Chandra sekharan
-
ఎయిరిండియా ఆఫర్: రూ. 1471లకే విమానం ఎక్కేయొచ్చు!
AirIndia Sale: గతవారం ఎయిర్‌క్రాఫ్ట్ లివరీ, కొత్త బ్రాండింగ్ తరువాత టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిరిండియా తన ప్యాసింజర్ల కోసం స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. జాతీయ, అంతర్జాతీయ రూట్లలో 96 గంటల ప్రత్యేక సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్‌లో ప్రయాణిలకు ఆకర్షణీయమైన ఛార్జీలతో విమాన టికెట్లను అందిస్తోంది. తాజా ప్రకటన ప్రకారం దేశంలోని వివిధ ప్రాంతాలకు ఎకానమీ విమాన టికెట్ల ఛార్జీలు రూ. 1470, బిజినెస్ క్లాస్ ఛార్జీలు రూ.10.130 లనుంచి ప్రారంభమవుతాయి. అదేవిధంగా ఎంపిక చేసిన అంతర్జాతీయ మార్గాలకు ఆకర్షణీయమైన ఛార్జీలు అందుబాటులో ఉన్నాయి. దేశీయంగా ఎంపిక చేసిన ప్రాంతాల ఎకానమీ క్లాస్ టికెట్లు (అన్నీ ఛార్జీలు కలిపి) రూ.1470, బిజినెస్ క్లాస్‌కు రూ.10,130 నుండి ప్రారంభమవుతాయి. ఆగస్టు 20వరకు అందుబాటులో ఉండే నాలుగు రోజుల సేల్ ద్వారా బుక్ చేసుకున్న టికెట్ల ద్వారా సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు ప్రయాణించవచ్చు. ఎయిరిండియా వెబ్సైట్, మొబైల్ యాప్‌తో పాటు, అధీకృత ట్రావెల్ ఏజెంట్లు , ఆన్లైన్ ట్రావెల్ ఏజెంట్ల (OTAలు) ద్వారా కూడా విక్రయం కింద బుకింగ్‌లు చేయవచ్చు. పరిమిత సీట్లు, పరిమిత కాలఆఫర్గా అందిస్తున్న ఈసేల్‌లో టికెట్లు ఫస్ట్ కమ్ ఫస్ట్‌సర్వ్ ప్రాతిపదికన అందుబాటులో ఉంటాయని ఎయిరిండియా తెలిపింది. దీని ప్రకారం హైదరాబాద్ నుంచి బెంగుళూరుకు సంబంధించి ఎయిరిండియా విమాన టికెట్ చార్జ్ కేవలం రూ.1931గా ఉంటుంది.ఎయిర్ ఇండియా వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా సర్వీస్ ఛార్జ్ లేకుండా బుకింగ్ చేసుకోవచ్చు. వెబ్సైట్,మొబైల్ యాప్‌తో పాటు నేరుగా అధీకృత ట్రావెల్ ఏజెంట్లు,ఆన్లైన్ ట్రావెల్ ఏజెంట్ల (OTAలు) ద్వారా కూడా విక్రయం కింద బుకింగ్‌లు చేసుకోవచ్చు. కాగా ఎయిరిండియా తొలి ఎయిర్‌బస్ A350 కొత్త లైవరీలో విమానాల్లోకి ప్రవేశించినఅనంతరం డిసెంబర్ 2023 నుండి ప్రయాణికులు తమ ప్రయాణంలో కొత్త లోగోను చూడొచ్చని టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ప్రకటించారు. రెడ్, గోల్డెన్, పర్పుల్ రంగులతో కూడిన కొత్త లోగో ఎయిర్‌లైన్ భవిష్యత్తు దృక్పథాన్ని సూచిస్తుందని చంద్రశేఖరన్ పేర్కొన్నారు. -
టాటా మోటార్స్ కొత్త బాస్ ఎవరంటే?
సాక్షి, ముంబై: భారతదేశపు అతిపెద్ద వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ లిమిటెడ్ కొత్త బాస్‌ను ఎన్నుకుంది. ప్రస్తుత సీఎండీ పదవిని వీడనున్న తరుణంలో 2021 జూలై 1 నుండి మార్క్ లిస్టోసెల్లాను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించినట్లు టాటా మోటార్స్ శుక్రవారం (నిన్న) ప్రకటించింది. ప్రస్తుత ఎండీ, సీఈవో గుంటర్ బషెక్ స్థానంలో ఈ కొత్త నియామకం జరగింది. బషెక్ వ్యక్తిగత కారణాలతో జర్మనీకి మారనున్న సంగతి తెలిసిందే. మార్క్ నియామకంపై టాటా మోటార్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ సంతోషం వ్యక్తం చేశారు. భారతదేశంలో విస్తృతమైన కార్యాచరణ వాణిజ్య వాహనాల్లో అపార అనుభవం, నైపుణ్యంతో మార్క్ ఆటోమోటివ్ బిజినెస్ లీడర్‌గా ఉన్నారన్నారు. మార్క్ సారధ్యంలో సంస్థను ఉన్నత శిఖరాలకు తీసుకెళుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు తన నూతన బాధ్యతలపై మార్క్ స్పందిస్తూ భారత్‌తో తనకున్న అనుబంధంలో మరో కొత్త అధ్యాయం ప్రారంభమంటూ ఆనందాన్ని ప్రకటించారు. సంస్థ సామర్థ్యాన్ని సంయుక్తంగా మరింత ముందుకు తీసుకెళతామని చెప్పారు. గతంలో మార్క్ ఫ్యుజో ట్రక్, బస్ కార్పొరేషన్ సీఈవోగా, డెమ్లర్ ట్రక్స్ ఆసియా హెడ్‌గా ఉన్నారు. 2016లో సీఎండీగా ఎంపికైన గుంటర్ బషెక్ నేతృత్వంలో టాటా మోటార్స్ దూసుకెళ్లింది.వ్యక్తిగత కారణాల వల్ల కాంట్రాక్ట్ చివరిలో జర్మనీకి మకాం మార్చాలని గుంటెర్ నిర్ణయించున్నారు. అయితే 2021, జూన్ 30 వరకు పదవిలో కొనసాగాలని టాటా బోర్డు చేసిన అభ్యర్థనను మన్నించారని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. కాగా కరోనా, లాక్డౌన్ సంక్షోభాలనుంచి ఇపుడిపుడే తేరుకుంటున్న టాటా మోటార్స్ డిసెంబర్ త్రైమాసికంలో గత 33 త్రైమాసికాలలో లేని అత్యధిక లాభాలను గడించింది. వార్షిక ప్రాతిపదికన 67.2 శాతం పెరిగి 2,906 కోట్ల లాభాలను ఆర్జించింది. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం సంవత్సరానికి 5.5 శాతం పుజుకుని 75,654 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఏడాది క్రితం ఇది 71,676 కోట్ల రూపాయలు. -
ప్రత్యర్థులకు షాక్ : త్వరలో టాటా సూపర్ యాప్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో అతివేగంగా అభివృద్ధి చెందుతున్న ఇ-కామర్స్ విభాగంలోకి దేశీయ అతిపెద్ద వ్యాపార దిగ్గజం టాటా గ్రూపు మరింత వేగంగా దూసుకు వస్తోంది. ఇందుకు ఒక సూపర్ యాప్‌ను రూపొందిస్తోంది. దీని ద్వారా ప్రతిదీ ఆర్డర్ చేసేలా ఈ ఏడాది డిసెంబర్ లేదా వచ్చే ఏడాది ఆరంభంలో “సూపర్ యాప్” ను ఆవిష్కరించనుంది. తద్వారా బిలియనీర్ ముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్), ఆన్లైన్ రిటైల్ దిగ్గజం అమెజాన్ లాంటి ఇతర సంస్థలకు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. టాటా సాల్ట్ నుంచి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) వరకు విస్తరించి టాటా గ్రూపు గత ఏడాది టాటా డిజిటల్ పేరుతో డిజిటల్ వ్యాపారాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాజాగా చైనాలో ప్రాచుర్యం పొందిన టెన్సెంట్, అలీబాబా తరహాలో ఇక్కడ కూడా సూపర్ యాప్‌ను తీసుకు రానుంది. దాదాపు 1000 కోట్ల రూపాయల పెట్టుబడితో దీన్ని లాంచ్ చేయనుందని టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ పేర్కొన్నట్లు పలు వార్తా కథనాల ద్వారా తెలుస్తోంది. అయితే సూపర్ యాప్‌నకు సంబంధించి పూర్తి వివరాలు అందుబాటులో లేనప్పటికీ, ఫ్యాషన్ షాపింగ్ యాప్ టాటా క్లిక్, కిరాణా ఇ-స్టోర్ స్టార్‌క్విక్ ఆన్లైన్, ఎలక్ట్రానిక్స్ ప్లాట్‌ఫాం క్రోమా ద్వారా ఇప్పటికే సేవలను అందిస్తున్న టాటా గ్రూప్, వీటన్నింటి సమ్మితంగా, ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ఒక కొత్త సూపర్ యాప్ ను రూపొందించనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. సూపర్ యాప్ ద్వారా ఫుడ్, కిరాణా, ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, హెల్త్ కేర్ లాంటి వాటితో పాటు ఇతర పేమెంట్ సేవలను కూడా అందుబాటులోకి తేనుంది. ఇదొక సూపర్ యాప్. ఇందులో పలు యాప్స్ ఉంటాయి. డిజిటల్ సేవల్లో తమకు అపారమైన అవకాశాలున్నాయని చంద్రశేఖరన్ వెల్లడించారు. భారతదేశంలోఅనేక కోట్లాదిమంది వినియోగదారులను అనుసంధానిస్తూ వారికి సరళమైన ఆన్లైన్ అనుభవాన్ని అందించనున్నామని పేర్కొన్నారు. కాగా గోల్డ్‌మన్ సాచ్ నివేదిక ప్రకారం, 2030 నాటికి భారతదేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 2.5 శాతాన్ని డిజిటల్ వ్యాపారం ఆక్రమించనుంది. సుమారు15 రెట్లు పుంజుకుని 300 బిలియన్ డాలర్లను తాకుతుందని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో టాటా గ్రూపు తాజా వ్యూహాలకు ప్రాధాన్యత ఏర్పడింది. -
బెదిరింపులకు భయపడను
తమిళసినిమా: ఎలాంటి బెదిరింపులు వచ్చినా భయపడనని సీనియర్ దర్శకుడు, నటుడు విజయ్ తండ్రి ఎస్ఏ.చంద్రశేఖరన్ అన్నారు. ఈయన సమాజంలోని అక్రమాలు, అన్యాయాలపై అలుపెరుగని పోరాటం చేస్తున్న ట్రాఫిక్ రామస్వామి జీవిత చరిత్రతో ఆయన పేరుతోనే తెరకెక్కుతున్న చిత్రంలో ఆయన పాత్రలో నటిస్తున్నారు. ఎస్ఏ.చంద్రశేఖరన్ శిష్యుడు విక్కీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర మోషన్ పోస్టర్, టీజర్ ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం సాయంత్రం చెన్నైలోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్ఏ.చంద్రశేఖరన్ మాట్లాడుతూ తన వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన విక్కీ ఇక రోజు ట్రాఫిక్ రామస్వామి జీవిత కథను స్క్రిప్ట్‌గా తయారు చేసి తనకు ఇచ్చారన్నారు. కథను చదవిన తరువాత ట్రాఫిక్ రామస్వామి తనలాగే సమాజంలో జరిగే అన్యాయాలను చూసి రగిలే మనిషి అని తెలిసిందన్నారు. ఎక్కడ తప్పు జరిగినా ఆగ్రహించే ఆయన మనస్తత్వం తనకు నచ్చిందని పేర్కొన్నారు. ఆయన పోరాటాలు తెలిసి విస్మయం చెందానన్నారు. అందుకే ఈ చిత్రంలో నటించాలని విక్కీ కోరినప్పుడు కాదనలేకపోయానని చెప్పారు. తాను 45 ఏళ్లలో 69 చిత్రాలకు దర్శకత్వం వహించానని, అలాంటి తానే ఏం సాధించాననడానికి చిహ్నంగా ఈ చిత్రం నిలిచిపోతుందని అన్నారు. ఇందులో తనకు జంటగా రోహిణి నటించగా హీరోలాంటి పాత్రలో ఆర్కే.సురేశ్ నటించారని చెప్పారు. ఇక ఒక్క సన్నివేశంలో నటించడానికి విజయ్ ఆంథోని, కుష్బు, సీమాన్ అంగీకరించారని తెలిపారు. వివాదాస్పదమైన ఈ చిత్రంలో నటించినందుకు ఎలాంటి బెదిరింపులు వచ్చినా భయపడనని, తన తొలి చిత్రం చట్టం ఒరు ఇరుట్టరై సమయంలోనే చాలా బెదిరింపులు ఎదుర్కొన్నానని ఎస్ఏ.చంద్రశేఖరన్ పేర్కొన్నారు. -
తిరుపతిలో రూ.140 కోట్లతో క్యాన్సర్ ఆస్పత్రి
తిరుమల: ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కేన్సర్ ఆస్పత్రి ఏర్పాటు కానుంది. ప్రముఖ వ్యాపార దిగ్గజం టాటా సంస్థ దీనిని నిర్మించనుంది. టాటా సంస్థల చైర్మన్ చంద్రశేఖరన్ శుక్రవారం విషయాన్నితెలియచేశారు. శుక్రవారం శ్రీవారి ఆలయంలో ఆ మేరకు టాటా ట్రస్టు మేనేజింగ్ డైరెక్టర్ వెంకటరమణన్, టీటీడీ ఈవో సాంబశివరావు పరస్పర అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా చంద్రశేఖరన్, ఎండీ వెంకటరమణన్ మాట్లాడుతూ రెండేళ్లలోనే వైద్యశాల నిర్మాణ పనుల పూర్తి చేసి కేన్సర్ రోగులకు అందుబాటులో తీసుకువస్తామన్నారు. టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు మాట్లాడుతూ, కేన్సర్ ఆస్పత్రి నిర్మాణం కోసం తిరుపతి అలిపిరికి సమీపంలో 25 ఎకరాల టీటీడీ స్థలాన్ని లీజు కింద టాటా ట్రస్టుకు కేటాయించామన్నారు. రూ.140 కోట్లతో నిర్మించనున్న ఈ ఆస్పత్రికి టాటా ట్రస్టు ద్వారా రూ.100 కోట్లు, రూ.40 కోట్లు భరించేందుకు కొందరు దాతలు ముందుకొచ్చారన్నారు. టాటా ట్రస్టు వారు ఇప్పటికే ముంబాయి, కోల్‌కత్తాలో కేన్సర్ వైద్యశాలలు నిర్వహిస్తున్నారని, త్వరలో తిరుపతిలో వైద్యశాలను నిర్మించి కేన్సర్ రోగులను విశేష సేవలందిస్తుందని వివరించారు. టాటా సంస్థల ట్రస్టీ ఆర్కె.క్రిష్ణకుమార్, టీటీడీ అదనపు ఎఫ్ఎ అండ్ సీఏవో బాలాజీ, ఆలయ డెప్యూటీ ఈవో కోదండరామారావు పాల్గొన్నారు. కాగా, కేన్సర్ ఆస్పత్రి నిర్మాణం కోసం పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ ప్రవాస భారతీయ భక్తుడు రూ.33 కోట్ల విరాళం ఇప్పటికే అందజేయటం విశేషం. -
గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీలో ఎఫ్‌సీ కోహ్లీ సెంటర్
హైదరాబాద్: గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీలో ఎఫ్‌సీ కోహ్లీ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ సోమవారం ఈ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రశేఖరన్ మాట్లాడుతూ.. ఆరోగ్యం, పరిశ్రమలు, వ్యవసాయం, ఐటీ రంగాల్లో పరిశోధన కోసం ఎఫ్‌సీ కోహ్లీ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. -
కూలీల ఎన్కౌంటర్ బూటకమే
స్పష్టం చేసిన ఫోరెన్సిక్ నిపుణులు డా. చంద్రశేఖరన్ ⇒అదుపులోకి తీసుకుని, అత్యంత పాశవికంగా చంపారు ⇒చనిపోయాక కూడా కాల్చారు ⇒ఎక్కడో చంపి ఎన్కౌంటర్ ప్రాంతంలో శవాలను పడేశారు ⇒అక్కడ దొరికిన దుంగల తీరుపై కూడా అనుమానాలు హైదరాబాద్: శేషాచలం కొండల్లో కూలీల ఎన్‌కౌంటర్‌పై అటు ప్రభుత్వం, ఇటు పోలీసులు చెబుతున్నవన్నీ కట్టుకథలేనని ఫోరెన్సిక్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఎన్కౌంటర్లో అసువులు బాసిన వారి మృతదేహాల ఫొటోలను విశ్లేషించినఆ నిపుణులు.. కూలీలను పాశవికంగా చంపారని చెబుతున్నారు. ఇది ముమ్మాటికీ బూటకపు ఎన్‌కౌంటరేనని ప్రఖ్యాత ఫోరెన్సిక్ నిపుణులు, తమిళనాడు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ మాజీ డెరైక్టర్ డాక్టర్ చంద్రశేఖరన్ తేల్చారు. ‘కూలీలను పోలీసులు అదుపులోకి తీసుకుని.. చిత్రహింసలకు గురిచేసి, అత్యంత కిరాతకంగా చంపారు’ అని ఆయన చెప్పారు. పోలీసులు ఏ ఒక్క స్మగ్లర్‌నూ ప్రాణాలతో పట్టుకోలేకపోవడం, సంఘటనా స్థలంలో స్మగ్లర్ల వద్ద ఆయుధాల ఆనవాళ్లు లేకపోవడం, స్మగ్లర్లు మోసుకెళ్తున్నారని చెబుతోన్న దుంగలపై తెల్ల రంగు మరకలు ఉండటాన్ని పరిశీలించాక శేషాచలం ఎన్కౌంటర్ బూటకపు ఎన్‌కౌంటరేనని ఆయన నిర్ధారణకు వచ్చారు. ఎన్కౌంటర్ బూటకమేనని ప్రఖ్యాత జాతీయ పత్రిక ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ పరిశోధనాత్మక కథనాలు కూడా ప్రచురించింది. పాశవిక దాడి గుర్తులు.. ఎన్కౌంటర్ ఆరు గంటల తర్వాత వివిధ కోణాల్లో సేకరించిన మృతదేహాల ఫోటోలు, సంఘటనా స్థలి ఫోటోలను ఫోరెన్సిక్ నిపుణులు డాక్టర్ చంద్రశేఖరన్ పరిశీలించి, విశ్లేషించారు. ‘చనిపోయిన తర్వాత కూడా శరీరాలపై తుపాకులతో పాశవికంగా దాడి చేసిన గుర్తులు ఉన్నాయి’ అని ఆయన తేల్చారు. ఎన్కౌంటర్ జరిగిన చీకటీగల కోన, సచ్చినోడి బండ ప్రాంతాల్లో నేలపై ఎలాంటి రక్తం మరకలు లేకపోవడంపై చంద్రశేఖరన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కూలీలను మరోచోట చంపి అక్కడకు తీసుకువచ్చి పడేసి ఉంటారనే అనుమానం వ్యక్తం చేశారు. మృతదేహాల వద్ద ఉన్న ఎర్రచందనం దుంగలకు రంగులు వేసి ఉండటం, అవి అంతకుముందే స్వాధీనం చేసుకున్న దుంగల్లా ఉండటం అనుమానాలకు బలమిస్తోంది. డీఐజీ ముందస్తు ప్రకటన ఉద్దేశమదేనా.. ఎన్‌కౌంటర్‌కు నాలుగు రోజుల ముందు రెడ్ టాస్క్‌ఫోర్స్ డీఐజీ కాంతారావు తిరుపతిలో విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే స్మగ్లర్లపై కాల్పులు జరపడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఆయన ముందస్తుగా చేసిన ప్రకటన ఉద్దేశాన్ని పరిశీలిస్తే.. శేషాచలం ఎన్కౌంటర్ బూటకపు ఎన్‌కౌంటరేనని స్పష్టమవుతోందని చంద్రశేఖరన్ అన్నారు. ఎఫ్ఐఆర్లను పరిశీలిస్తే అధికారుల చెప్పిన వివరాల్లో అసలు పొంతనే లేదన్నారు. మరికొన్ని సాక్ష్యాలు.. తలపై బండరాళ్లు, ఇనుపరాడ్లతో మోదడం వల్ల నలుగురు కూలీలు చనిపోయారు. పోలీసులు తీవ్రంగా హింసించడం వల్ల ఒకరి ప్యాంట్ చిరిగిపోతే దాన్ని దాచిపెట్టేందుకు ఆ కూలీకి ఆదరాబాదరాగా మరోప్యాంట్ తొడిగారు. ఒక కూలీ ఎడమ చేతిపై బండరాతితో గానీ.. ఇనుపరాడ్డుతోగానీ మోదినట్లు గుర్తులు ఉన్నాయి. పోలీసుల దాడి నుంచి ఆ కూలీ తప్పించుకునే యత్నం చేసినప్పుడు ఈ గాయం అయి ఉంటుంది. కొందరు కూలీల మొహాలు గుర్తుపట్టలేని రీతిలో చెక్కేసినట్లున్నాయి. ఎముకలు విరిగిపోవడం, చర్మం కమిలిపోవడాన్ని బట్టి చూస్తే.. వారిని అదుపులోకి తీసుకుని విచారించే సమయంలోనే చిత్ర హింసలకు గురిచేసినట్టు తెలుస్తోంది.