
న్యూఢిల్లీ: తనకు సీటు కేటాయించడంలో విమాన సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ ఆరోపించారు. ఈ కారణంగా ఢిల్లీ–భోపాల్ విమానం 45 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరింది. శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఎంపీ ప్రజ్ఞా భోపాల్‌కు ప్రయాణించేందుకు స్పైస్‌జెట్ విమానంలో టికెట్ బుక్ చేసుకున్నారు. అయితే ఆమె వీల్ చైర్‌లో రావడంతో విమానం ముందువరసలోని 1–ఏ సీటును కేటాయించేందుకు విమాన సిబ్బంది నిరాకరించారు. వెనుక సీటుకు మారాలని కోరగా ఆమె తిరస్కరించారు. వాదోపవాదాల అనంతరం ఆమె వెనుక సీటుకు వెళ్లేందుకు అంగీకరించారు. దీంతో విమానం 45 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరింది. ఈ విషయంపై ఎంపీ ప్రజ్ఞా భోపాల్ ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. భద్రతా కారణాల కారణంగానే ఆమెకు వెనుక సీటు కేటాయించినట్లు స్పైస్ జెట్ ప్రతినిధి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment