న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం ఎయిరిండియా కొనుగోలుకి దేశీ పారిశ్రామిక దిగ్గజం టాటా సన్స్ ఫైనాన్షియల్ బిడ్‌ను దాఖలు చేసింది. ఇదే విధంగా అందుబాటు ధరల ఎయిర్‌లైన్స్ స్పైస్‌జెట్.. చీఫ్ అజయ్‌సింగ్ సైతం బిడ్ చేయడం ద్వారా పోటీ పడుతున్నారు. చివరి రోజు బుధవారానికల్లా ఎయిరిండియా కొనుగోలుకి ఫైనాన్షియల్ బిడ్స్ దాఖలైనట్లు దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే తాజాగా వెల్లడించారు. అయితే ఎన్ని సంస్థలు రేసులో నిలిచిందీ వెల్లడించలేదు.
టాటా సన్స్ బిడ్‌ను దాఖలు చేసినట్లు గ్రూప్ ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు. మరోపక్క స్పైస్‌జెట్ ఎండీ, చైర్‌పర్శన్ అజయ్ సింగ్ వ్యక్తిగత హోదాలో పోటీ పడుతున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ బాటలో పలు కంపెనీలు బిడ్స్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఎయిరిండియా విక్రయ లావాదేవీల నిర్వాహక సంస్థకు పలు ఫైనాన్షియల్ బిడ్స్ దాఖలైనట్లు పాండే తెలియజేశారు. దీంతో డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియ ప్రస్తుతం చివరి దశ(కన్‌క్లూడింగ్ స్టేజ్)కు చేరినట్లు ట్వీట్ చేశారు.
100 శాతం వాటా: డిజిన్వెస్ట్‌మెంట్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఎయిరిండియాలోగల 100 శాతం వాటాతోపాటు.. ఏఐ ఎక్స్‌ప్రెస్ లిమిటెడ్‌లో ఎయిరిండియాకుగల 100 శాతం వాటాను సైతం విక్రయించనుంది. అంతేకాకుండా ఎయిరిండియా సాట్స్ ఎయిర్‌పోర్ట్ సరీ్వసెస్ ప్రయివేట్‌లోగల కంపెనీకిగల 50 శాతం వాటాను సైతం బదిలీ చేయనుంది. 2020 జనవరిలో ప్రారంభమైన విక్రయ సన్నాహాలు కోవిడ్–19 కారణంగా ఆలస్యమైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎయిరిండియా కొనుగోలుకి అవకాశమున్న సంస్థల నుంచి ఫైనాన్షియల్ బిడ్స్‌ను ప్రభుత్వం ఆహా్వనించింది. వీటికి గడువు ఈ బుధవారం(15)తో ముగియనుంది. బయటకు వెల్లడికాని రిజర్వ్ ధరకు ఎగువన దాఖలైన బిడ్స్‌ను సలహాదారు సంస్థ పరిగణించనుంది. అధిక ధరను కోట్ చేసిన బిడ్స్‌ను ఎంపిక చేయనుంది. తద్వారా వీటిని క్యాబినెట్ అనుమతి కోసం పంపనుంది.
Comments
Please login to add a commentAdd a comment