ప్రేయసి ఇంటి ముందు ఆత్మహత్య | Girlfriend committed suicide in front of the house | Sakshi
Sakshi News home page

ప్రేయసి ఇంటి ముందు ఆత్మహత్య

Published Thu, Oct 13 2016 1:48 AM | Last Updated on Fri, Jul 27 2018 1:34 PM

Girlfriend committed suicide in front of the house

గంగావతి/హొస్పేట : తాను ప్రేమించిన అమ్మాయి తల్లిదండ్రులు వివాహానికి నిరాకరించడంతో ఓ యువకుడు అమ్మాయి ఇంటి ముందు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం కొప్పళ తాలూకా మునిరాబాద్‌లో వెలుగు చూసింది.


వివరాలిలా ఉన్నాయి. గంగావతి తాలూకాలోని జీరాళ కల్గుడి క్యాంప్‌కు చెందిన గొల్లపూడి కిరణ్(27) అనే యువకుడు కొప్పళ తాలూకా మునిరాబాద్‌కు చెందిన ఓ యువతిని గత మూడేళ్లుగా ప్రేమించేవాడు. దూరపు బంధువులైన వీరిద్దరూ హుబ్బళ్లిలో అమ్మాయి బీటెక్ చేస్తుండగా, అక్కడే కార్మెల్ సాఫ్ట్‌వేర్‌లో డిజైనర్‌గా పని చేస్తున్న కిరణ్ పరస్పరం ప్రేమించుకున్నట్లు తెలిసింది. వీరి ప్రేమ వ్యవహారం ఇటీవల యువతి కుటుంబ సభ్యులకు తెలియడంతో వారు వీరి ప్రేమ వ్యవహారాన్ని వ్యతిరేకించడమే గాకుండా ఆమెకు వేరొకరితో వివాహం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఈనేపథ్యంలో తాను ప్రేమించిన యువతి తనకు దక్కకుంటే తనకు ఈ జీవితం అవసరం లేదని తీవ్ర మనస్తాపం చెందిన యువకుడు కిరణ్ తన చావుకు ప్రియురాలు, వారి కుటుంబ సభ్యులే కారణమని, తనను క్షమించమని అమ్మ, అక్క, కుటుంబ సభ్యులను కోరుతూ వాట్సప్‌లో వీడియోని పంపించి యువతి ఇంటి వద్దకు వెళ్లి పురుగుల మందు తాగాడు.

ఈ విషయాన్ని అమ్మాయి తండ్రి ఫోన్ చేసి తమకు తెలిపాడని యువకుని తల్లిదండ్రులు తెలిపారు. తాము మునిరాబాద్‌కు వెళ్లేలోపు ఆస్పత్రిలో చేర్చారని, సకాలంలో అతనికి సరైన చికిత్స ఇప్పించక పోవడంతో మృతి చెందాడని కిరణ్ బంధువులు ఆరోపించారు. మునిరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో బళ్లారి ఆస్పత్రికి తీసుకెళ్లగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై మునిరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement