మహిళలకు స్పైస్‌జెట్ ప్రత్యేక సదుపాయాలు
న్యూఢిల్లీ: ప్రముఖ విమానయాన కంపెనీ ‘స్పైస్‌జెట్’ తాజాగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని దృష్టిలో ఉంచుకొని మహిళల కోసం పలు ప్రత్యేకమైన సదుపాయాలను కల్పించనుంది. వీటిల్లో భాగంగా మహిళా ప్రయాణికులు మార్చి 8న స్పైస్‌మ్యాక్స్‌కు ఉచితంగా అప్‌గ్రేడ్ అవ్వొచ్చు. స్పైస్‌మ్యాక్స్‌లో ప్రయాణికులు ఎక్స్‌ట్రా లెగ్‌రూమ్, ప్రియారిటీ చెకిన్, కాంప్లిమెంటరీ మీల్ అండ్ బేవరేజ్ వంటి పలు సౌకర్యాలు పొందొచ్చు. అలాగే కంపెనీ మార్చి 8న ఒంటరిగా ప్రయాణించే మహిళా ప్రయాణికుల కోసం ఫ్లైట్స్‌లో 4వ వరుసను ప్రత్యేకంగా వారి కోసమే రిజర్వు చేయనుంది. ఈ సౌకర్యాలు అన్ని స్పైస్‌జెట్ విమానాల్లో అందుబాటులో ఉంటాయని కంపెనీ పేర్కొంది.