AirIndia Sale: గతవారం ఎయిర్‌క్రాఫ్ట్ లివరీ, కొత్త బ్రాండింగ్ తరువాత టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిరిండియా తన ప్యాసింజర్ల కోసం స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. జాతీయ, అంతర్జాతీయ రూట్లలో 96 గంటల ప్రత్యేక సేల్ను ప్రారంభించింది. ఈ సేల్‌లో ప్రయాణిలకు ఆకర్షణీయమైన ఛార్జీలతో విమాన టికెట్లను అందిస్తోంది.
తాజా ప్రకటన ప్రకారం దేశంలోని వివిధ ప్రాంతాలకు ఎకానమీ విమాన టికెట్ల ఛార్జీలు రూ. 1470, బిజినెస్ క్లాస్ ఛార్జీలు రూ.10.130 లనుంచి ప్రారంభమవుతాయి. అదేవిధంగా ఎంపిక చేసిన అంతర్జాతీయ మార్గాలకు ఆకర్షణీయమైన ఛార్జీలు అందుబాటులో ఉన్నాయి. దేశీయంగా ఎంపిక చేసిన ప్రాంతాల ఎకానమీ క్లాస్ టికెట్లు (అన్నీ ఛార్జీలు కలిపి) రూ.1470, బిజినెస్ క్లాస్‌కు రూ.10,130 నుండి ప్రారంభమవుతాయి. ఆగస్టు 20వరకు అందుబాటులో ఉండే నాలుగు రోజుల సేల్ ద్వారా బుక్ చేసుకున్న టికెట్ల ద్వారా సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు ప్రయాణించవచ్చు.
ఎయిరిండియా వెబ్‌సైట్, మొబైల్ యాప్‌తో పాటు, అధీకృత ట్రావెల్ ఏజెంట్లు , ఆన్‌లైన్ ట్రావెల్ ఏజెంట్ల (OTAలు) ద్వారా కూడా విక్రయం కింద బుకింగ్‌లు చేయవచ్చు. పరిమిత సీట్లు, పరిమిత కాలఆఫర్‌గా అందిస్తున్న ఈసేల్‌లో టికెట్లు ఫస్ట్ కమ్ ఫస్ట్‌సర్వ్ ప్రాతిపదికన అందుబాటులో ఉంటాయని ఎయిరిండియా తెలిపింది. దీని ప్రకారం హైదరాబాద్ నుంచి బెంగుళూరుకు సంబంధించి ఎయిరిండియా విమాన టికెట్ చార్జ్ కేవలం రూ.1931గా ఉంటుంది.ఎయిర్ ఇండియా వెబ్‌సైట్, మొబైల్ యాప్ ద్వారా సర్వీస్ ఛార్జ్ లేకుండా బుకింగ్ చేసుకోవచ్చు. వెబ్‌సైట్,మొబైల్ యాప్‌తో పాటు నేరుగా అధీకృత ట్రావెల్ ఏజెంట్లు,ఆన్‌లైన్ ట్రావెల్ ఏజెంట్ల (OTAలు) ద్వారా కూడా విక్రయం కింద బుకింగ్‌లు చేసుకోవచ్చు.
కాగా ఎయిరిండియా తొలి ఎయిర్‌బస్ A350 కొత్త లైవరీలో విమానాల్లోకి ప్రవేశించినఅనంతరం డిసెంబర్ 2023 నుండి ప్రయాణికులు తమ ప్రయాణంలో కొత్త లోగోను చూడొచ్చని టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ప్రకటించారు. రెడ్, గోల్డెన్, పర్పుల్ రంగులతో కూడిన కొత్త లోగో ఎయిర్‌లైన్ భవిష్యత్తు దృక్పథాన్ని సూచిస్తుందని చంద్రశేఖరన్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment