విమాన ప్రయాణికులకు బంపరాఫర్‌! | Spicejet Offers Flight Tickets Starting At Rs 1,818 | Sakshi
Sakshi News home page

విమాన ప్రయాణికులకు బంపరాఫర్‌!

Published Tue, May 23 2023 10:06 PM | Last Updated on Tue, May 23 2023 10:09 PM

Spicejet Offers Flight Tickets Starting At Rs 1,818 - Sakshi

ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ ప్రయాణికులకు బంపరాఫర్‌ ప్రకటించింది. సంస్థ 18వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని బెంగళూరు-గోవా, ముంబయి-గోవా నగరాల మధ్య ప్రయాణించే ప్యాసింజర్లకు రూ.1,818 ధరకే విమాన టికెట్లను కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పించింది. ఈ ఆఫర్‌ సేల్‌ 23 మే 2023 నుంచి 28 మే 2023 వరకు అందుబాటులో ఉండనుంది. టికెట్‌లు బుక్‌ చేసుకున్న వారు జులై  1, 2023 నుంచి మార్చ్‌ 30 ,2024 వరకు ఎప్పుడైనా ప్రయాణించవచ్చు. 

దీంతో పాటు 2023లో 18 ఏళ్లు వయసున్న ప్రయాణికులకు రూ.3,000 విలువైన ఉచిత ఫ్లైట్‌ వోచర్‌ను అందిస్తోన్నట్లు తెలిపింది. ఈ కూపన్‌ కోసం జూన్‌ 10 తేదీలోపు స్పైస్‌జెట్‌కు తమ వివరాలను ఈమెయిల్‌ చేయాలి. తర్వాత 10 జులై వరకు కూపన్‌ పంపుతారు. దాన్ని ఉపయోగించి 31 ఆగస్టులోపు టికెట్‌ బుక్‌ చేసుకుని 30 సెప్టెంబరులోపు ప్రయాణించాలి.

అయితే, ఇందుకోసం కొన్ని షరతులు విధించింది. టికెట్‌ బుకింగ్‌ విలువ రూ.7,500 దాటిన వారికి మాత్రమే ఈ ఆఫర్‌ వర్తిస్తుందని స్పైస్‌జెట్ తెలిపింది. స్పైస్‌మ్యాక్స్‌ ద్వారా టికెట్‌లు బుక్‌ చేసుకునే ప్రయాణికులకు 50 శాతం డిస్కౌంట్‌తోపాటు విమానంలో తమకు నచ్చిన సీటును కేవలం రూ. 18 చెల్లించి బుక్‌ చేసుకోవచ్చని తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement