ముంబై: చౌక ధరల విమానయాన కంపెనీ స్పైస్‌జెట్ నిధుల సమీకరణ బాట పట్టింది. ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన ఇందుకు గల అవకాశాలపై చర్చించేందుకు ఈ నెల 11న బోర్డు సమావేశంకానున్నట్లు కంపెనీ తాజాగా పేర్కొంది.
ఇటీవల 10 కోట్ల డాలర్లు(సుమారు రూ. 833 కోట్లు) సమకూర్చుకునేందుకు కంపెనీ ప్రమోటర్ అజయ్ సింగ్.. గ్లోబల్ ప్రయివేట్ క్రెడిట్ ఫండ్స్‌తో చర్చలు నిర్వహిస్తున్నట్లు వెలువడిన వార్తల నేపథ్యంలో బోర్డు సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ప్రిఫరెన్షియల్ పద్ధతిలో ఈక్విటీ షేర్లు లేదా మార్పిడికి వీలయ్యే సెక్యూరిటీల జారీ ద్వారా నిధుల సమీకరణకున్న అవకాశాలను పరిశీలించేందుకు బోర్డు సమావేశమవుతున్నట్లు స్టాక్ ఎక్సే్ఛంజీలకు స్పైస్‌జెట్ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment