ఎయిర్ ఇండియాకు కొత్త సీఈవో ఎండీని నియమిస్తూ టాటా సన్స్ నిర్ణయం తీసుకుంది. 2022 ఫిబ్రవరి 14న జరిగిన బోర్డు సమావేశంలో ఐకెర్ ఆయ్‌సీని కొత్త బాస్‌గా నియమిస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పటి వరకు టర్కీ ఎయిర్‌వేస్‌కి చీఫ్‌గా ఐకెర్ ఆయ్‌సీ ఉన్నారు. 2022 ఏప్రిల్ 1 నుంచి ఆయన ఎయిరిండియా చీఫ్‌గా బాధ్యతలు చేపడతారు.
బిల్‌కెంట్ యూనివర్సిటీ నుంచి పబ్లిక్ అడ్మినిష్టేషన్ పట్టాను 1994లో పొందరు ఐకర్ ఆయ్‌సీ. అనంతరం యూకేలని లీడ్స్ యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్‌లో పట్టా సాధించారు. టర్కీ ఫుడ్ ఫెడరేషన్ బోర్డ్ మెంబర్‌గా కూడా ఐకెర్ ఉన్నారు. అప్పుల్లో కూరుకుపోయిన ఎయిర్‌ఇండియాను కేంద్రం అమ్మకానికి పెట్టగా ఇటీవల టాటా సన్స్ సొంతం చేసుకుంది. అప్పటి నుంచి పాలనపరమైన సంస్కరణలు చేపడుతోంది. ఈ క్రమంలో ఎయిర్ ఇండియా కొత్త సీఈవో, ఎండీలను నియమిస్తున్నట్టు టాటాసన్స్ చీఫ్ చంద్రశేఖరన్ వెల్డించారు.
Comments
Please login to add a commentAdd a comment