న్యూఢిల్లీ: చౌక ధరల విమానయాన సంస్థ, స్పైస్‌జెట్‌కు ఈ ఆర్థిక సంవత్సరం (2019–20) సెప్టెంబర్ త్రైమాసిక కాలంలో రూ.463 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల సర్వీసులు నిలిపివేయడం వల్ల వ్యయా లు పెరిగాయని, అంతే కాకుండా సాధారణంగా సెప్టెంబర్ క్వార్టర్ బలహీనంగా ఉంటుందని, అకౌంటింగ్ నిబంధనల్లో మార్పుల వల్ల రూ.180 కోట్ల నష్టాలొచ్చాయని.... ఈ మూడు అంశాల కారణంగా ఈ క్యూ2లో ఈ స్థాయిలో నష్టాలొచ్చాయని స్పైస్‌జెట్ వివరించింది. గత ఆర్థిక సంవత్సరం (2018–19) ఇదే క్వార్టర్‌లో రూ.389 కోట్ల నికర నష్టాలు వచ్చాయని తెలిపింది.
118 విమానాలతో సర్వీసులు...
గత క్యూ2లో రూ.1,875 కోట్లుగా ఉన్న నిర్వహణ ఆదాయం ఈ క్యూ2లో రూ.2,845 కోట్లకు పెరిగింది. ఈ కంపెనీ మొత్తం 118 విమానాలతో రోజుకు సగటున 630 విమాన సర్వీసులను నిర్వహిస్తోంది.
ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో స్పైస్‌జెట్ షేర్ 1 శాతం నష్టంతో రూ.114 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment