్రబుద్ధుడిని రాచకొండ సైబర్ పోలీసులు పట్టుకున్నారు. ఇన్స్పెక్టర్ జె.నరేందర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్ రాష్ట్రం కిషన్‌గంజ్‌కు చెందిన మహమ్మద్ ఇజ్రాయిల్ (28) అబ్దుల్లాపూర్‌మెట్ సాదుపల్లికి వలస వచ్చి కూలీ పనులు చేస్తున్నాడు. అదే ప్రాంతంలో కూరగాయల విక్రయించే బాధితురాలి దుకాణానికి తరచూ వెళ్లేవాడు. ఈ క్రమంలో మోహం పెంచుకున్న ఇజ్రాయిల్.. ఆమె ఫోన్ నంబర్ తీసుకొని వాట్సాప్ వీడియో కాల్ చేశాడు. ఆమెకు తెలియకుండా వీడియో కాల్‌ను స్క్రీన్ షాట్ తీశాడు. ఆ తర్వాత నిందితుడు బాధితురాలికి ఫోన్ చేసి తనతో వీడియో కాల్ మాట్లాడాలని బలవంతం చేశాడు. ఆమె నిరాకరించడంతో పగ పెంచుకున్నాడు. ఎలాగైనా ఆమె వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలని కుట్ర పన్నాడు. స్క్రీన్ షాట్ తీసిన ఆమె ఫొటోలను అశ్లీలంగా చిత్రీకరించి, కాల్ గర్ల్‌గా పేర్కొంటూ వివిధ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాంలలో పోస్ట్ చేశాడు. అంతటితో ఆగకుండా ఫొటోలను ఆమె భర్తకు పంపించడంతో పాటు పలు వాట్సాప్ నంబర్ల నుంచి ఫోన్ చేసి భార్య గురించి అసభ్యకరంగా దూషించాడు. దీంతో బాధితురాలు రాచకొండ సైబర్ క్రైమ్స్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు... సాంకేతిక ఆధారాలు సేకరించి నిందితుడు ఇజ్రాయిల్‌ను అరెస్ట్ చేసి, జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. అతడి నుంచి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. (చదవండి: మహిళా ఎస్ఐ ఆత్మహత్య.. కారణం అదేనా..?) -
ఆ వీడియో కాల్ ఎత్తారో..బతుకు బస్టాండే
సాక్షి, హైదరాబాద్: ‘నార్సింగికి చెందిన వ్యక్తికి గుర్తు తెలియని నంబర్ నుంచి వాట్సాప్ వీడియో కాల్ వచ్చింది. కాల్ లిఫ్ట్ చేయగానే అటువైపు స్క్రీన్‌పై ఎలాంటి ఆడియో, వీడియో లేదు. తెర బ్లాక్‌గా కనిపించింది. కాల్ కట్ అయిన కొన్ని నిమిషాల తర్వాత.. తనకొచ్చిన మెసేజ్ చూసి బాధితుడు షాకయ్యాడు. తన ముఖాన్ని మార్ఫింగ్ చేసిన న్యూడ్ వీడియో అది! అడిగినంత డబ్బులు ఇవ్వకుంటే ఈ వీడియోను కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న స్నేహితులు, బంధువులకు పంపిస్తామని సైబర్ నేరస్తులు బెదిరించారు. దీంతో ఏం చేయాలో తోచని బాధితుడు మొదట రూ.5 వేలు ఆన్లైన్లో చెల్లించి, దాని స్క్రీన్ షాట్‌ను షేర్ చేశాడు. మరోసారి ఫోన్ చేసిన నిందితులు రూ.30 వేలు డిమాండ్ చేశారు. భయపడిపోయిన బాధితుడు మళ్లీ సమర్పించుకున్నాడు. ఈసారికి రూ.20 వేలు పంపించాలని బెదిరించడంతో అలాగే పంపాడు. అయినా వారి నుంచి బెదిరింపులు ఆగకపోవటంతో పోలీసులను ఆశ్రయించాడు.’ ఇప్పటివరకు సైబర్ నేరస్తులు అమ్మాయిలుగా బాధితులకు ఫోన్ చేసేవారు. చదవండి: (Hyderabad: రోడ్లపై వాహనాలను వదిలేస్తున్నారా.. అయితే ఇక కష్టమే..) కొద్ది సేపు మాట్లాడిన తర్వాత నగ్నంగా వీడియో కాల్ చేసుకుందామని నమ్మించేవారు. బాధితుడికి అవతలి వైపున కనిపించే న్యూడ్ అమ్మాయి నిజమేనని భావిస్తాడు. వాస్తవానికి అక్కడ ప్లే అయ్యేది అశ్లీల వీడియో మాత్రమే. ఈ విషయం తెలియని బాధితుడు అవతలి వ్యక్తి సూచించినట్లుగా న్యూడ్‌గా మారతాడు. ఈ తతంగమంతా సైబర్ నేరస్తులు రికార్డ్ చేస్తారు. ఆ తర్వాత కొద్ది సేపటికి బాధితుడికి ఫోన్ చేసి తన న్యూడ్ వీడియోను పంపించి, బ్లాక్ మెయిల్ చేస్తారు. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే కాల్ లిస్ట్‌లో ఉన్న స్నేహితులు, బంధువులకు ఈ వీడియో పంపిస్తామని బెదిరించేవారు. కానీ, తాజాగా నార్సింగి పీఎస్‌లో నమోదైన వాట్సాప్ వీడియో కాల్లో.. నేరస్తుల తరుఫున ఆడియో గానీ వీడియో గానీ ప్లే అవ్వలేదు. కేవలం బాధితుడి వీడియోను రికార్డ్ చేసి, ఆపై దాన్ని న్యూడ్‌గా మార్ఫింగ్ చేసి బెదిరించి అందినకాడికి దోచుకున్నారు. బాధితుల నంబర్లు ఎక్కడివి? సాధారణంగా సైబర్ నేరస్తులు బాధితుల ఫోన్ నంబర్లను సోషల్ మీడియా ఖాతాల నుంచి సేకరిస్తుంటారు. మరికొంత మంది నేరస్తులు జాబ్ పోర్టల్స్, షాపింగ్ వెబ్సైట్లలో నమోదయిన ఫోన్ నంబర్లను థర్డ్ పార్టీ నుంచి కొనుగోలు చేస్తుంటారని ఓ సైబర్ క్రైమ్ పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. అయితే ఈ కేసులో బాధితుడి నంబర్ నేరస్తుల చేతికి ఎలా చిక్కిందనేది ఇంకా తేలలేదని తెలిపారు. -
వాట్సాప్ స్టేటస్ వీడియోలు, ఫొటోలూ డౌన్లోడ్ చేసుకోవడం ఎలా?
ప్రస్తుతం ప్రతి ఒక్కరి మొబైల్ ఫోన్ లో కచ్చితంగా వాట్సాప్ ఉంటుంది. ప్రతి వ్యక్తి తమ ఫీలింగ్స్ వ్యక్తపరచడానికి వాట్సాప్ స్టేటస్ లో వీడియోనో, ఫొటోనో పెడుతుంటారు. కొందరు తమకు నచ్చిన వీడియో లేదా ఫోటోలను వాట్సాప్ స్టేటస్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని ప్రయత్నిస్తారు. కానీ, ప్రస్తుతానికి డౌన్లోడ్ చేసుకోవాలంటే వాట్సాప్‌లో అలాంటి ఫీచర్ ఇంకా రాలేదు. కొన్ని సింపుల్ స్టెప్స్ ద్వారా అత్యంత తేలిగ్గా డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. దీనికోసం క్రింద పేర్కొన్న స్టెప్స్ ఫాలో అవ్వండి. ఇప్పుడు వాట్సాప్ తెరచి, స్టేటస్‌లోకి వెళ్లండి. మీరు ఏం డౌన్లోడ్ చెయ్యాలనుకుంటున్నారో దానిని ఓసారి పూర్తిగా చూడండి. ఇప్పుడు మీ మొబైల్లోని ఫైల్ మేనేజర్ ఫోల్డర్ ఓపెన్ చెయ్యండి. తర్వాత సెట్టింగ్స్‌లోకి వెళ్లి Show Hidden Files ఆప్షన్‌ను క్లిక్ చేయండి. ఇప్పుడు మళ్లీ వెనక్కి వచ్చి స్టోరేజ్‌లోకి వెళ్లి వాట్సాప్ ఆప్షన్ ఓపెన్ చేయండి. వాట్సాప్ ఫోల్డర్ కనిపించే మీడియా ఆప్షన్లో స్టేటస్(statuses) ఆప్షన్‌ను ఎంచుకోండి. అందులో వాట్సాప్ స్టేటస్‌లో చూసిన వీడియోలు, ఫొటోలూ ఉంటాయి. వాటిని కాపీ చేసి... వేరే ఫోల్డర్లో పేస్ట్ చేసుకోండి. ఈ విధంగా మీరు వాట్సాప్ స్టేటస్‌లోని ఫొటోలూ, వీడియోలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే, గూగుల్ ప్లే స్టోర్ కి వెళ్లి వాట్సాప్ స్టేటస్ డౌన్లోడ్ మేనేజర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని కూడా మీకు నచ్చిన వాటిని పొందవచ్చు. -
వాట్సాప్ లో మరో అదిరిపోయే ఫీచర్
వాట్సాప్ ఎప్పటికప్పుడు వినియోగదారుల కోసం కొత్త ఫీచర్స్ తీసుకొస్తూ ఉంటుంది. తాజాగా వాట్సాప్ తన వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నామరో సరికొత్త ఫీచర్ ని పరిచయం చేయబోతుంది. వాట్సాప్ వెబ్ వెర్షన్లో త్వరలో వీడియో/వాయిస్ కాల్ ఫీచర్ ని తీసుకురావాలని భావిస్తుంది. ఈ విషయాన్నీ వాట్సాప్ తన అధికారిక బ్లాగ్ లో ప్రకటించింది. వాట్సాప్ బ్లాగ్ వాబీట ఇన్ఫో తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం కొంతమంది వాట్సాప్ వెబ్ వెర్షన్ బీటా వినియోగదారులకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. ఇది బీటా వెర్షన్ కావడంతో కొద్దీ మంది వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు సంస్థ తెలిపింది. రాబోయే రోజుల్లో మిగతా వాట్సాప్ వెబ్ వెర్షన్ వినియోగదారులందరికి తీసుకురానున్నట్లు పేర్కొంది.(చదవండి: 4కే టీవీ లాంచ్ చేసిన షియోమీ) మొబైల్ లో మాదిరిగానే వాయిస్, వీడియో కాల్ బటన్ చాట్ హెడర్‌లో ఉంటుందని చూపించే కొన్ని స్క్రీన్షాట్లను తన అధికారిక బ్లాగ్ లో షేర్ చేసింది. మీకు వాట్సాప్ వెబ్ నుండి ఏదైనా కాల్ వచ్చినప్పుడు మీకు స్క్రీన్ మీద ప్రత్యేక విండో పాపప్ వస్తుందని తెలుస్తుంది. అలా వచ్చినప్పుడు దాన్ని అంగీకరించవచ్చు, తిరస్కరించవచ్చు లేదా విస్మరించవచ్చు. మీరు ఎవరకైన కాల్ చేసినప్పుడు ఒక చిన్న పాపప్ వస్తుందని తెలిపింది. మీరు కాల్ చేసిన ప్రతి సారి వీడియో కాల్ల మాదిరిగానే వీడియో ఆఫ్, మ్యూట్ వాయిస్, రిజెక్ట్ బటన్ అనే ఆప్షన్స్ ఉంటాయి. ప్రస్తుతం మీ వాట్సాప్ మొబైల్ వెర్షన్లో మాత్రమే వాయిస్ లేదా వీడియో కాల్ ఫీచర్ ఉంది. ఏదైనా కాల్ కోసం మనకు ఇంటర్నెట్ తప్పనిసరి అనే విషయం తెలిసిందే. ప్రస్తుతం, వాట్సాప్ గ్రూప్ వాయిస్, వీడియో కాల్స్ లో 8 మంది మాత్రమే పాల్గొనే అవకాశం ఉంటుంది. -
వాట్సాప్ వీడియోకాల్‌లో కడసారి చూపు
సాక్షి, హసన్‌పర్తి: ఓ రిటైర్డ్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అతని అంత్యక్రియలకు భార్య, కుమారుడు హాజరుకాలేకపోయారు. అమెరికాలో ఉండడం వల్ల కడసారి చూపును వాట్సాప్ వీడియోలో చూస్తూ రోధించసాగారు. కూతురే కుండ పట్టి అంత్యక్రియలు నిర్వహించింది. ఈ సంఘటన హసన్‌పర్తి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాలు.. హసన్‌పర్తి మండల కేంద్రానికి చెందిన కందుకూరి సూర్య నారాయణ(65) కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉద్యోగం చేస్తూ పదవీ విరమణ పొందాడు. ఆయనకు భార్య శాంతమ్మ, కుమారుడు కిరణ్, కూతురు కృష్ణవేణి ఉన్నారు. కిరణ్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా కూతురు, అల్లుడు హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో పని చేస్తున్నారు. రెండు నెలల క్రితం శాంతమ్మ అమెరికాలోని కుమారుడి వద్దకు వెళ్లగా ఇంట్లో సూర్యనారాయణ ఒక్కడే ఉన్నారు. ఈ నెల 8న మధ్యాహ్నం సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన సూర్యనారాయణ మృతదేహాన్ని మరుసటిరోజు పోలీసులు రాయపర్తిలో కెనాల్ నుంచి బయటకు తీశారు. ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావించారు. ఇదిలా ఉండగా.. సూర్యనారాయణ ఇంటికి తాళం వేసి ఉండటంతో బంధువులు ఆయన కోసం వెతికినా ఆచూకీ లభించకపోవడంతో హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే రాయపర్తిలో ఈనెల 9న గుర్తు తెలియని వ్యక్త మృతదేహం లభ్యమైనట్లు హసన్‌పర్తి పోలీసులు తెలపగా.. రాయపర్తి పోలీసులు పంపిన ఫొటోలను బంధువులకు చూపించారు. దీంతో మృతుడు సూర్యనారాయణగా గుర్తించారు. భార్యకు సమాచారం సూర్యనారాయణ ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని బంధువులు ఫోన్ ద్వారా అటు అమెరికాలో ఉంటున్న భార్య శాంత, కుమారుడు కిరణ్, ఇటు హైదరాబాద్‌లో ఉంటున్న కూతురు కృష్ణవేణికి అందించారు. అయితే అమెరికాలో ఉంటున్న వారు ఇక్కడికి రావడం సాధ్యం కాదని, దీంతో వాట్సాప్ వీడియో కాల్ ద్వారా కడసారి చూపులు చూశారు. ఇదిలా ఉండగా, ఆదివారం హైదరాబాద్ నుంచి కూతురు వచ్చి అంత్యక్రియలు నిర్వహించింది. -
‘శాడిస్ట్ ’ వీడియో కాల్స్ వెనక ఉన్న అసలు స్టోరీ
సాక్షి, సిటీబ్యూరో: వాట్సాప్ ద్వారా వీడియో కాల్స్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది యువతులు, మహిళలను వేధింపులకు గురి చేసిన జనగామ జిల్లా వాసి కె.భాస్కర్ విచారణలో విస్తుపోయే వాస్తవాలను వెల్లడించాడు. ‘శాడిస్ట్ అపరిచితుడైన’ ఇతగాడిని గత వారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసిన విషయం విదితమే. జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించిన ఇతడిని న్యాయస్థానం అనుమతితో రెండు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారణ జరిపారు. ఈ నేపథ్యంలోనే అతగాడు శాడిస్ట్‌లా తయారు కావడానికి ప్రేమవిఫలమే కారణమని వెల్లడైంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. ఉద్యోగం రాకపోవడంతో.. జనగామ జిల్లా లింగాలఘణపురం సమీపంలోని నేలపోగుల ప్రాంతానికి చెందిన కందగట్ల భాస్కర్ ఎంకాం చదువుతుండగా ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. ఇది విఫలం కావడంతో పాటు ఆమె తన తల్లిదండ్రుల ప్రోద్బలంతో భాస్కర్‌పై లింగాలఘణపురం పోలీసుస్టేషన్లో కేసు పెట్టారు. 2007లో నమోదైన ఈ కేసులో పోలీసులు చార్జిషీట్ సైతం దాఖలు చేయడంతో 2010లో నేరం నిరూపితమైంది. దీంతో న్యాయస్థానం భాస్కర్‌ను దోషిగా తేలుస్తూ రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఫలితంగా ఎంకాం పూర్తి చేసినా ఎక్కడా ఉద్యోగం రాకపోవడంతో కొన్నాళ్లపాటు ఆరోగ్యశ్రీ విభాగంలో ఔట్సోర్సింగ్ సిబ్బందిగా పని చేశాడు. ఆపై కొన్ని ప్రైవేట్ కంపెనీల్లోనూ విధులు నిర్వర్తించినా చివరకు స్వస్థలంలో వ్యవసాయం చేసుకుంటూ ఉండిపోయాడు. వేధింపుల పర్వానికి శ్రీకారం.. ఈ పరిణామంతో యువతులు, మహిళలపై కక్షకట్టిన భాస్కర్ వారిని వేధించాలని నిర్ణయించుకున్నాడు. ప్రభుత్వం అందించే వివిధ పథకాల లబ్ధిదారుల వివరాలను పొందుపరిచే పోర్టల్ ‘తెలంగాణ స్టేట్ ఆన్లైన్ బెనిఫిషియరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టం’ నుంచి వివరాలు సంగ్రహించి వేధింపులు ప్రారంభించాడు. తన గ్రామానికి చెందిన అనేక మంది ప్రభుత్వ పథకాలు పొందడానికి భాస్కర్ సహకరించాడు. ఈ నేపథ్యంలోనే కింది స్థాయి అధికారులపై పలుమార్లు కలెక్టర్ సహా అనేక మంది ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశాడు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇతడి సోదరికి రావాల్సిన కల్యాణలక్ష్మి సొమ్మును అందుకోలేకపోయాడు. ఫలితంగా ఆర్థికంగా ఇబ్బందుల్లో పడ్డాడు. దీనికి తోడు కొన్నాళ్ల క్రితం తన తల్లిదండ్రులకు కేవలం ఆరు నెలల వ్యవధిలో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. వీరి వైద్యానికి రూ.5 లక్షలకు పైగా ఖర్చుపెట్టాడు. ఈ డబ్బు కోసం తనకు ఉన్న ఐదెకరాల పొలానికి సంబంధించిన పట్టాదారు పాసుపుస్తకాలను బ్యాంకులో తాకట్టు పెట్టాడు. ఈ రుణానికి ప్రతి నెలా కట్టాల్సిన వాయిదాలు సైతం చెల్లించలేకపోయాడు. దీంతో ప్రస్తుతం బ్యాంకు వాళ్లు పొలం వేలం వేయడానికి సిద్ధమవుతూ నోటీసులు జారీ చేశారు. ఇంటిలో ఒంటరిగా.. బ్రెయిన్‌స్ట్రోక్‌కు గురైన తల్లి తన సోదరి ఇంట్లో ఉంటుండటంతో ప్రస్తుతం భాస్కర్ తన స్వగ్రామంలో ఒంటరిగా నివసించేవాడు. వండి పెట్టే దిక్కుకూడా లేకపోవడంతో రోజుకు ఒకపూటే భోజనం చేసేవాడు. ఈ పరిణామాలతో పూర్తిస్థాయి శాడిస్ట్‌గా మారిపోయిన భాస్కర్ తనకు దొరికిన సిమ్‌కార్డును రీచార్జి చేసి, ‘అవసరమైనప్పుడు’ తన సెల్ఫోన్లోనే వేసి వినియోగిస్తూ యువతులు, మహిళల్ని టార్గెట్‌గా చేసుకున్నాడు. ఆ ప్రభుత్వ పోర్టల్ నుంచి సేకరించిన నెంబర్లలో ఏదో ఒకదానికి కాల్ చేసేవాడు. అవతలి వారిలో అత్యంత అభ్యంతరకరంగా మాట్లాడేవాడు. అంతటితో ఆగకుండా వాట్సాప్‌లో అభ్యంతరకర, అసభ్య సందేశాలు పంపడం, అశ్లీల ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తుండేవాడు. వేళకాని వేళల్లో నగ్నంగా ఉండి యువతులు, మహిళలకు వాట్సాప్ ద్వారా వీడియో కాల్స్ చేసే భాస్కర్... వారూ అలా మారాలని బలవంతం పెట్టేవాడు. ఇతడిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన ఇన్స్పెక్టర్ ఎన్.మోహన్‌రావు, ఎస్సై మహిపాల్ సాంకేతిక ఆధారాలను బట్టి భాస్కర్ నిందితుడిగా గుర్తించి గత మంగళవారం అరెస్టు చేశారు. వాస్తవానికి భాస్కర్‌కు 16న పెళ్లి చూపులు జరగాల్సి ఉంది. ఈలోపే అతడు అరెస్టు కావడంతో బ్రేక్ పడింది. -
మహిళా కానిస్టేబుల్‌కి నగ్నంగా వీడియో కాల్స్
సాక్షి, సిటీబ్యూరో: నగ్నంగా ఉండి వాట్సాప్ ద్వారా వీడియో కాల్స్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది యువతులు, మహిళలను వేధింపులకు గురి చేసిన జనగామ జిల్లా వాసి కె.భాస్కర్‌ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఇతడిపై సిటీ సైబర్ ఠాణాలో రెండు కేసులు నమోదై ఉండగా.. తన స్వస్థలంలో రిజిస్టర్ అయిన కేసులో శిక్ష సైతం పడినట్లు అధికారులు తెలిపారు. ఇతగాడి బాధితుల జాబితాలో నగరానికి చెందిన ఓ మహిళా కానిస్టేబుల్ సైతం ఉండటం గమనార్హం. భాస్కర్‌ను మంగళవారం కోర్టులో హాజరుపరిచిన పోలీసులు న్యాయమూర్తి ఆదేశాల మేరకు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. వివరాలు భద్రపరిచి.. జనగామ జిల్లా లింగాలఘణపురం సమీపంలోని నేలపోగుల ప్రాంతానికి చెందిన కంధగట్ల భాస్కర్ ఎంకాం చదివాడు. కొన్నాళ్ల పాటు ఆరోగ్యశ్రీ విభాగంలో ఔట్సోర్సింగ్ సిబ్బందిగా పని చేశాడు. ఆపై కొన్ని ప్రైవేట్ కంపెనీల్లోనూ విధులు నిర్వర్తించినా ప్రస్తుతం స్వస్థలంలో వ్యవసాయం చేస్తున్నాడు. ప్రభుత్వం అందించే వివిధ పథకాల లబ్ధిదారుల వివరాలను అధికారిక పోర్టల్ అయిన ‘తెలంగాణ స్టేట్ ఆన్లైన్ బెనిఫిషియరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టం’లో ప్రదర్శిస్తారు. లబ్ధిదారుడి పేరు, చిరునామా, ఫోన్ నంబర్‌తో పాటు పాస్‌పోర్ట్ ఫొటోతో కూడిన ఈ వివరాలు గత ఏడాది వరకు పోర్టల్ ఓపెన్ చేసిన ప్రతి ఒక్కరికీ కనిపించేవి. ప్రస్తుతం మాత్రం కొన్ని వివరాలు పొందుపరిస్తేనే కనిపిస్తున్నాయి. రెండేళ్ల క్రితమే ఈ వివరాల్లో యువతులు, మహిళలకు చెందినవి కాపీ చేసి తన వద్ద భద్రపరిచి పెట్టుకున్న భాస్కర్ వాటిని దుర్వినియోగం చేశాడు. తనకు దొరికిన సిమ్‌కార్డును రీచార్జ్ చేసి, ‘అవసరమనప్పుడు’ తన సెల్ఫోన్లోనే వేసి వినియోగిస్తున్నాడు. అసభ్య సందేశాలు పంపిస్తూ.. సదరు పోర్టల్ నుంచి సేకరించిన నంబర్లలో ఏదో ఒకదానికి కాల్ చేసేవాడు. అవతలి వారిలో అత్యంత అభ్యంతరకరంగా మాట్లాడేవాడు. అంతటితో ఆగకుండా వాట్సాప్‌లో అభ్యంతరకర, అసభ్య సందేశాలు పంపడం, అశ్లీల ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తుండేవాడు. వేళకాని వేళల్లో నగ్నంగా ఉండి యువతులు, మహిళలకు వాట్సాప్ ద్వారా వీడియో కాల్స్ చేసే భాస్కర్.. వారూ అలా మారాలని బలవంతపెట్టేవాడు. పోర్టల్ నుంచి సేకరించిన ఫొటో, వివరాలను వారికి పోస్టు చేసి.. తమ వద్ద బాధితులకు సంబంధించిన ఇతర, వ్యక్తిగత అంశాలు, ఫొటోలు ఉన్నాయని బెదిరించేవాడు. తాను చెప్పినట్లు చేయకపోతే అవన్నీ సోషల్‌మీడియాలో పెడతానంటూ బెదిరించేవాడు. అనంతరం ఫోన్ నుంచి ఆ సిమ్‌కార్డు తీసేసి తన మామూలు కార్డు వేసుకుని వాడుకునేవాడు. బాధితురాలి ఫిర్యాదుతో వెలుగులోకి.. భాస్కర్ వేధింపుల బారినడిన వారిలో సిటీలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న యువతి కూడా ఉన్నారు. ఈమె గతంలో ఎస్సీ కార్పొరేషన్ నుంచి లబ్ధిపొంది ఉండటంతో ఆ పోర్టల్‌లోకి వివరాలు వెళ్లాయి. ఇతడిపై గత ఏడాది ఓ కేసు నమోదై ఉండగా.. ఇటీవల మరో బాధితురాలు సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన ఇన్స్పెక్టర్ ఎన్.మోహన్‌రావు, ఎస్సై మహిపాల్ సాంకేతిక ఆధారాలను బట్టి భాస్కర్ నిందితుడిగా గుర్తించారు. అతడిని అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించిన అధికారులు తదుపరి విచారణ నిమిత్తం కస్టడీకి తీసుకోవాలని నిర్ణయించారు. ప్రస్తుతం వాట్సాప్ కాల్స్‌కు భాస్కర్ వినియోగిస్తున్న సిమ్‌కార్డు దాదాపు ఏడాదిగా అతడి వద్ద ఉంది. దీంతో ఇతడి బారినపడిన వారిలో రాజధానిలోని మూడు కమిషనరేట్లతో పాటు ఇతర జిల్లాలకు చెందిన అనేక మంది ఉంటారని అనుమానిస్తున్న సైబర్ క్రైమ్ పోలీసులు ఆ కోణంలో ఆరా తీస్తున్నారు. భాస్కర్‌పై 2007లోనే లింగాలఘణపురంలో ఈ తరహా కేసు నమోదైంది. ఈ కేసులో ఇతడిని దోషిగా తేల్చిన కోర్టు రెండేల్ల జైలు శిక్ష కూడా విధించింది. -
500 మంది భారతీయులకు గూగుల్ హెచ్చరికలు
న్యూఢిల్లీ: టెక్నాలజీ దిగ్గజం గూగుల్ ప్రపంచవ్యాప్తంగా పలువురు యూజర్లకు జూలై నుంచి సెప్టెంబర్ మధ్య 12 వేల హెచ్చరికలను పంపింది. అందులో 500 మంది భారతీయులూ ఉన్నారు. ప్రభుత్వ మద్దతు ఉన్న హ్యాకర్ల దాడికి గురయ్యే అవకాశముందని, అప్రమత్తంగా ఉండాలని వారికి సూచించింది. వాట్సాప్ వీడియో కాలింగ్‌లోని లోపం ద్వారా పెగాసస్ సాఫ్ట్‌వేర్‌సాయంతో పలు దేశాల ప్రభుత్వాలు మానవ హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టుల సమాచారం హ్యాక్ చేస్తున్నారన్న నేపథ్యంలో ఈ వార్తలు రావడం గమనార్హం. దాదాపు 50 దేశాలకు చెందిన ప్రభుత్వ మద్దతుదారులైన హ్యాకర్లు 270 మందిని టార్గెట్ చేసినట్లు గూగుల్ తెలిపింది. -
జవాను వాట్సాప్ వీడియో; ట్విస్ట్ అదిరింది!
హైదరాబాద్ : అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు చాలా మంది సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నారు. స్మార్ట్ఫోన్ల సహాయంతో తమ గోడును అధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నారు. అయితే వీటిలో నిజానిజాలు తెలుసుకోవడం అధికారులకు కష్టతరంగా మారింది. దీంతో నిజమైన బాధితులు ఎవరో తెలియక తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు బ్లాకుకు చెందిన అధికారులకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. వివరాలు... చిత్తూరు జిల్లాకు చెందిన టి. చంద్రబాబు భారత ఆర్మీలో హవల్దార్‌గా పనిచేస్తున్నారు. స్వస్థలం ఎల్లపల్లిలో ఆయనకు భూమి ఉంది. ఈ క్రమంలో తన భూమిని పక్కింటి వాళ్లు ఆక్రమించారంటూ వాట్సాప్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఇందులో భాగంగా..‘ నేను, నా సోదరుడు ఆర్మీలో పనిచేస్తున్నాం. మా ఊరిలో మాకు 3.60 ఎకరాల భూమి ఉంది. శోభన్‌బాబు, సాంబశివ నాయుడు అనే వ్యక్తులు ఈ భూమిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతేకాకుండా వృద్ధురాలైన మా అమ్మను చంపుతామని బెదిరిస్తున్నారు. ఈ విషయం ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లేదాకా ఈ వీడియోను షేర్ చేయండి’ అని తన గోడు వెళ్లబోసుకున్నారు. ఈ క్రమంలో వీడియో వైరల్‌గా మారడంతో గంగాధర నెల్లూరు బ్లాక్ రెవెన్యూ అధికారులు హుటాహుటిన ఎల్లపల్లికి చేరుకున్నారు. చంద్రబాబు చెప్పిన దానికి, క్షేత్రస్థాయిలో జరుగుతున్న దానికి ఏమాత్రం సంబంధంలేదనే నిర్ధారణకు వచ్చారు. ఈ విషయం గురించి తహసీల్దార్ భవాని ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ..‘ ఎల్లపల్లిలో వారిద్దరి పేరిట ఆరు ఎకరాలకు పట్టా ఉంది. అయితే కొలిచి చూడగా 3.60 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్నట్లుగా తేలింది. నిజానికి ఇంటిస్థలం విషయంలో పొరుగువారితో వారికి విభేదాలు ఉన్నాయి. వాటిని మేము పరిష్కరించాము’ అని తెలిపారు. ఇక ఈ విషయం గురించి చంద్రబాబును సంప్రదించగా భూవివాదం పరిష్కారమైందని.. అయితే దాని గురించి మాట్లాడదలచుకోలేదని చెప్పినట్లు జాతీయ మీడియా వెల్లడించింది. -
కాపురం కూల్చిన వాట్సాప్ మెసేజ్..!
కొచ్చి : నకిలీ వార్తలు, పుకార్లతో దేశవ్యాప్తంగా అల్లర్లు, ఘర్షణలు చెలరేగి పదుల సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోయిన ఉదంతాలు తెలిసిందే. కేరళలోని కొచ్చిలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఓ వ్యక్తి పొరపాటుగా పోస్టు చేసిన ఓ అడల్ట్ వీడియో శోభ అనే వివాహిత జీవితాన్ని చిన్నాభిన్నం చేసింది. వివరాలు.. సాజు జోసెఫ్‌కు చెందిన విద్యుత్ పరికరాల కంపెనీలో లిట్టో తంకచన్ ఉద్యోగం చేసేవాడు. 2015లో లిట్టో ఓ వాట్సాప్ గ్రూప్‌లో న్యూడ్ వీడీయో ఒకటి పోస్టు చేశాడు. వీడియోలో ఉన్నది సాజు భార్య శోభ అని పేర్కొన్నాడు. దీంతో సాజు కుటుంబంలో చిచ్చు రేగింది. నగ్నంగా ఉన్న వీడియోను శోభ కావాలనే ఇతరులకు పంపిందని ఆరోపిస్తూ సాజు ముగ్గురు పిల్లలతో కలిసి గత మూడేళ్లుగా ఆమెకు దూరంగా ఉంటున్నారు. భార్యతో విడాకులు మంజూరు చేయాల్సిందిగా కోర్టును ఆశ్రయించాడు. లిట్టో అరెస్టు.. శోభకు నరకయాతన తన పేరును, కుటుంబ పరువును రోడ్డుకీడ్చిన లిట్టోపై శోభ ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. వీడియోలో ఉన్నది తాను కాదంటూ.. శోభ సైబర్ బ్రాంచ్ పోలీసులను ఆశ్రయించారు. అందులో ఉన్నదెవరో తేల్చాలని ఫిర్యాదు చేశారు. కాగా, రంగంలోకి దిగిన సైబర్ క్రైం పోలీసులు.. రాష్ట్ర ఫోరెన్సిక్ లేబొరేటరీకి వీడియో పంపించి విచారణ చేపట్టారు. ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా వీడియోలో ఉన్నది శోభ కాదని తేల్చారు. వీడియో అస్పష్టంగా ఉండడంతో దాని మూలం (ఎక్కడి నుంచి వచ్చిందనే సమాచారం) సైతం కనుక్కోలేకపోతున్నామని ఫోరెన్సిక్ లేబొరేటరీ తమ నిసహాయతను తెలియజేసింది. ఓ వ్యక్తి పొరపాటు వల్ల తన జీవితం నాశనమైందని శోభ (36) వాపోయారు. గత మూడేళ్లుగా తన పిల్లలకు దూరంగా బతకాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘అందరిలా నా పిల్లలు.. బయట తిరగకూడదా..! వాళ్ల అమ్మ క్యారెక్టర్ గురించి ఎవరైనా నీచంగా మాట్లాడితే వాళ్లు భరిస్తారా’ అని శోభ కన్నీటి పర్యంతం అయ్యారు. వీడియోలో ఉన్నది తాను కాకున్నా తన జీవితంలో తీవ్ర అలజడి రేగిందనీ, ఇప్పటికీ ఆ వీడియో షేర్ కాకుండా సైబర్ బ్రాంచ్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నానని శోభ వాపోయారు. ఇదిలాఉండగా.. వీడియో వ్యవహారం ఎలా ఉన్నా.. మళ్లీ శోభను మా జీవితాల్లోకి ఆహ్వానించబోమని సాజు వెల్లడించారు. తామంతా తిరిగి కలిసేది లేదని చెప్పారు. -
వాట్సాప్‌లో కొత్త అప్డేట్
సాక్షి, ముంబై: ఫేస్బుక్ సొంతమైన ప్రముఖ చాటింగ్ యాప్ వాట్సాప్ తన ఐఓఎస్ బీటా యూజర్లకు కొత్త అప్డేట్ను విడుదల చేసింది. ఈ అప్డేట్లో యూజర్లు తమకు వచ్చిన వీడియో మెసేజ్‌లను నోటిఫికేషన్ బార్లోనే ప్లే చేసుకునే సదుపాయం కల్పించారు. అయితే ప్రస్తుతానికి బీటా వెర్షన్ 2.18.102.5కు అప్డేట్ అయిన ఐఓఎస్ యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్ కేవలం అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే ఐఓఎస్‌తో పాటు, ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌కు కూడా విస్తరిస్తామని కంపెనీ ప్రతినిథులు వెల్లడించారు. ఈ ఫీచర్‌ను వాడటానికి లేదా ఆపివేయడానికి సెట్టింగ్స్‌లోకి వెళ్లి ప్రివ్యూ మోడ్‌ను ఆఫ్ లేదా ఆన్ చేసుకోవాలి. -
వివాహం అయ్యింది ..బూతు బొమ్మలు పంపుతావా?
ఆటోనగర్ (విజయవాడ తూర్పు) : వాట్సప్‌లో అశ్లీల చిత్రాలను పంపించి ఒక యువకుడి వద్ద నుంచి డబ్బులు కాజేయాలని చూసిన ఓ మాయ లేడీపై మంగళవారం పటమట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన జలసూత్రం సుజన్‌కుమార్‌కు కొంత కాలం క్రితం ఓ మహిళ ఫేస్బుక్లో పరిచయం అయ్యింది. రాను రాను వీరి పరిచయం ఎక్కువ అయ్యింది. ఈ నెల 9న వేరే ఫోన్ నుంచి ఆ వివాహిత సుజన్‌కుమార్ సెల్‌కు అశ్లీల ఫొటోలను వాట్సప్ చేసింది. అతని ఫొటోలను కూడా ఆమెకు పంపించమని మెసేజ్ పెట్టింది. దీంతో సుజన్‌కుమార్ కూడా అశ్లీల ఫొటోలను ఆమెకు పంపించాడు. అయితే, ఆ ఫొటోలను అడ్డుపెట్టుకుని తనకు రూ.5 వేలు ఇవ్వాలంటూ ఆమె బెదిరించసాగింది. తనకు వివాహం అయ్యిందని, భర్త హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నాడని, తమకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని, తనకే బూతు బొమ్మలు పంపుతావా అంటూ బెదిరించింది. డబ్బులివ్వకపోతే తనకు పంపిన అశ్లీల చిత్రాలను పోలీస్‌లకు చూపిస్తానని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పటమట అశోక్‌నగర్‌లోని తన అక్క ఇంటికి ఇటీవల వచ్చిన సుజన్‌కుమార్ ఘటనపై పటమట పోలీస్‌లకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మాయ లేడీ కోసం గాలింపు చేపట్టారు. ఈ సందర్భంగా సీఐ ఉమామహేశ్వరరావు మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ ఫేస్‌బుక్‌లలో పరిచయం పెంచుకుంటే నష్టపోవడమే కాకుండా అనేక సమస్యలను కొని తెచ్చుకుంటారని హెచ్చరించారు. ఫేస్‌బుక్‌ల మాయలో పడి యువకులు అపరిచిత మహిళలతో మాట్లాడవద్దని సూచించారు. -
కిడ్నాప్ చేశారని తాళ్లతో కట్టేసిన ఫోటో పంపింది..
చాంద్రాయణగుట్ట: చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ యువతి కిడ్నాప్ కలకలం రేపింది. ఇన్స్పెక్టర్ వై.ప్రకాష్ రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బండ్లగూడ పటేల్‌నగర్‌కు చెందిన అస్మాబేగం కుమార్తె తబ్బసుమ్ బేగం అదే ప్రాంతానికి చెందిన ముస్తఫా అనే యువకుడిని ప్రేమించింది. ఈ విషయం తెలిసిన అస్మాబేగం తన కుమార్తెకు సల్మాన్ అనే యువకుడితో నిశ్చితార్థం జరిపించింది. ఇది నచ్చని తబ్బసుమ్ బేగం రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఇదిలా ఉండగా సోమవారం మధ్యాహ్నం తబ్బసుమ్ తన తల్లి ఫోన్‌కు వాట్సాప్‌లో తనను కిడ్నాప్ చేశారని...తాళ్లతో కట్టేసిన ఫోటో పంపింది. మరి కొద్ది సేపటి తర్వాత తనను బంధించారని ఎక్కడ ఉన్నానో తెలియదంటూ వాట్సాప్ కాల్లో మాట్లాడింది. దీంతో అస్మా బేగం చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ముస్తఫాపై అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముస్తఫాను పిలిచి విచారించగా అతని ప్రమేయం లేదని తేలింది. ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆమె షాహిన్‌నగర్‌లో ఉన్నట్లు గుర్తించి అక్కడ గాలించగా ఫలితం కనిపించలేదు. దీంతో రెండు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. -
‘మీ వీడియోలేమైనా పెట్టాడా?’
‘మీ వీడియోలేమైనా పెట్టాడా?’ అంటూ టీడీపీ కౌన్సిలర్ ఒకరు మహిళా కౌన్సిలర్లపై చేసిన వ్యాఖ్యలు పెద్దాపురంలో మున్సిపాలిటీలో దుమారం రేపాయి. ఒకరిపై ఒకరు దూషణలు చేసుకునే స్థాయికి చేరాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో మహిళలకు దక్కిన గౌరవం ఇదేనా? మహిళలను కించపరిచేలా ప్రవర్తించిన కౌన్సిలర్‌పై చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు, ఐద్వా నాయకులు డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి: ఇటీవల పెద్దాపురం పట్టణంలో మున్పిపల్ వైస్ చైర్మన్ కొరుపూరి రాజు తన వాట్సాప్ ద్వారా కౌన్సిలర్ల వాట్సాప్ గ్రూప్‌లో కొన్ని అశ్లీల వీడియోలను పోస్ట్ చేశారు. ఈ వ్యవహారంపై మంగళవారం మహిళా కౌన్సిలర్లు సుమారు పది మంది చైర్ పర్సన్ వద్దకు వెళ్లి వైస్ చైర్మన్ రాజు అçసభ్యకర వీడియోలు పోస్టింగ్ వ్యవహారంపై చర్యలు ఎందుకు తీసుకోలేదని నిలదీశారు. దీంతో చైర్మన్ స్పందిస్తూ అందరితో చర్చించి, మహిళలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పిడంతో వారు వెనుదిరిగారు. ఇంతలో కొందరు ‘‘అలా జరగడం తప్పే కాదా! ఎంత సిగ్గుమాలిన పని అంటూ గుసగుసలాడుకుంటూ వస్తుండగా.. టీడీపీ 12వ వార్డు కౌన్సిలర్ బేదంపూడి సత్తిబాబు విని.. ‘‘మీ వీడియోలేమైనా పెట్టాడా?’’ అన్నాడు. దీంతో మహిళా కౌన్సిలర్లు ఉల్లి మంగ, రాయవరపు వరలక్ష్మి, శెట్టి సుబ్బలక్ష్మి, వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ చల్లా సూర్యకుమారి, సీపీఎం కౌన్సిలర్ కూనిరెడ్డి అరుణ, కౌన్సిలర్లు గంగాభవానీ, కందుల కుమారి, తాళాబత్తుల ఉదయ కామేశ్వరి, తదితర మహిళా కౌన్సిలర్లు అతడి వ్యాఖ్యలపై మండిపడ్డారు. దీంతో మహిళా కౌన్సిలర్లు, బేదంపూడి సత్తిబాబు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. మహిళలను గౌరవించాల్సిన అధికార పార్టీ కౌన్సిల్ సభ్యులు సాటి మహిళా కౌన్సిలర్లతో ఇలా ప్రవర్తించడం సరైన పద్ధతి కాదని అందరూ ముక్కున వేలుసుకున్నారు. ఐద్వా నాయకులు కూనిరెడ్డి అరుణ, కౌన్సిలర్లు మంగ, వరలక్ష్మి, సూర్యకుమారి తదితరులు మాట్లాడుతూ సభ్య సమాజం సిగ్గుపడేలా ప్రవర్తించిన వైస్ చైర్మన్‌పై చర్యలు తీసుకుకోకపోగా, అతడికి వత్తాసు పలుకుతూ మహిళను కించపరచడం సరైన పద్ధతి కాదన్నారు. కౌన్సిలర్ సత్తిబాబు వెంటనే క్షమాపణ చెప్పాలని, అలాగే వీసీని తొలగించాలని వారు డిమాండ్ చేశారు. దీనిపై అవరమైతే తాము ఉద్యమిస్తామన్నారు. మహిళలను ఇబ్బంది పెట్టే నేతలు తమ సిగ్గు తెలసుకునేంత వరకు ఉద్యమిస్తామని ఆరుణ హెచ్చరించారు. -
కలలో కూడా కొడుకు సూసైడ్ వీడియోనే..!
న్యూఢిల్లీ: ఢిల్లీ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్(డీటీసీ) కు చెందిన ఓ డ్రైవర్ తాను ఆత్మహత్య చేసుకోనున్నట్లు తన తండ్రికి వాట్సా ప్ లో వీడియో షేర్ చేశాడు. గంట తర్వాత వీడియో చూసిన తండ్రి, కుటుంబసభ్యులు వెళ్లి చూసేలోగా ఉరివేసుకుని ఫ్యానుకు వేలాడుతూ కనిపించాడు. ఈ ఘటన నైరుతి ఢిల్లీలోని బిందాపూర్ లో చోటుచేసుకుంది. ఆ వివరాలిలా ఉన్నాయి. 36 ఏళ్ల సంజయ్ వర్మ డీటీసీలో డ్రైవర్ గా చేస్తున్నాడు. ఆత్మహత్య చేసుకునే ముందు తండ్రి మోహర్ సింగ్ ఫోన్ కు మెసేజ్ చేశాడు. కొద్దిసేపటి తర్వాత మీ ఫోన్లో వాట్సాప్ అప్లికేషన్ ఇన్ స్టాల్ చేసుకుని చెక్ చేసుకోండి అని మరో సందేశం పంపాడు. వాట్సాప్ ఇన్ స్టాల్ చేసి తండ్రి నిద్రపోయాడు. గంట తర్వాత మెలకువ వచ్చి చూసేసరికి అందులో ఏదో వీడియో ఉంది. ఏంటా అని గమనిస్తే తన కుమారుడు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపే వీడియో అది. నన్ను క్షమించండీ నాన్నా. నా పిల్లలకు 14, 9 ఏళ్లు మాత్రమే ఉన్నాయి. మీరు వాళ్లని జాగ్రత్తగా చూసుకోవాలి. వారికి ఆలనాపాలనా చూసి వారికి న్యాయం చేయాలి. కొందరు సన్నిహితులే నా ఈ చర్యకు కారణం. ఈ వీడియోని మీ వద్ద రికార్డుగా భద్రపరుచుకోండి’ అని సంజయ్ వర్మ పంపిన వీడియోలో ఉంది. పోలీసులకు వీడియో చూపించి ఫిర్యాదు చేసి 50 రోజులు కావస్తున్నా కేసు నమోదు చేయడం లేదని వర్మ తండ్రి మోహర్ సింగ్ వాపోతున్నాడు. అది ఆత్మహత్య కేసు అని చెప్పిన పోలీసులు కేసు నమోదు చేసేందుకు నిరాకరిస్తున్నారు. కానీ నా కొడుకు మాటలు చూస్తే.. ఇది హత్య అని కచ్చితంగా చెప్పవచ్చు అన్నారు. నా కొడుకు నాపై పెట్టిన బాధ్యత ప్రతిరోజూ కలలో గుర్తుకొస్తుందని, వర్మ మాటలు తనను బాధిస్తున్నాయని ఆందోళన వ్యక్తంచేశాడు. -
