మీరు అమెజాన్ లో ఇంటి అవసరాల కోసం ఏదైనా వస్తువు కొనాలనుకుంటున్నారా? అయితే, ఒక రోజు ఆగండి మీ కోసం మంచి డీల్ ని తీసుకొచ్చింది అమెజాన్. అమెజాన్ ఇండియా తన స్మాల్ బిజినెస్ డే 2020 యొక్క 4వ ఎడిషన్‌ను 2020 డిసెంబర్ 12 శనివారం నిర్వహిస్తుంది. ఈ సేల్ డిసెంబర్ 12 అర్ధరాత్రి నుండి అదే రోజు రాత్రి 11:59 వరకు కొనసాగుతుంది. ఈ సేల్ ఒక రోజు మాత్రమే కొనసాగనున్నట్లు పేర్కొంది. మహిళా వ్యాపారవేత్తలకు, కళాకారులు, చేనేత దారులు, స్థానిక దుకాణాలను ప్రోత్సహిచేందుకు అమెజాన్ ఈ సేల్ ని నిర్వహిస్తుంది. చిరువ్యాపారులకు మద్దతుగా నిలవడంతో పాటు వారి వ్యాపారం వృద్ధ్ది చెందేలా చేయడమే ఈ సేల్ ముఖ్య లక్ష్యం.(చదవండి: షియోమీ మరో సంచలనం)
స్మాల్ బిజినెస్ డే 2020 రోజున మీకు గృహ అవసరాలు, భద్రత, పరిశుభ్రత, గోడల ఆకృతి, పర్యావరణ అనుకూల ఉత్పత్తులు, వంట సామాగ్రి, క్రీడలు అవసరమైనవి వంటి విభాగాలలోని ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. అమెజాన్ వినియోగదారులకు డిజిటల్ చెల్లింపులపై 10 శాతం వన్ డే క్యాష్‌బ్యాక్ కూడా ఆఫర్ చేస్తుంది. క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ లావాదేవీలపై 10 ఇన్స్టాంట్ డిస్కౌంట్ కోసం అమెజాన్ ఐసిఐసిఐ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకుంది. ఏడు లక్షల మంది అమ్మకందారుల కోసం మేము గత కొద్దీ నెలలుగా సేల్స్ తీసుకొస్తున్నామని దీని ద్వారా వారి వ్యాపార వృద్ధికి మేము కట్టుబడి ఉన్నామని మనీష్ తివారీ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సేల్‌లో హోమ్ డెకార్‌పై 50 శాతం, ఫర్నీషింగ్‌పై 60 శాతం, ఫర్నీచర్‌పై 50 శాతం, కిచెన్ అప్లయెన్సెస్‌పై 60 శాతం, డిన్నర్‌వేర్‌పై 60 శాతం, స్టోరేజ్ అండ్ ఆర్గనైజేషన్‌పై 50 శాతం, చీరలపై 70 శాతం, కుర్తీలపై 70 శాతం, మెన్స్‌వేర్‌పై 70 శాతం, కిడ్స్ వేర్‌పై 60 శాతం, జ్యువెలరీ అండ్ యాక్సెసరీస్‌పై 75 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. 2020 జూన్ 27న నిర్వహించిన స్మాల్ బిజినెస్ డే ద్వారా 45,000 మంది అమ్మకందారులకు ఆర్డర్ వచ్చింది. 2,600 మంది అమ్మకందారులు ఇప్పటివరకు అత్యధికంగా అమ్మకాలు చేసారు అని సంస్థ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment