Rs 12
-
రూ.12కే విమాన టికెట్..అంతేనా? ఇంకా..
ముంబై: బడ్జెట్ క్యారియర్ ఎయిర్‌లైన్ స్పైస్ జెట్ విమాన ప్రయాణికులకోసం బంపర్ ఆఫర్ ప్రకటించింది. అన్ని మార్గాల్లో అతి తక్కువ, డిస్కౌంట్ ధరల్లో విమాన టికెట్లను అందిస్తోంది. రూ.12 ప్రారంభధరలో విమాన టికెట్లను అందింస్తోంది. 12వ వార్షికోత్సవం సందర్భంగా ఈ అద్భుతమైన ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అదనపు ఛార్జీలు, ఇతర పన్నులను మినహాయించి ఈ ధరలను అందిస్తున్నట్టు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. 12 వ వార్షికోత్సవ అమ్మకాలుగా చెబుతున్న ఈ ఆఫర్లో మే 23 నుంచి 28 వరకు టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ బుకింగ్స్ ద్వారా జూన్ 26, 2017నుంచి మార్చి 24, 2018 వరకు ప్రయాణించవచ్చు. అయితే నాన్ స్టాప్ విమానాల్లో మాత్రమే ఈ ఆఫర్ లభ్యం కానుంది. అంతేకాదు మరో అద్భుతమైన ఆఫర్‌ను కూడా అందిస్తోంది. 12 సాల్, బడా ధమాల్ పేరుతో లక్కీ డ్రా నిర్వహిస్తోంది. ఈ ఆఫర్ లో బుక్ చేసుకున్న టికెట్లపై ఉచిత విమాన టికెట్లు,ఇతర బహుమతులను గెలుచుకునే అవకాశం కల్పిస్తున్నామని సంస్థ అధికారిక వెబ్సైట్ లో పేర్కొంది. స్పైస్ మ్యాక్స్, భోజనం, సీట్ల ఎంపిక, ఇతర అనుబంధాలపై 20 శాతం తగ్గింపు లాంటి అదనపు ప్రయోజనాలు ఇందులో ఉన్నాయి. అలాగే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో టికెట్లు బుక్ చేసుకుంటే ఫ్రీ మీల్స్, ఫ్రీ ప్రయారిటీ చెక్ ఇన్‌కు కూడా అర్హత పొందవచ్చని తెలిపింది. -
స్కేల్ ధర @ రూ. 12 వేలు
ఈ స్కేల్ ధర అక్షరాల 12 వేల రూపాయలు... అంటే ఒక్కో సెంటీ మీటర్‌కు రూ. 737 ధర చెల్లించినట్టు.. 15 సెం.మీ. ఈ చిన్న స్కేల్‌కు మరీ అంత ధర ఏంటని ఆశ్చర్యపోకండి.. ఎందుకంటే బ్రాండ్‌కు ఉండే విలువే వేరు కదా! ‘లూయిస్ ఉటన్’.. ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? లగ్జరీ బ్రాండ్లకు లూయిస్ ఉటన్ పెట్టింది పేరు. ప్రస్తుతం ఈ కంపెనీ స్కూల్ పిల్లల కోసం స్కేళ్లను కూడా తయారు చేస్తోంది. ఈ స్కేళ్లను అత్యున్నత నాణ్యమైన లెదర్‌తో అభివృద్ధి చేసింది. తద్వారా వీటిని వాడే పిల్లలు సౌకర్యవంతంగా ఫీల్ అవుతారని కంపెనీ భావిస్తోంది. ఈ స్కేల్‌కు రంధ్రాల రూపంలో నాలుగు పూరేకులను కూడా డిజైన్ చేశారు. స్కేల్‌కు ఒక చివరన ఎల్వీ లోగో ఉంటుంది. వీటితో పాటు లెదర్ కోటెడ్తో తయారు చేసిన పెన్సిల్స్‌ను రూ. 10 వేలు ఒకటి చొప్పున అమ్ముతోంది. ఆ పెన్సిల్స్‌ను పెట్టుకునేందుకు కావాల్సిన పౌచ్‌ను రూ. 22 వేలుకు అమ్ముతోంది. ఈ విధంగా ఎల్వీ కంపెనీ ప్రస్తుతం స్టేషనరీ వస్తువులను తయారు చేసి అమ్మే పనిలో నిమగ్నమైంది. -
హువాయ్ కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..ధర ఎంత?
న్యూఢిల్లీ: హువాయ్ తనకొత్త స్మార్ట్ ఫోన్ ను మంగళవారం భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇప్పటికే ఎక్స్ సిరీస్ లో 5 ఎక్స్ తో విజయం సాధించిన కంపెనీ ఇపుడు 'హానర్ 6 ఎక్స్'ను లాంచ్ చేసింది. 3 జీబీ వేరియంట్ ధరను రూ.12,999 గా కంపెనీ నిర్ణయించింది. 3 జీబీ 4 జీబీ రెండు వేరియంట్లలో అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే అమెరికాలో విడుదలైన దీని ధర సుమారు రూ.16,996గా ఉంది. హానర్ 6 ఎక్స్ ఫీచర్లు 5.50 అంగుళాల స్క్రీన్ ఆక్టా కోర్ ప్రాసెసర్ 1080x1920 రిజల్యూషన్, ఆండ్రాయిడ్ 6.0 ఆపరేటింగ్ సిస్టమ్ 12 మెగాపిక్సెల్ రియర్ కెమెరా 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా 3జీబీ ర్యామ్ 32జీబీ స్టోరేజ్ 4 జీబీ ర్యామ్64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 3340ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ -
'మై గ్యాలరీ' ఫీచర్ తో యునికార్న్
న్యూఢిల్లీ : మైక్రోమ్యాక్స్ అనుబంధ సంస్థ, భారత వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ యు టెలి వెంచర్స్, తన కొత్త స్మార్ట్ ఫోన్ 'యునికార్న్' అమ్మకానికి సిద్ధమౌతోంది. రూ.12,999 ధరకు ఎక్స్ క్లూజివ్ గా ఫ్లిప్ కార్ట్ లో ఈ ఫోన్ ను జూన్ 7 నుంచి అమ్మకానికి ఉంచుతున్నట్టు ప్రకటించింది. నేటి(మంగళవారం) మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఈ ఫోన్ బుకింగ్ లు ప్రారంభిస్తున్నట్టు పేర్కొంది. మైక్రోమ్యాక్స్ కు అనుబంధంగా ఉన్న ఈ సంస్థ ఏడాదిలో రెండు మిలియన్లకు పైగా ఫోన్ విక్రయించింది. అదేవిధంగా యూలో రెండో వెర్షన్ సర్వీసుల ప్లాట్ ఫామ్ లను ఆవిష్కరించింది. డాక్టర్స్, ఫుడ్, ట్రావెల్, మొబైల్ ఇంటర్ నెట్(యూ వాలెట్) వంటి సేవలను ఈ ప్లాట్ ఫామ్ కింద అందించనుంది. వీడియో కాల్స్ లేదా చాట్ ద్వారా డాక్టర్ తో మాట్లాడే సేవలను డాక్టర్ ఫెసిలిటీ కింద యూ అందించనుంది. స్క్రాచ్ ఫ్రీ బ్యాక్ ను ఈ ఫోన్ కలిగిఉంది. అల్యూమినియం, మెగ్నేషియం, మాంగనీష్ మిశ్రమంతో ఈ ఫోన్ రూపొందించారు. మై గ్యాలరీ అనే స్మార్ట్ గ్యాలరీ ఈ ఫోన్ ప్రత్యేక ఫీచర్. కాంటాక్ట్స్ తో ఫోటోల సెట్ ను యూజర్లు షేర్ చేసుకోవచ్చు.సోషల్ క్లౌడ్ ద్వారా అన్ లిమిటెడ్ స్టోరేజ్ ను 'మీ మీడియా' తో కలిసి కంపెనీ వినియోగదారులకు అందించనుంది. ఎస్ బీఐ కార్డు ద్వారా కొనుగోలు చేసేవారికి 10శాతం ఆఫ్ ను కంపెనీ అందుబాటులో ఉంచింది. ఈ ఫోన్ ఫీచర్లు.... 5.5 అంగుళాల డిస్ ప్లే, 1.8 జీహెచ్ జడ్ ఆక్టాకోర్ మీడియా టెక్ హెలియో పీ10 ప్రాసెసర్ 4 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నెల్ మెమరీ మైక్రో ఎస్ డీ కార్డ్ ద్వారా 128 జీబీ వరకు విస్తరణ 13 మెగా పిక్సెల్ వెనుక కెమెరా 5 మెగా పిక్సెల్ ముందు కెమెరా ఫింగర్ ప్రింట్ స్కానర్(0.2 సెకండ్లలో అన్ లాక్) డ్యూయల్ సిమ్(నానో సిమ్, హైబ్రిడ్) 4000 ఎంఏహెచ్ బ్యాటరీ