తన వినియోగదారులకు ఎప్పటికప్పుడు కొత్త అనుభూతిని అందించేందుకు గూగుల్ వినూత్న మార్గాలను అన్వేషిస్తూ ఉంటుంది. ఇప్పటికే మొబైల్ ఓఎస్ లో ఎన్నో కొత్త ఫీచర్స్ తీసుకొచ్చిన టెక్ దిగ్గజం గూగుల్ తాజాగా క్రోమ్ డెస్క్‌టాప్/వెబ్ వెర్షన్ యూజర్ల కోసం డార్క్ మోడ్‌ను తీసుకొనిరాబోతుంది. ఇప్పుడు యూజర్లు సిస్టమ్ థీమ్‌ను డార్క్ మోడ్‌లో పెట్టుకుంటే గూగుల్ క్రోమ్ డెస్క్‌టాప్/వెబ్ సెర్చ్ కూడా ఆటోమేటిగ్గా డార్క్ మోడ్‌కు మారుతుంది. ఇప్పుడు యూజర్లు సిస్టమ్ సెట్టింగ్స్‌ను బట్టి డార్క్ మోడ్ యాక్టివేట్ చేసుకోవచ్చు. దీనివల్ల బ్యాటరీ డివైజ్ లైఫ్ ని ఆదా చేయవచ్చు.
ప్రస్తుతం ఇంకా ఈ ఫీచర్‌ను బీటా టెస్టింగ్ దశలో ఉంది. త్వరలో అందరికి అందుబాటులోకి రానుంది. ఒకవేల మీరు బీటా యూజర్ అయితే, గూగుల్ సెర్చ్ లేదా వెబ్ పేజీని ఓపెన్ చేయగానే డార్క్ మోడ్ వచ్చినట్లు ఒక నోటిఫికేషన్ వస్తుంది. దానిపై క్లిక్ చేసి ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకుంటే డార్క్ మోడ్ యాక్టివేట్ అవుతుంది. దింతో సెర్చ్ పేజీ మొత్తం డార్క్‌లోకి మారిపోతుంది. మీరు కనుక బీటా యూజర్ కాకపోతే క్రోమ్ సెట్టింగ్స్‌లో ‘ఫోర్స్ డార్క్ మోడ్’ ఆప్షన్ ద్వారా ప్రయత్నించవచ్చు. దీని కోసం గూగుల్ సెర్చ్ బార్‌లో Chrome://flags ఎంటర్ చేసి 'Dark Mode' అని టైప్ చేయాలి. అప్పుడు ఫోర్స్ డార్క్ మోడ్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఎనేబుల్ చేసుకుంటే మీ క్రోమ్ పేజీ రీ-లాంచ్ అయిన తర్వాత పేజీ డార్క్ మోడ్ లో కనిపిస్తుంది.
చదవండి:
4జీ ఇంటర్నెట్ స్పీడ్ పెంచుకోండిలా!
Comments
Please login to add a commentAdd a comment