ఢాకా : బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రారంభ ఫలితాల్లో ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని పాలక అవామీ లీగ్ దూసుకుపోతోంది. హసీనా సారథ్యంలో మళ్లీ అవామీ లీగ్ విజయ ఢంకా మోగించే దిశగా సాగుతోంది. పాలక పార్టీ 144 స్ధానాల్లో ముందంజలో ఉండగా విపక్ష బీఎన్‌పీ కేవలం మూడు స్ధానాల్లోనే ఆధిక్యం కనబరుస్తోంది. జతియో పార్టీ ఒక స్ధానంలో ఆధిక్యంలో ఉంది. ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంటకు విస్పష్ట ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
కాగా,అవామీ లీగ్ ఇప్పటికే 19 స్ధానాల్లో విజయం సాధించింది. అంతకుముందు బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఆదివారం హింసాత్మక ఘటనల నడుమ ముగిసింది. ఎన్నికల సందర్భంగా చెలరేగిన హింసలో 13 మంది మర ణించారు. రాజ్‌షాహి, చిత్తగావ్, కుమిల్లా, కాక్స్‌బజార్ జిల్లాల్లో ఇద్దరేసి చొప్పున మరణించారు. ఇక బ్రమ్మణబెరియా, రంగమతి, నార్సిది, బొగుర, గజీపూర్, సిల్హెట్‌లో చెలరేగిన అల్లర్లలో ఒక్కరి చొప్పున మరణించారు. మృతుల్లో పాలక అవామీ లీగ్ కార్యకర్తలే అధికంగా ఉన్నారని అధికారులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment