
సోషల్ మీడియా అంటే అందరికీ ఠక్కున గుర్తొచ్చేది ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ , వాట్సాప్ గ్రూపులు.. కానీ 2020లో మరో మాధ్యమం వీటన్నింటినీ అధిగమిస్తుందని అంచనాలు వెల్లువెత్తుతున్నాయి. అదే టిక్ టాక్.. ఈ ఏడాదే టిక్ టాక్ బాగా ప్రాచుర్యంలోకి వచ్చినా ఆ యాప్ డౌన్‌లోడ్‌లు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. 2019లో ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల మంది చాలా చురుగ్గా అందులో వీడియోలు అప్‌లోడ్ చేస్తున్నారు. యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న వారి సంఖ్య 150 కోట్లు దాటింది. టిక్‌టాక్ వినియోగదారుల్లో 41 శాతం మంది 25 ఏళ్ల వయసు కంటే తక్కువ ఉన్నవారే. ఒకట్రెండు నిమిషాల్లోనే బోల్డంత వినోదాన్ని పంచే టిక్‌టాక్ ప్రాచుర్యంలోకి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment