ముంబై : విమాన ప్రయాణికులు ఎయిర్ పోర్టుకు చేరుకోగానే ట్యాక్సీ కోసం వెతుకులాడుతుంటారు. అలా వెతికే అవసరం లేకుండా విమాన టిక్కెట్ కొనుగోలు చేసినప్పుడే, ట్యాక్సీ ని కూడా బుక్ చేసుకునే సదుపాయం కల్పించనుంది స్పైస్ జెట్. ఈ వినూత్నమైన ఆఫర్ ను విమాన ప్రయాణికుల ముందుకు స్పైస్ జెట్ త్వరలోనే ప్రవేశపెట్టబోతోంది. దీనికోసం క్యాబ్ అగ్రిగేటర్ "మై టాక్సీఇండియా (ఎంటీఐ)" తో ఒప్పందం కుదుర్చుకుంది. స్పైస్ జెట్ మొత్తం దేశంలో 41 గమ్యస్థానాలకు,300 డైలీ విమానాలను నడుపుతోంది. దానిలో ఆరు ఇంటర్నరేషనల్ విమానాలు ఉన్నాయి. టైర్ 2, టైర్ 3 సిటీల నుంచి కస్టమర్లను అధికంగా ఆకట్టుకోవడానికి, రెవెన్యూలను పెంచుకోవడానికి స్పైస్ జెట్ ఈ ఆఫర్ ను ప్రయాణికుల ముందుకు తీసుకురాబోతుంది.
ఈ ఆఫర్ తో ప్రయాణికులు గమ్యస్థానానికి చేరుకోగానే ట్యాక్సీ అందుబాటులో ఉంటుంది. అప్పుడు వెతుకునే అవసరం లేకుండానే ప్రయాణికులు ప్రశాంతంగా గమ్యస్థానాలకు చేరిపోయే వీలుంటుంది. ట్యాక్సీ అవసరమైన వారు టిక్కెట్ కొనుగోలు సమయంలోనే ట్యాక్సీని బుక్ చేసుకోవచ్చని స్పైస్ జెట్ ప్రెసిడెంట్ అమిత్ శ్రీవాత్సవ్ తెలిపారు. ఈ ఆఫర్ ను త్వరలోనే ప్రవేశపెడతామన్నారు. టైర్ 2, టైర్ 3 సిటీల్లో మధ్యతరగతి వినియోగదారులను ఎక్కువగా ఆకట్టుకోవడానికి ఈ సర్వీసు ఉపయోగపడుతుందని శ్రీవాత్సవ్ పేర్కొన్నారు. ఎంటీఐ ట్యాక్సీ అగ్రిగేటర్ గా 2013నుంచి తన సేవలు అందిస్తోంది. 119 సిటీల్లో ఈ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. 454 పైగా క్యాబ్ ఆపనేటర్లను ఈ సంస్థ కలిగి ఉంది.
స్పైస్ జెట్ ట్యాక్సీ ఆఫర్..
Published Mon, Jun 20 2016 10:48 AM | Last Updated on Mon, Sep 4 2017 2:57 AM
Advertisement
Advertisement