రూ.12కే విమాన టికెట్‌..అంతేనా? ఇంకా.. | SpiceJet offers tickets starting Rs 12 on all routes | Sakshi
Sakshi News home page

రూ.12కే విమాన టికెట్‌..అంతేనా? ఇంకా..

Published Tue, May 23 2017 1:49 PM | Last Updated on Tue, Sep 5 2017 11:49 AM

రూ.12కే విమాన టికెట్‌..అంతేనా? ఇంకా..

రూ.12కే విమాన టికెట్‌..అంతేనా? ఇంకా..

ముంబై: బడ్జెట్‌ క్యారియర్‌ ఎయిర్‌లైన్‌ స్పైస్‌ జెట్‌ విమాన ప్రయాణికులకోసం బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. అన్ని మార్గాల్లో అతి తక్కువ,  డిస్కౌంట్ ధరల్లో విమాన టికెట్లను అందిస్తోంది. రూ.12 ప్రారంభధరలో విమాన టికెట్లను అందింస్తోంది. 12వ వార్షికోత్సవం సందర్భంగా ఈ అద్భుతమైన ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అదనపు ఛార్జీలు, ఇతర పన్నులను మినహాయించి  ఈ ధరలను అందిస్తున్నట్టు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. 12 వ వార్షికోత్సవ అమ్మకాలుగా  చెబుతున్న ఈ ఆఫర్‌లో  మే 23 నుంచి 28 వరకు టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ బుకింగ్స్‌ ద్వారా జూన్ 26, 2017నుంచి మార్చి 24, 2018 వరకు  ప్రయాణించవచ్చు.  అయితే నాన్‌ స్టాప్‌ విమానాల్లో మాత్రమే ఈ ఆఫర్‌ లభ్యం కానుంది.
 
అంతేకాదు మరో అద్భుతమైన ఆఫర్‌ను   కూడా అందిస్తోంది. 12 సాల్‌, బడా ధమాల్‌ పేరుతో   లక్కీ డ్రా నిర్వహిస్తోంది.  ఈ  ఆఫర్‌ లో బుక్‌ చేసుకున్న టికెట్లపై  ఉచిత విమాన టికెట్లు,ఇతర బహుమతులను గెలుచుకునే అవకాశం కల్పిస్తున్నామని సంస్థ అధికారిక వెబ్‌సైట్‌ లో పేర్కొంది.  స్పైస్‌ మ్యాక్స్‌,  భోజనం, సీట్ల ఎంపిక, ఇతర అనుబంధాలపై 20 శాతం తగ్గింపు లాంటి అదనపు ప్రయోజనాలు  ఇందులో ఉన్నాయి. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో టికెట్లు బుక్ చేసుకుంటే  ఫ్రీ మీల్స్‌,  ఫ్రీ ప్రయారిటీ చెక్‌ ఇన్‌కు కూడా అర్హత పొందవచ‍్చని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement