Reliance Digital: ‘డిజిటల్‌ ఇండియా సేల్‌’లో బంపర్‌ ఆఫర్లు..! | RELIANCE DIGITAL ANNOUNCES DIGITAL INDIA SALE Huge Discount | Sakshi
Sakshi News home page

Reliance Digital: ‘డిజిటల్‌ ఇండియా సేల్‌’లో బంపర్‌ ఆఫర్లు..!

Published Sat, Jul 24 2021 4:10 PM | Last Updated on Sat, Jul 24 2021 4:11 PM

RELIANCE DIGITAL ANNOUNCES DIGITAL INDIA SALE Huge Discount - Sakshi

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన రిలయన్స్‌ డిజిటల్‌ కొనుగోలుదారులకు ‘ ఇండియా బిగ్గెస్ట్‌ ఎలక్ట్రానిక్స్‌ సేల్‌-డిజిటల్‌ ఇండియా సేల్‌’ పేరిట సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్‌లో భాగంగా ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులపై ఆకర్షణీయమైన ఆఫర్లు, బిగ్‌ డిస్కౌంట్లను రిలయన్స్‌ డిజటల్‌ అందిస్తోంది. డిజిటల్‌ ఇండియా సేల్‌ జూలై 26 నుంచి కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. ఈ సేల్‌ అన్ని మై జియో స్టోర్స్‌, రిలయన్స్‌ డిజిటల్‌ స్టోర్స్‌లో అందుబాటులో ఉండనుంది. అంతేకాకుండా కంపెనీ వెబ్‌సైట్‌ www.reliancedigital.in. ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చును. టెలివిజన్లు, హోమ్ అప్లయన్సెస్, మొబైల్ ఫోన్స్, ల్యాప్ టాప్స్, యాక్సెసరీస్ వంటి విస్తృతమైన కేటగిరీల శ్రేణిలో ప్రత్యేకమైన ఆఫర్లు లభించును.


జూలై 22 నుంచి ఆగస్టు 5, 2021 వరకు రూ.10,000 కనీస లావాదేవీపై  ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్స్ మీద 10% క్యాష్ బ్యాక్‌ను అందిస్తోంది.ఈ ఆఫర్ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్స్ ఈఎమ్‌ఐ లావాదేవీలపై కూడా లభిస్తుంది. స్మార్ట్ ఫోన్ కేటగిరీలో, కస్టమర్లకు డిస్కౌంట్లు, ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్‌లు లభిస్తాయి. జూలై 31 వరకు ఎంపిక చేసిన ఫోన్స్ పై యాక్సిడెంటల్ డ్యామేజ్, లిక్విడ్ డ్యామేజ్ కవరేజ్ లభించును. వన్‌ప్లస్‌ నార్డ్‌2 స్మార్ట్‌ఫోన్‌ సేల్‌భాగంగా జూలై 28 నుంచి లభిస్తుంది. అంతేకాకుండా ఆపిల్ వాచ్ సీరీస్  6, శాంసంగ్‌ గాలక్సీ ఆక్టివ్‌ 2 స్మార్ట్‌ వాచ్‌లు అతి తక్కువ ధరకే లభించనున్నాయి.  SpO2 ఫీచర్ కలిగిన ఈ సరికొత్త ఫైర్‌ బోల్ట్‌ అగ్ని స్మార్ట్ వాచ్ డిజిటల్ ఇండియా సేల్ లో భాగంగా ఎక్స్ క్లూజివ్ గా రూ. 2,599/ ప్రత్యేకమైన ధరలో లభిస్తుంది.


ల్యాప్ ట్యాప్ కేటగిరీలో బ్యాంక్ క్యాష్ బ్యాక్, బ్రాండ్ వారంటీ ఆఫర్లతో పాటు అదనంగా రూ. 14,990/- విలువైన ప్రయోజనాలు అందుకోగలరు. Asus 10th Gen i5 గేమింగ్ ల్యాప్ టాప్ రూ. 64,999/- ప్రత్యేకమైన ధరలో లభిస్తుంది. దాంతో పాటుగా మ్యాక్‌ బుక్‌ ప్రో స్టూడెంట్స్,  టీచర్లకు ప్రత్యేకంగా  హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు నుంచి కొనుగోలు చేస్తే రూ. 7000 క్యాష్ బ్యాక్ తో రూ. 1,12,990/- ఫ్లాట్ ధరకు ఎక్స్ క్లూజివ్ గా లభిస్తుంది. ల్యాప్ టాప్‌లపై స్పెషల్ డీల్ జూలై 26 నుంచి జూలై 27 న మాత్రమే లభించును.  
                            
ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై కూడా ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది.32 ఇంచుల స్మార్ట్ టీవీలు రూ. 12,990 నుంచి ప్రారంభం కానున్నాయి. రిఫ్రిజరేటర్లు రూ. 11,990, ప్రారంభం కానున్నాయి. అంతేకాకుంగా కొనుగోలుపై ఉచితంగా రూ. 1,999 విలువైన వస్తువులు లభిస్తాయి. టాప్ లోడ్ వాషింగ్ మెషీన్లు రూ. 13,290 ధరతో  ప్రారంభం కానున్నాయి. కొనుగోలుదారులు తమకు నచ్చిన స్టోర్ల నుంచి మూడు గంటలలోపు డెలివరీ పొందవచ్చును.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement