technician died
-
విమానం డోర్లో చిక్కుకుని వ్యక్తి మృతి
కోల్‌కతా : ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌కు చెందిన టెక్నిషియన్ ప్రమాదవశాత్తు ల్యాండింగ్ గేర్‌లో ఇరుక్కొని మృతి చెందారు. కోల్‌కతా ఏయిర్ పోర్ట్‌లో మంగళవారం అర్థరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. బంబార్డియర్ క్యూ400 విమానంలో రోహిత్ పాండే అనే టెక్నిషియన్ మెయింటెనెన్స్ పనులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అకస్మాత్తుగా ల్యాండింగ్ గేర్ డోర్ మూసుకుపోయింది. దీంతో పాండే అందులో చిక్కుకొని ప్రాణాలు వదిలారని విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఈ ఘటనపై స్పైస్ జెట్ సైతం ఓ ప్రకటన విడుదల చేసింది. అగ్నిమాపక శాఖ సిబ్బంది సహాయంతో టెక్నిషియన్ మృతదేహాన్ని వెలికి తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. అసజహ మరణం కింద కేసు నమోదు చేసుకున్న కోల్‌కతా ఏయిర్పోర్ట్ పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఫోరెన్సిక్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. శిక్షణా ప్రమాణాల్లో నాణ్యత లోపించినట్లు డీజీసీఏ గత వారమే ఈ సంస్థకు నాలుగు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అదే సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమానార్హం. -
బిగ్‌బాస్ సెట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి
బిగ్‌బాస్ షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. తమిళ బిగ్‌బాస్ కార్యక్రమానికి సంబంధించిన చిత్రీకరణ సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. బిగ్ బాస్ సెట్లో ఏసీ మెకానిక్ శుక్రవారం రాత్రి మిద్దె మెట్లపై నుంచి జారిపడి మృతిచెందాడు. పూందమల్లి సమీపంలోగల సెంబరంబాక్కం ప్రాంతంలో కమల్ హాసన్ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ కార్యక్రమానికి సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. అక్కడ అరియలూరు జిల్లా మాత్తూరుకు చెందిన ఏసీ మెకానిక్ గుణశేఖరన్ (30) పనిచేస్తున్నాడు. గుణశేఖరన్ ఏసీ రిపేర్ చేస్తుండగా పట్టుతప్పి మిద్దె మెట్లపై నుంచి జారిపడినట్లు తెలిసింది. దీంతో అతని తలకు తీవ్రగాయమైంది. వెంటనే అతన్ని పూందమల్లిలోగల ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. కేసు నమోదు చేసిన నజరేత్‌పేట పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
విమానం ఇంజన్లో ఇరుక్కుని ఉద్యోగి మృతి
పార్కింగ్ చేసి ఉన్న విమానం ఇంజన్లో ఇరుక్కుని ఎయిరిండియా గ్రౌండ్ క్రూ సభ్యుడు ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన ముంబై విమానాశ్రయంలో జరిగింది. ముంబై నుంచి విమానం హైదరాబాద్‌కు వెళ్లాల్సి ఉంది. విమానం కో-పైలట్ ఒక సిగ్నల్‌ను తప్పుగా అర్థం చేసుకుని ఇంజన్ స్టార్ట్ చేయడంతో అప్పటికి దాని వద్ద ఉన్న రవి సుబ్రమణియన్ అనే ఉద్యోగిని ఇంజన్ ఫ్యాన్లు లోపలకు లాగేశాయి. లోపల ఇరుక్కుపోయిన రవి.. అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటన ఛత్రపతి శివాజీ డొమెస్టిక్ ఎయిర్‌పోర్టులోని 28వ బే వద్ద జరిగింది. విమాన సిబ్బంది సాధారణంగా విమానం ఇంజన్లు ఆఫ్ చేసి ఉన్నప్పుడే వాటి నిర్వహణ పనులు చూస్తుంటారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు ఎయిరిండియా సీఎండీ అశ్వనీ లోహానీ ఓ ప్రకటనలో తెలిపారు. ముంబై విమానాశ్రయంలో జరిగిన ఈ ఘటన పట్ల తాము తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యామని, మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియస్తున్నామని అన్నారు.