
నేటి నుంచి కాశీ–గన్నవరం విమాన సర్వీసు
ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసి (కాశీ) నుంచి గన్నవరానికి స్పైస్‌జెట్ కొత్త సర్వీస్.
విమానాశ్రయం (గన్నవరం): ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసి (కాశీ) నుంచి గన్నవరానికి స్పైస్‌జెట్ ఆదివారం కొత్త సర్వీస్ ప్రారంభించనుంది. ఈ విమానం మంగళవారం మినహా అన్ని రోజులూ రాకపోకలు చేయనుంది. 180 సీటింగ్ ఉన్న ఈ విమానం వారణాసి నుంచి రోజూ ఉదయం 10.00కి బయల్దేరి మధ్యాహ్నం 12.10 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.
తిరిగి హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరి 1.50కి గన్నవరం చేరుకుంటుంది. తిరిగి ఇక్కడి నుంచి మధ్యాహ్నం 2.40కి బయలుదేరి హైదరాబాద్ మీదుగా సాయంత్రం 6.55కు కాశీ చేరుకుంటుంది.