ముంబై: స్పైస్‌జెట్ మాజీ యజమాని, సన్ టీవీ గ్రూపు అధినేత కళానిధి మారన్‌కు రూ.1,323 కోట్ల నష్ట పరిహారాన్ని స్పైస్‌జెట్ చెల్లించక్కర్లేదని ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ తేల్చింది. కన్వర్టబుల్ వారంట్లు, ప్రిఫరెన్షియల్ షేర్లు జారీ చేయనందుకు ఈ మొత్తాన్ని కళానిధి మారన్, ఆయనకు చెందిన కాల్ ఎయిర్‌వేస్‌కు చెల్లించాలన్న అభ్యర్థనను ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ కొట్టివేసినట్టు స్పైస్‌జెట్ తెలిపింది.
అయితే, అదే సమయంలో మారన్‌కు రూ.579 కోట్లను 12 శాతం వడ్డీ రేటుతో వెనక్కి చెల్లించేయాలని ఆదేశించినట్టు పేర్కొంది. ఈ కేసు 2015 జనవరి ముందు నాటిది. స్పైస్‌జెట్‌ను కళానిధి మారన్ నుంచి దాని మాజీ యజమాని అజయ్ సింగ్ కొనుగోలు చేయగా... నాడు చేసుకున్న ఒప్పందాన్ని సింగ్ అమలు చేయలేదని మారన్ ఆరోపణ.
Comments
Please login to add a commentAdd a comment