స్కేల్‌ ధర @ రూ. 12 వేలు | Rs 12,000 measurement scale cost | Sakshi
Sakshi News home page

స్కేల్‌ ధర @ రూ. 12 వేలు

Published Sun, Feb 19 2017 2:44 AM | Last Updated on Tue, Sep 5 2017 4:02 AM

స్కేల్‌ ధర @ రూ. 12 వేలు

స్కేల్‌ ధర @ రూ. 12 వేలు

ఈ స్కేల్‌ ధర అక్షరాల 12 వేల రూపాయలు... అంటే ఒక్కో సెంటీ మీటర్‌కు రూ. 737 ధర చెల్లించినట్టు..  15 సెం.మీ. ఈ చిన్న స్కేల్‌కు మరీ అంత ధర ఏంటని ఆశ్చర్యపోకండి.. ఎందుకంటే బ్రాండ్‌కు ఉండే విలువే వేరు కదా! ‘లూయిస్‌ ఉటన్‌’.. ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? లగ్జరీ బ్రాండ్లకు లూయిస్‌ ఉటన్‌ పెట్టింది పేరు.

ప్రస్తుతం ఈ కంపెనీ స్కూల్‌ పిల్లల కోసం స్కేళ్లను కూడా తయారు చేస్తోంది. ఈ స్కేళ్లను అత్యున్నత నాణ్యమైన లెదర్‌తో అభివృద్ధి చేసింది. తద్వారా వీటిని వాడే పిల్లలు సౌకర్యవంతంగా ఫీల్‌ అవుతారని కంపెనీ భావిస్తోంది. ఈ స్కేల్‌కు రంధ్రాల రూపంలో నాలుగు పూరేకులను కూడా డిజైన్‌ చేశారు. స్కేల్‌కు ఒక చివరన ఎల్‌వీ లోగో ఉంటుంది. వీటితో పాటు లెదర్‌ కోటెడ్‌తో తయారు చేసిన పెన్సిల్స్‌ను రూ. 10 వేలు ఒకటి చొప్పున అమ్ముతోంది. ఆ పెన్సిల్స్‌ను పెట్టుకునేందుకు కావాల్సిన పౌచ్‌ను రూ. 22 వేలుకు అమ్ముతోంది. ఈ విధంగా ఎల్‌వీ కంపెనీ ప్రస్తుతం స్టేషనరీ వస్తువులను తయారు చేసి అమ్మే పనిలో నిమగ్నమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement