![Government May Take Fresh Look At Bpcl Privatisation - Sakshi](/styles/webp/s3/article_images/2022/04/22/bpcl.jpg.webp?itok=aw66AC70)
న్యూఢిల్లీ: భారత్ పెట్రోలియం కార్పొరేషన్(బీపీసీఎల్) ప్రయివేటైజేషన్‌ను సరికొత్త రీతిలో చేపట్టవలసి ఉన్నట్లు ప్రభుత్వ అధికారి ఒకరు పేర్కొన్నారు. వాటా అమ్మక నిబంధనల సవరణ తదితర చర్యలు అవసరమని అభిప్రాయపడ్డారు. వెరసి బీపీసీఎల్ ప్రయివేటైజేషన్ ప్రక్రియ అంశంలో తిరిగి డ్రాయింగ్ బోర్డుకు వెళ్లవలసి ఉన్నట్లు వ్యాఖ్యానించారు.
కన్సార్షియం ఏర్పాటు, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, ఇంధన మార్పులు తదితర సవాళ్లున్నట్లు తెలియజేశారు. కంపెనీలో ప్రభుత్వం 52.98 శాతం వాటా విక్రయానికి సన్నాహాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. వేదాంతా గ్రూప్‌సహా మూడు కంపెనీలు ఆసక్తి వ్యక్తీకరణ(ఈవోఐ) బిడ్స్ దాఖలు చేశాయి.
అయితే ఫైనాన్షియల్ బిడ్స్‌ను ఆహ్వానించవలసి ఉంది. పర్యావరణ అనుకూల, పునరుత్పాదక ఇంధనాలవైపు ప్రపంచం దృష్టిసారించిన నేపథ్యంలో బీపీసీఎల్ ప్రస్తుత ప్రయివేటైజేషన్ ప్రక్రియకు సవాళ్లు ఎదురుకానున్నట్లు ప్రభుత్వ అధికారి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment