
‘స్పైస్’బ్రాండ్‌తో రీటైల్ వ్యాపారంలోకి స్పైస్ జెట్
దేశీయ రిటైల్ రంగంలోకి భారీ ఎత్తున ప్రవేశించేందుకు స్పైస్‌జెట్ ప్రణాళికలు రచిస్తోంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బహుళ ప్రాచుర్యం పొందిన ‘అబ్‌కీ బార్- మోదీ సర్కార్’ అనే బీజేపీ నినాదాన్ని రూపకర్త అజయ్ సింగ్ ప్రమోట్ చేసిన ఈ సంస్థ ఇప్పటికే భారీ పోటీ నెలకొన్న రిటైల్ విభాగంలోకి ప్రవేశించనుంది. ఫ్యాషన్ ఉత్పత్తులు నుంచి వినియోగ వస్తువుల దాకా రీటైల్ వ్యాపారంలో అడుగుపెట్టనున్నట్టు సమాచారం. గాడ్జెట్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు మరియు ఆహార ఉత్పత్తుల విక్రయంలో ఎంట్రీ ఇవ్వనుంది బడ్జెట్ క్యారియర్ స్పైస్ జెట్. వినియోగ వస్తువులు, ఫ్యాషన్ ప్రొడక్టులు, గ్యాడ్జెట్లు, ఎలక్ట్రానిక్ ,ఇతర వస్తువుల విక్రయాలకు వీలుగా స్టోర్ల ప్రారంభానికి కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
దేశవ్యాప్తంగా వందలకొద్దీ ఉన్న వెండర్స్ నుంచి "స్పైస్'బ్రాండుతో సొంత ఉత్పత్తులను రూపొందించుకోవడం ద్వారా అమ్మకాలు సాధించాలని భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇందుకు విమానయాన సంస్థ నుంచి ప్రత్యేక అనుబంధ కంపెనీని ఏర్పాటు చేసే ప్రణాళికల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, రెండు యూనిట్ల యాజమాన్య సంస్థ ద్వారా నియంత్రించబడుతుంది.
పాక్షికంగా విమానాశ్రయాల్లో ఈ రీటైల్ స్టోర్లను తెరిచే అవకాశం ఉంది. ఆన్‌లైన్ వాణిజ్యాన్ని కూడా నిర్వహించనుందట. అయితే ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్నాప్ డీల్ లాంటి ఈ టైలర్స్‌లా థర్డ్ పార్టీ విక్రయాలు కాకుండా తమ ప్రత్యేక ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా డైరెక్టుగా వినియోగదారులకు ఉత్పత్తులను చేరవేయనుందిట. ఉదాహరణకు వివిధ బ్రాండ్ల టెలివిజన్లు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ద్వారా అందుబాటులో ఉంటే.. స్పైస్ జెంట్‌తన సొంత బ్రాండ్లను పరిచయంచేయనుందిట. ఈ రిటైల్ వెంచర్ పై ఒక నెలలోనే అధికారిక ప్రకటన రావచ్చని భావిస్తున్నారు. అయితే ఈ అంచనాలపై స్పందించేందుకు సంస్థ ప్రతినిధి తిరస్కరించారు.