ఇండిగో బంపర్‌ ఆఫర్‌..! అతి తక్కువ ధరలో..! | Indigo Launches 15 Anniversary Sale | Sakshi
Sakshi News home page

IndiGo: ఇండిగో బంపర్‌ ఆఫర్‌..! అతి తక్కువ ధరలో..!

Published Wed, Aug 4 2021 3:29 PM | Last Updated on Wed, Aug 4 2021 3:33 PM

Indigo Launches 15 Anniversary Sale - Sakshi

ప్రముఖ ఎయిర్‌లైన్స్‌ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ (ఇండిగో) 15 వ వార్షికోత్సవ సందర్భంగా విమాన ప్రయాణికులకు బంపర్‌ ఆఫర్‌ను ప్రకటించింది. తక్కువ ప్రారంభ ధరలో  రూ. 915(ఆల్‌ ఇన్‌క్లూజివ్‌) డొమెస్టిక్‌ విమానప్రయాణాలను ఇండిగో అందించనుంది. ఈ ఆఫర్‌ 2021 ఆగస్టు 4 నుంచి ఆగస్టు 6 వరకు రెండు రోజుల పాటు కొనసాగనుంది. ఈ రోజుల్లో టికెట్‌ బుక్‌ చేసుకున్న ప్రయాణికులు 2021 సెప్టెంబర్‌ 1 నుంచి 2022 మార్చి 26  మధ్య ప్రయాణించాల్సి ఉంటుంది.  

ఇండిగో ఈ ఆఫర్‌ పూర్తి వివరాలను కంపెనీ వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఈ ఆఫర్‌ విమానాశ్రయ ఫీజులు,  ఛార్జీలు,  ప్రభుత్వం విధించే పన్నులపై వర్తించదని ఇండిగో పేర్కొంది. అంతేకాకుండా టికెట్‌ బుక్‌ చేసుకునే సమయంలో యాడ్-ఆన్ సేవలపై డిస్కౌంట్లు కాకుండా, ఎంపిక చేయబడిన బ్యాంక్ క్రెడిట్ కార్డులు, కా-చింగ్ కార్డ్‌లపై అదనపు క్యాష్‌బ్యాక్ కూడా ఉందని ఇండిగో ఒక ప్రకటనలో తెలిపింది.

ఇండిగో వెబ్‌సైట్‌ లేదా హెచ్‌ఎస్‌సీబీఎస్‌ క్రెడిట్‌ కార్డుల ద్వారా టికెట్లను బుక్‌ చేసుకుంటే ప్రయాణికులకు గరిష్టంగా 5 శాతం క్యాష్‌బ్యాక్‌ రూ. 750 వరకు పొందవచ్చును. ఈ ఆఫర్‌ కేవలం రూ. 3000విలువైన టికెట్‌ బుకింగ్‌పై మాత్రమే వర్తించనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement