షాప్సి యాప్‌ డౌన్‌లోడ్‌లు 20 కోట్లు  | Shopsy doubles its app downloads to 200 million | Sakshi
Sakshi News home page

షాప్సి యాప్‌ డౌన్‌లోడ్‌లు 20 కోట్లు 

Published Tue, Jul 11 2023 1:32 PM | Last Updated on Tue, Jul 11 2023 1:49 PM

Shopsy doubles its app downloads to 200 million - Sakshi

బెంగళూరు: ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన హైపర్‌ వ్యాల్యూ ప్లాట్‌ఫామ్‌ ‘షాప్సి’ మొబైల్‌ అప్లికేషన్‌ (యాప్‌) 20 కోట్ల డౌన్‌లోడ్‌ మైలురాయిని అధిగమించినట్టు ప్రకటించింది. ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా మెగా సేల్‌ను ఈ సంస్థ ఇటీవలే ప్రారంభించింది. ఈ సేల్‌లో అమ్మకాలు రెండింతలు అధికంగా నమోదయ్యాయని తెలిపింది. (జీల్‌ ప్రమోటర్లకు శాట్‌ షాక్‌ )

చీరలు, పురుషుల టీ షర్ట్‌లు, కుర్తీలు ఎక్కువగా అమ్ముడుపోయినట్టు వివరించింది. ఈ సంస్థకు మహారాష్ట్ర, యూపీ, పశి్చమబెంగాల్‌ టాప్‌–3 మార్కెట్లుగా ఉన్నాయి. 60 శాతం డిమాండ్‌ టైర్‌–3 పట్టణాల నుంచే ఉన్నట్టు తెలిపింది. షాప్సి ప్లాట్‌ఫామ్‌పై ఆకర్షణీయమైన ధరలకే ఉత్పత్తులు అందుబాటులో ఉండడం, కస్టమర్‌ అనుకూల ఫీచర్లతో ఈ సంస్థ ఎక్కువ మందికి చేరువ అవుతుండడం గమనార్హం.   (ఐటీఆర్‌ ఫైలింగ్‌లో తప్పుడు వివరాలిచ్చారో : స్ట్రాంగ్‌ వార్నింగ్‌)

ఇదీ చదవండి: అదరగొట్టేస్తున్న యాంకరమ్మ: దిమ్మతిరిగే వీడియో హల్‌చల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement