సెల్ఫీ విత్‌ రంగోలి.. సంక్రాంతి ముగ్గుల పోటీలు | Reliance Trends conducting Selfie With Rangoli Contest On the Occasion OF Sankranthi | Sakshi
Sakshi News home page

సెల్ఫీ విత్‌ రంగోలి.. సంక్రాంతి ముగ్గుల పోటీలు

Published Wed, Jan 12 2022 2:20 PM | Last Updated on Wed, Jan 12 2022 2:27 PM

Reliance Trends conducting Selfie With Rangoli Contest On the Occasion OF Sankranthi - Sakshi

సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా వినియోగ‌దారుల‌కు మరింత చేరువయ్యేందుకు ఆసక్తికరమైన పోటీలు పెడుతోంది రిలయన్స్‌ ట్రెండ్స్‌ సంస్థ. ఆంధప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని మెట్రోలు, జిల్లా కేంద్రాలతో పాటు మున్సిపాటీల్లో సైతం ఈ పోటీలు నిర్వహించాలని నిర్ణయించింది. ట్రెండ్స్ సెల్ఫీ విత్ రంగోలి పేరుతో నిర్వహించే ఈ పోట్లో ప్రజల్లు త‌మ ఇంటి ప్రాంగ‌ణంలో వేసిన రంగురంగు ముగ్గుల‌తో ఓ సెల్ఫీ లేదా ఫోటో తీసుకోవాలి. ఆ సెల్ఫీలను ప్రత్యేకంగా కేటాయించిన వాట్సాప్‌ నంబరుకు పంపాలి. వాట్సాప్‌ నంబరును పాంప్లెట్ల ద్వారా స్థానికంగా తెలియజేస్తారు. 


ఈ పోటీలో మొద‌టి బ‌హుమ‌తిగా రూ. 1500 అందివ్వనున్నారు. అంతేకాదు పాల్గొన్న ప్రతీ ఒక్కరికి ట్రెండ్స్ డిస్కౌంట్ కూప‌న్ ల‌భిస్తుంది. వీటిని స‌మీపంలోని ట్రెండ్స్ దుకాణంలో వినియోగించవచ్చు. ఈ పోటీ 2022 జ‌న‌వ‌రి 20న ముగుస్తుంది. మరిన్ని వివరాలకు సమీపంలోని ట్రెండ్స్ స్టోర్స్‌లో సంప్రదించాలని రిలయన్స్‌ సూచించింది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement