
న్యూఢిల్లీ: స్పైస్‌జెట్ ఈ నెల 26న సాధారణ వార్షిక సమావేశాన్ని(ఏజీఎం) నిర్వహించనున్నట్లు తాజాగా వెల్లడించింది. 2021–22 ఆడిటెడ్ ఆర్థిక ఫలితాలతోపాటు.. డైరెక్టర్‌గా అజయ్ సింగ్‌ను తిరిగి ఎంపిక చేయడంపై వాటాదారుల అనుమతిని కోరనున్నట్లు తెలియజేసింది. అజయ్ సింగ్ ప్రస్తుతం స్పైస్‌జెట్ చైర్మన్, ఎండీగా వ్యవహరిస్తున్నారు.
సింగ్ 2004 నవంబర్ 4న డైరెక్టర్‌గా నియమితులయ్యారు. తదుపరి 2010 ఆగస్ట్ 27న రాజీనామా చేశారు. తిరిగి 2015 మే 21న ఎండీగా ఎంపికైనట్లు బ్యాంక్ పేర్కొంది. ఈ వార్తల నేపథ్యంలో షేరు బీఎస్‌ఈలో 1 శాతం బలపడి రూ. 39 వద్ద ముగిసింది.