'మై గ్యాలరీ' ఫీచర్ తో యునికార్న్ | Yu to sell Yunicorn for Rs 12,999 on Flipkart from June 7 | Sakshi
Sakshi News home page

'మై గ్యాలరీ' ఫీచర్ తో యునికార్న్

Published Tue, May 31 2016 7:36 PM | Last Updated on Wed, Aug 1 2018 3:40 PM

Yu to sell Yunicorn for Rs 12,999 on Flipkart from June 7

న్యూఢిల్లీ :  మైక్రోమ్యాక్స్ అనుబంధ సంస్థ, భారత వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ యు టెలి వెంచర్స్, తన కొత్త స్మార్ట్ ఫోన్ 'యునికార్న్' అమ్మకానికి సిద్ధమౌతోంది. రూ.12,999 ధరకు ఎక్స్ క్లూజివ్ గా ఫ్లిప్ కార్ట్ లో ఈ ఫోన్ ను జూన్ 7 నుంచి అమ్మకానికి ఉంచుతున్నట్టు ప్రకటించింది. నేటి(మంగళవారం) మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఈ ఫోన్ బుకింగ్ లు ప్రారంభిస్తున్నట్టు పేర్కొంది. మైక్రోమ్యాక్స్ కు అనుబంధంగా ఉన్న ఈ సంస్థ ఏడాదిలో రెండు మిలియన్లకు పైగా ఫోన్ విక్రయించింది.

అదేవిధంగా యూలో రెండో వెర్షన్ సర్వీసుల ప్లాట్ ఫామ్ లను ఆవిష్కరించింది. డాక్టర్స్, ఫుడ్, ట్రావెల్, మొబైల్ ఇంటర్ నెట్(యూ వాలెట్) వంటి సేవలను ఈ ప్లాట్ ఫామ్ కింద అందించనుంది. వీడియో కాల్స్ లేదా చాట్ ద్వారా డాక్టర్ తో మాట్లాడే సేవలను డాక్టర్ ఫెసిలిటీ కింద యూ అందించనుంది.

స్క్రాచ్ ఫ్రీ బ్యాక్ ను ఈ ఫోన్ కలిగిఉంది. అల్యూమినియం, మెగ్నేషియం, మాంగనీష్ మిశ్రమంతో ఈ ఫోన్ రూపొందించారు. మై గ్యాలరీ అనే స్మార్ట్ గ్యాలరీ ఈ ఫోన్ ప్రత్యేక ఫీచర్. కాంటాక్ట్స్ తో ఫోటోల సెట్ ను యూజర్లు షేర్ చేసుకోవచ్చు.సోషల్ క్లౌడ్ ద్వారా అన్ లిమిటెడ్ స్టోరేజ్ ను 'మీ మీడియా' తో కలిసి కంపెనీ వినియోగదారులకు అందించనుంది. ఎస్ బీఐ కార్డు ద్వారా కొనుగోలు చేసేవారికి 10శాతం ఆఫ్ ను కంపెనీ అందుబాటులో ఉంచింది.

ఈ ఫోన్ ఫీచర్లు....

  5.5 అంగుళాల డిస్ ప్లే,
 1.8 జీహెచ్ జడ్ ఆక్టాకోర్ మీడియా టెక్ హెలియో పీ10 ప్రాసెసర్
 4 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నెల్ మెమరీ
 మైక్రో ఎస్ డీ కార్డ్ ద్వారా 128 జీబీ వరకు విస్తరణ
13 మెగా పిక్సెల్ వెనుక కెమెరా
 5 మెగా పిక్సెల్ ముందు కెమెరా
 ఫింగర్ ప్రింట్ స్కానర్(0.2 సెకండ్లలో అన్ లాక్)
 డ్యూయల్ సిమ్(నానో సిమ్, హైబ్రిడ్)
 4000 ఎంఏహెచ్ బ్యాటరీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement