
బిగ్‌బాస్ షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. తమిళ బిగ్‌బాస్ కార్యక్రమానికి సంబంధించిన చిత్రీకరణ సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. బిగ్ బాస్ సెట్‌లో ఏసీ మెకానిక్ శుక్రవారం రాత్రి మిద్దె మెట్లపై నుంచి జారిపడి మృతిచెందాడు. పూందమల్లి సమీపంలోగల సెంబరంబాక్కం ప్రాంతంలో కమల్ హాసన్ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ కార్యక్రమానికి సంబంధించిన షూటింగ్ జరుగుతోంది.
అక్కడ అరియలూరు జిల్లా మాత్తూరుకు చెందిన ఏసీ మెకానిక్ గుణశేఖరన్ (30) పనిచేస్తున్నాడు. గుణశేఖరన్ ఏసీ రిపేర్ చేస్తుండగా పట్టుతప్పి మిద్దె మెట్లపై నుంచి జారిపడినట్లు తెలిసింది. దీంతో అతని తలకు తీవ్రగాయమైంది. వెంటనే అతన్ని పూందమల్లిలోగల ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. కేసు నమోదు చేసిన నజరేత్‌పేట పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment