
రూ. 3,000 కోట్ల సమీకరణకు క్విబ్
న్యూఢిల్లీ: చౌక ధరల విమానయాన కంపెనీ స్పైస్‌జెట్ అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్) నుంచి నిధుల సమీకరణకు తెరతీసింది. ఇందుకు తాజాగా షేర్ల జారీ(ఫ్లోర్) ధరను ప్రకటించింది. ఒక్కో షేరుకి రూ. 64.79 చొప్పున సెక్యూరిటీలను విక్రయించనుంది. తద్వారా రూ. 3,000 కోట్లు సమకూర్చుకునే ప్రణాళికల్లో ఉంది.
క్విబ్ ద్వారా రూ. 3,000 కోట్లవరకూ సమీకరించేందుకు గత వారం వాటాదారుల నుంచి స్పైస్‌జెట్ అనుమతి పొందిన సంగతి తెలిసిందే. కాగా.. వాటాదారుల అనుమతిమేరకు ఫ్లోర్ ధరపై 5 శాతానికి మించకుండా డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు తాజాగా వెల్లడించింది. కంపెనీ ఆర్థిక సవాళ్లు, న్యాయ వివాదాలు, విమాన సరీ్వసులు నిలిచిపోవడం తదితర సమస్యలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో నిధుల సమీకరణకు ప్రాధాన్యత ఏర్పడింది.
బీఎస్‌ఈలో స్పైస్‌జెట్ షేరు 5.25 శాతం పతనమై రూ. 73.72 వద్ద ముగిసింది.