ప్రేయసి ఇంటి ముందు ఆత్మహత్య
గంగావతి/హొస్పేట : తాను ప్రేమించిన అమ్మాయి తల్లిదండ్రులు వివాహానికి నిరాకరించడంతో ఓ యువకుడు అమ్మాయి ఇంటి ముందు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం కొప్పళ తాలూకా మునిరాబాద్‌లో వెలుగు చూసింది. వివరాలిలా ఉన్నాయి. గంగావతి తాలూకాలోని జీరాళ కల్గుడి క్యాంప్‌కు చెందిన గొల్లపూడి కిరణ్(27) అనే యువకుడు కొప్పళ తాలూకా మునిరాబాద్‌కు చెందిన ఓ యువతిని గత మూడేళ్లుగా ప్రేమించేవాడు. దూరపు బంధువులైన వీరిద్దరూ హుబ్బళ్లిలో అమ్మాయి బీటెక్ చేస్తుండగా, అక్కడే కార్మెల్ సాఫ్ట్‌వేర్‌లో డిజైనర్‌గా పని చేస్తున్న కిరణ్ పరస్పరం ప్రేమించుకున్నట్లు తెలిసింది. వీరి ప్రేమ వ్యవహారం ఇటీవల యువతి కుటుంబ సభ్యులకు తెలియడంతో వారు వీరి ప్రేమ వ్యవహారాన్ని వ్యతిరేకించడమే గాకుండా ఆమెకు వేరొకరితో వివాహం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఈనేపథ్యంలో తాను ప్రేమించిన యువతి తనకు దక్కకుంటే తనకు ఈ జీవితం అవసరం లేదని తీవ్ర మనస్తాపం చెందిన యువకుడు కిరణ్ తన చావుకు ప్రియురాలు, వారి కుటుంబ సభ్యులే కారణమని, తనను క్షమించమని అమ్మ, అక్క, కుటుంబ సభ్యులను కోరుతూ వాట్సప్‌లో వీడియోని పంపించి యువతి ఇంటి వద్దకు వెళ్లి పురుగుల మందు తాగాడు. ఈ విషయాన్ని అమ్మాయి తండ్రి ఫోన్ చేసి తమకు తెలిపాడని యువకుని తల్లిదండ్రులు తెలిపారు. తాము మునిరాబాద్‌కు వెళ్లేలోపు ఆస్పత్రిలో చేర్చారని, సకాలంలో అతనికి సరైన చికిత్స ఇప్పించక పోవడంతో మృతి చెందాడని కిరణ్ బంధువులు ఆరోపించారు. మునిరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో బళ్లారి ఆస్పత్రికి తీసుకెళ్లగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై మునిరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. -
'టెర్రరిస్టులతో ఎలాంటి సంబంధాలు లేవు'
ముంబై: ముస్లిం మత ప్రవక్త జాకీర్ నాయక్ ప్రసంగాలపై విచారణ చేపట్టాలని మహారాష్ట్ర సీఎం దేవెంద్ర ఫడ్నవీస్ ఆదేశించారు. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ముంబై పోలీస్ కమిషనర్‌కు ఆదేశాలు జారీచేశారు. 'టెర్రరిస్టులతో తనకు ఎలాంటి సంబంధాలు లేవని, తాను ఎవరినీ టెర్రరిజం వైపు మళ్లించలేదని జాకీర్ తన వాట్సాప్ వీడియో ద్వారా వివరణ ఇచ్చుకున్నారు. బంగ్లాదేశ్ లో 90 శాతం కంటే ఎక్కువ మంది ప్రజలకు తాను తెలుసునని, అందులో 50 శాతం తన అభిమానులు ఉన్నారని.. అయితే తాను చెప్పిన అన్ని విషయాలను వాళ్లు పాటించడం లేదని వ్యాఖ్యానించారు. ఉగ్రదాడులకు యువతను రెచ్చగొట్టి అమాయక ప్రజలను చావుకు కారణమన్న ఆరోపణలను ఆయన ఖండించారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఇటీవల జరిగిన ఉగ్రదాడులకు డాక్టర్ జాకీర్ నాయక్ కారణమని తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తన ప్రసంగాలతో యువకులను రెచ్చగొడుతున్నాడని జాకీర్ పై ఆరోపణలున్నాయి. భారత్ లోనే కాదు విదేశాలలో ఉండే ముస్లిం యువకులు ఆయన ప్రసంగాలు విని చెడువైపు అడుగులు వేస్తున్నారని బంగ్లాదేశ్ ఆరోపించింది. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ... ఆయన ప్రసంగాల వీడియోలను చూసి ఆ తర్వాత చర్య తీసుకుంటామన్నారు. మీడియాలో మాత్రం ఆయన రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తుంటారని కథనాలు వచ్చాయని పేర్కొన్నారు. -
ఆంబోతును హడలెత్తించిన మేక
సింహంతో చిట్టెలుక పోరాడితే ఎలా ఉంటుంది? కొండను పొట్టేలు ఢీకొంటే ఎలా అనిపిస్తుంది? అచ్చం అలాంటి ఘటనే ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఒక మేక.. ఆంబోతుతో పోరాటానికి దిగింది. ఒక దశలో ఆంబోతును కూడా వెనక్కి నెట్టేస్తూ తాను ముందుకు సాగింది. ఆంబోతు శరీర పరిమాణంతో పోలిస్తే పదోవంతో.. 20వ వంతో కూడా లేని మేక.. అంత పెద్ద శత్రువును ఎలా ఎదుర్కొంటుందన్నది ఆశ్చర్యకరమే. ఎవరో ఔత్సాహికులు ఈ దృశ్యాన్ని వీడియో తీశారు. వాట్సప్‌లో షేర్ చేశారు. చివరకు ఎవరో వెనక నుంచి ఈ రెండింటినీ అదిలిస్తే తప్ప మేక వెనక్కి తగ్గలేదు. పోరాటం మధ్యలో ఆంబోతు మేకను అవతలకు విసిరేసినా.. అది పోరాట పటిమను ఏమాత్రం వదలకుండా వెంటనే మళ్లీ తన చిన్ని చిన్ని కొమ్ములు విసిరింది. ప్రాణాలు పోతాయనుకున్నప్పుడు చిట్ట చివరి నిమిషం వరకు పోరాటం వదలకూడదన్న స్ఫూర్తి ఈ మేకలో కనిపిస్తోంది కదూ.. మీరూ చూడండి మరి!!