June 7
-
కోహ్లీని లైట్ తీసుకుంటే ఆసీస్ అవుట్..!
-
India: ఆకలి రాజ్యం
జూన్ 7న ప్రపంచ ఫుడ్ సెఫ్టీ డేగా ఐక్యరాజ్య సమితి ప్రతీ ఏటా నిర్వహిస్తోంది. 2019 నుంచి ప్రపంచ ఆరోగ్య సంస్థ , యూఎన్వో, ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్లు సంయుక్తంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి. ఆహార భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించడం ఈ డే ముఖ్య ఉద్దేశం. వెబ్‌డెస్క్: సపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్ అంటూ ఆకలి రాజ్యం సినిమాలో కమల్ పాడిన పాట ఒక ఊపు ఊపింది. నలభై ఏళ్లు గడిచినప్పటికీ దేశం సందుగొందుల్లో ఆకలి కేకలు వినపడుతూనే ఉన్నాయి. ఆహార భద్రత చట్టం అమల్లోకి తెచ్చినా.. పట్టెడన్నం దక్కక లక్షల కుటుంబాలు పస్తులుంటున్నాయి. వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే సందర్భంగా ఇండియాలో పెరిగిపోతున్న ఆకలిపై తీరుతెన్నులపై కథనం... ఆకలి కేకలు 2020లో ప్రకటించిన గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో భారత్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఆహార భద్రతకు సంబంధించి 107 దేశాల నుంచి డేటాను సేకరించి విశ్లేషించగా ఇండియాకు 102 స్థానం దక్కింది. 1991 నుంచి 2014 వరకు ఉన్న వివరాల ఆధారంగా 2020లో ఈ వివరాలు ప్రకటించారు. తమ దేశ పౌరుల ఆకలి తీర్చడంలో పొరుగు దేశాలపైన నేపాల్, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లు మెరుగైన స్థితిలో ఉన్నాయి. మొత్తం ఆసియాలోనే ఆఫ్ఘనిస్తాన్ ఒక్కటే మన కంటే వెనుకబడి ఉంది. పౌష్టికాహారం అందక పోవడం వల్ల ఎంతో మంది భావి భారత పౌరులు మరణం అంచులకు చేరుకుంటున్నారు. లాక్డౌన్ తిప్పలు పేదరికం కారణంగా ఆకలితో నిత్య పోరాటం చేస్తున్న పేదల బతుకులపై లాక్డౌన్ సమ్మెట పోటులా మారింది. దేశంలో రెండు సార్లు విధించిన లాక్‌డౌన్‌తో పేదల బతుకులు చిధ్రమయ్యాయి. ఉపాధి కోల్పోయి తినే నాలుగు మెతుకులు కూడా లభించిన దుస్థితి నెలకొంది. ఇక వలస కార్మికుల కష్టాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వలస కార్మికులకు ఆహారం అందించేందుకు ఏ వాహానం వచ్చినా.. వందల సంఖ్యలో ప్రజలు ఆ వెహికల్ వెంట పరుగులు పెడుతున్న దృశ్యాలు సర్వ సాధారణం అయ్యాయి. కల్తీ కంపు సరిపడ ఆదాయం లేక ఆకలితో ఆలమటిస్తున్న వారు కొందరైతే.. డబ్బులు ఉన్నా నాణ్యమైన తిండి దొరక్క అనారోగ్యం పాలై ప్రజలకు కొదవ లేదు. ముఖ్యంగా నాన్‌వెజ్ వంటకాల విషయంలో కొన్ని రెస్టారెంట్లు అనుసరిస్తున్న ధోరణి దారుణంగా ఉంటోంది. కుళ్లిపోయిన మాంసాన్ని ఫ్రిడ్జ్‌లో ఉంచి సరఫరా చేస్తున్నారు. ఫుడ్‌సెఫ్టీ అధికారులు ఎన్ని సార్లు దాడులు చేసినా అక్రమార్కుల తీరులో మార్పు రావడం లేదు. రోడ్లపైనే కాళ్లకు వేసుకునే చెప్పులను అద్దాల షోరూమ్‌లో అమ్ముతుంటా కానీ కడుపుకు తినే కూరగాయలు మాత్రం రోడ్ల పక్కన, మోరీల వెంట అమ్మేస్తుంటాం అని అప్పుడెప్పుడో లాలూ ప్రసాద్‌యాదవ్ చెప్పారు. ఇప్పటికీ ఈ పరిస్థితిలో మార్పు రాలేదు. కనీసం మున్సిపాలిటీల్లో కూడా వెజ్, నాన్‌వెజ్‌కి సరైన మార్కెట్లు లేవు. ఈ పరిస్థితిలో మార్పు తెచ్చేందుకు ఇటు తెలంగాణ, అటు ఏపీ ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. ఆహార భద్రత యూపీఏ ప్రభుత్వ హయంలో తెచ్చిన ఆహార భద్రత చట్టం ఆకలితో ఆలమటించే పేదలకు అండగా ఉంది. ఈ చట్టం క్రింద ప్రతీ ఒక్కరికి ఆరు కిలోల బియ్యాన్ని రెండు రూపాయలకే అందిస్తుండటంతో ఎంతో మందికి లబ్ధి చేకూరుతోంది. లాక్డౌన్ సమయంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా బియ్యం సరఫరా చేసి ప్రజలను ఆదుకున్నారు. -
జూన్ 7 వరకు స్టేలు పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాప్తి నేపథ్యంలో హైకోర్టు, కింది కోర్టులు ఇచ్చిన స్టే ఉత్తర్వులను జూన్ 7 వరకూ పొడిగిస్తూ ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తులు జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డితో కూడిన బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. కరోనా కారణంగా నెలకొన్న పరిస్థితుల్లో గతంలోనే హైకోర్టు సహా కింది కోర్టులు జారీ చేసిన స్టే ఉత్తర్వులను ఈ నెల 20 వరకూ పొడిగించిన విదితమే. కరోనా వైరస్ తీవ్రత దృష్ట్యా ఆ తేదీ నుంచి మధ్యంతర స్టే ఉత్తర్వులను జూన్ 7 వరకూ పొడిగిస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. జూన్ 7లోగా సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఏమైనా ఉత్తర్వులు జారీ చేసే వరకూ ఈ స్టే ఉత్తర్వులు అమల్లోనే ఉంటాయని స్పష్టం చేసింది. స్టే పొడిగింపు ఉత్తర్వుల కారణంగా ఎవరికైనా అన్యాయం జరిగిందని భావించినా, తీరని నష్టం వాటిల్లుతోందని అనుకున్నా వారు సంబంధిత కోర్టుల ద్వారా తగిన ఉత్తర్వులు పొందవచ్చని తెలిపింది. ఆస్తులకు సంబంధించి డిక్రీల అమలులో భాగంగా కోర్టు అధికారులు ఆస్తుల స్వాధీనం చేయకుండా అప్పీల్ చేసేందుకు ఆస్కారం లేనందున తిరిగి ఉత్తర్వులు జారీ చేసే వరకూ డిక్రీల అమలును నిలిపివేస్తున్నట్లు హైకో ర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. అప్పీల్‌కు ఆస్కా రం లేనప్పుడు న్యాయాన్ని తోసిపుచ్చినట్లు అవుతుందని, అందుకే డిక్రీల అమలును నిలిపివేయాల్సి వస్తోందని పేర్కొంది. -
'మై గ్యాలరీ' ఫీచర్ తో యునికార్న్
న్యూఢిల్లీ : మైక్రోమ్యాక్స్ అనుబంధ సంస్థ, భారత వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ యు టెలి వెంచర్స్, తన కొత్త స్మార్ట్ ఫోన్ 'యునికార్న్' అమ్మకానికి సిద్ధమౌతోంది. రూ.12,999 ధరకు ఎక్స్ క్లూజివ్ గా ఫ్లిప్ కార్ట్ లో ఈ ఫోన్ ను జూన్ 7 నుంచి అమ్మకానికి ఉంచుతున్నట్టు ప్రకటించింది. నేటి(మంగళవారం) మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఈ ఫోన్ బుకింగ్ లు ప్రారంభిస్తున్నట్టు పేర్కొంది. మైక్రోమ్యాక్స్ కు అనుబంధంగా ఉన్న ఈ సంస్థ ఏడాదిలో రెండు మిలియన్లకు పైగా ఫోన్ విక్రయించింది. అదేవిధంగా యూలో రెండో వెర్షన్ సర్వీసుల ప్లాట్ ఫామ్ లను ఆవిష్కరించింది. డాక్టర్స్, ఫుడ్, ట్రావెల్, మొబైల్ ఇంటర్ నెట్(యూ వాలెట్) వంటి సేవలను ఈ ప్లాట్ ఫామ్ కింద అందించనుంది. వీడియో కాల్స్ లేదా చాట్ ద్వారా డాక్టర్ తో మాట్లాడే సేవలను డాక్టర్ ఫెసిలిటీ కింద యూ అందించనుంది. స్క్రాచ్ ఫ్రీ బ్యాక్ ను ఈ ఫోన్ కలిగిఉంది. అల్యూమినియం, మెగ్నేషియం, మాంగనీష్ మిశ్రమంతో ఈ ఫోన్ రూపొందించారు. మై గ్యాలరీ అనే స్మార్ట్ గ్యాలరీ ఈ ఫోన్ ప్రత్యేక ఫీచర్. కాంటాక్ట్స్ తో ఫోటోల సెట్ ను యూజర్లు షేర్ చేసుకోవచ్చు.సోషల్ క్లౌడ్ ద్వారా అన్ లిమిటెడ్ స్టోరేజ్ ను 'మీ మీడియా' తో కలిసి కంపెనీ వినియోగదారులకు అందించనుంది. ఎస్ బీఐ కార్డు ద్వారా కొనుగోలు చేసేవారికి 10శాతం ఆఫ్ ను కంపెనీ అందుబాటులో ఉంచింది. ఈ ఫోన్ ఫీచర్లు.... 5.5 అంగుళాల డిస్ ప్లే, 1.8 జీహెచ్ జడ్ ఆక్టాకోర్ మీడియా టెక్ హెలియో పీ10 ప్రాసెసర్ 4 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నెల్ మెమరీ మైక్రో ఎస్ డీ కార్డ్ ద్వారా 128 జీబీ వరకు విస్తరణ 13 మెగా పిక్సెల్ వెనుక కెమెరా 5 మెగా పిక్సెల్ ముందు కెమెరా ఫింగర్ ప్రింట్ స్కానర్(0.2 సెకండ్లలో అన్ లాక్) డ్యూయల్ సిమ్(నానో సిమ్, హైబ్రిడ్) 4000 ఎంఏహెచ్ బ్యాటరీ