The Conjuring House Sold For Record Price - Sakshi
Sakshi News home page

The Conjuring House: రియల్టీ చరిత్రలో ఇదో రికార్డ్‌.. భారీ ధరకు అమ్ముడైన దయ్యాల కొంప

Published Sat, May 28 2022 8:26 PM | Last Updated on Sun, May 29 2022 12:09 PM

The Conjuring house sold For Record Price - Sakshi

ఓ ప్రాపర్టీ మంచిది కాదనే పేరు పడితే చాలు ఎంత ప్రైమ్‌ లోకేషన్‌లో ఉన్నా, వాస్తు దోషాలు లేకున్నా, ఎమినిటీస్‌ బాగున్నా ఆ  ప్రాపర్టీ  అమ్ముడుపోదు. కొనేందుకు ఒక్కరూ ముందుకు రారు. కానీ అమెరికాలో ఈ భయంగొలిపే ఓ భవనం మాత్రం రియల్టీ సెంటిమెంట్‌ని బ్రేక్‌ చేస్తూ రికార్డు రేటుకు అమ్ముడై పోయింది. ఇందుకు సంబంధించిన వివరాలు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

భూత్‌బంగ్లా
హాలీవుడ్‌ సినిమా ప్రియులకు ఆమాట కొస్తే హరర్‌ మూవీ లవర్స్‌కి కంజ్యూరింగ్‌ సినిమా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. దెయ్యాలు, భూతాలు, ప్రేతాలకు సంబంధించి నిజ జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా కంజ్యూరింగ్‌ సిరీస్‌లో సినిమాలు వస్తున్నాయి.  ఆండ్రియా పెరాన్‌ (67) అనే వ్యక్తి అతని కుటుంబ సభ్యులు 1971 నుంచి 1980 వరకు రోడే ఐలాండ్‌లో ఓ ఫార్మ్‌హౌజ్‌లో నివసించారు. 

కంజ్యూరింగ్‌ కొంప
1736లో కట్టిన ఆ ఫార్మ్‌హౌజ్‌లో పెరాన్‌ కుటుంబానికి దెయ్యాలతో అనేక సమస్యలు ఎదురయ్యాయి. ఆ ఫార్మ్‌హౌజ్‌లో జరిగిన సంఘటనల ఆధారంగా 2013లో కంజ్యూరింగ్‌ సినిమాను తెరకెక్కించగా బాక్సాఫీసు దగ్గర దుమ్మురేపింది. అయితే అప్పటి వరకు ఆ ఫార్మ్‌హౌజ్‌ గురించి స్థానికులకు మాత్రమే తెలుసు. కంజ్యూరింగ్‌ పుణ్యమా అని ప్రపంచానికి తెలిసింది. అప్పటి నుంచి ఆ ఇళ్లు అంటే హడల్‌ అందరికీ.

దయ్యాలపై ప్రయోగాలు
అయితే ఇటీవల దెయ్యాల కొంపగా పేరుపొందిన తన ఫార్మ్‌హౌజ్‌ను అమ్మేందుకు ఎంతగా ప్రయత్నించినా ఎవరూ కొనలేదు. రెండు దశబ్ధాల తర్వాత 2019లో అమ్మగలిగాడు. ఈ ఇంటిని జెన్‌, కోరి హైన్‌జన్‌ అనే ఇద్దరు వ్యక్తులు కంజూరింగ్‌ దయ్యాల కొంపను సొంతం చేసుకున్నారు.  ఎందుకంటే వీరిద్దరు అప్పటికే ఆత్మల పరిశోధనలు చేస్తున్నారు. దీంతో ఈ ఇళ్లు తమ పరిశోధనలకు పనికి వస్తుందని 4,39,00 డాలర్లకు కొనుగోలు చేశారు.

ఏం జరిగిందో మరి
ఆ దయ్యాల కొంపలో జెన్‌, కోరి హైన్‌జన్‌ ప్రయోగాలు పూర్తయ్యాయో లేదా వాళ్లకు కూడా చేదు అనుభవాలు ఎదురయ్యాలో తెలియదు కానీ వాళ్లు రెండేళ్లు మించి ఈ ఇంటిని తమతో అట్టిపెట్టుకోలేకపోయారు. 2021 సెప్టెంబరులో ఈ ఇంటిని 1.2 మిలియన్‌ డాలర్లు ఆస్కింగ్‌ ప్రైజ్‌గా నిర్ణయించి అమ్మకానికి పెట్టారు. ఆ దెయ్యాల కొంపను ఫ్రీగా ఇచ్చినా ఎవరూ కొనరు. అలాంటిది 1.2 మిలియన్‌ డాలర్లు చెల్లించి ఎవరు సొంతం చేసుకుంటారనే మాటలు అంతటా వినిపించాయి. 

ఎవరతను?
అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కొద్ది రోజుల్లోనే ఈ భూత్‌బంగ్లాను సొంతం చేసుకునేందుకు చాలా మంది పోటీ పడ్డారు.  ఆస్కింగ్‌ ప్రైజ్‌ను మించి చెల్లించేందుకు రెడీ అయ్యారు. దీంతో ఏకంగా 1.52  (రూ. 12 కోట్లు) మిలియన్‌ డాలర్లకు ఇళ్లు అమ్ముడైపోయింది. 3100 చదరపు అడుగుల్లో విస్తరించిన ఈ భూత్‌బంగ్లా కొత్త ఓనర్‌ ఎవరనేది మాత్రం గోప్యంగా ఉంచారు. 

చదవండి: లగ్జరీ హోమ్స్‌కే డిమాండ్‌ ఎక్కువ: 3 బీహెచ్‌కే సేల్స్‌ జూమ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement