
కోల్‌కతా : ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌కు చెందిన టెక్నిషియన్ ప్రమాదవశాత్తు ల్యాండింగ్ గేర్‌లో ఇరుక్కొని మృతి చెందారు. కోల్‌కతా ఏయిర్ పోర్ట్‌లో మంగళవారం అర్థరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. బంబార్డియర్ క్యూ400 విమానంలో రోహిత్ పాండే అనే టెక్నిషియన్ మెయింటెనెన్స్ పనులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అకస్మాత్తుగా ల్యాండింగ్ గేర్ డోర్ మూసుకుపోయింది. దీంతో పాండే అందులో చిక్కుకొని ప్రాణాలు వదిలారని విమానాశ్రయ అధికారులు తెలిపారు.
ఈ ఘటనపై స్పైస్ జెట్ సైతం ఓ ప్రకటన విడుదల చేసింది. అగ్నిమాపక శాఖ సిబ్బంది సహాయంతో టెక్నిషియన్ మృతదేహాన్ని వెలికి తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. అసజహ మరణం కింద కేసు నమోదు చేసుకున్న కోల్‌కతా ఏయిర్‌పోర్ట్ పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఫోరెన్సిక్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. శిక్షణా ప్రమాణాల్లో నాణ్యత లోపించినట్లు డీజీసీఏ గత వారమే ఈ సంస్థకు నాలుగు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అదే సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమానార్హం.
Comments
Please login to add a commentAdd a comment