స్పైస్‌జెట్ సంస్థ నుంచి రూ.1,323 కోట్లు పరిహారం కోరనున్నట్లు ఆ సంస్థ మాజీ ప్రమోటర్ కళానిధి మారన్ తెలిపారు. ఇటీవల మారన్ నుంచి రూ.450 కోట్లు పరిహారం కోరతామని స్పైస్‌జెట్ వెల్లడించిన నేపథ్యంలో మారన్, ఆయన కంపెనీ కేఏఎల్ ఎయిర్‌వేస్ ఈ మేరకు ప్రకటన వెల్లడించారు.
స్పైస్‌జెట్‌కు గతంలో ప్రమోటర్‌గా వ్యవహరించిన కళానిధి మారన్ సంస్థలో తన 58.46 శాతం వాటాను ప్రస్తుత ప్రమోటర్ అజయ్‌సింగ్‌కు బదిలీ చేశారు. ఈ ఒప్పందంలో భాగంగా తనకు రావాల్సిన వారంట్స్, షేర్లు జారీ చేయలేదని మారన్ ఆరోపించారు. ఈ వ్యవహారం కోర్టుకెళ్లింది. దీనిపై మధ్యవర్తిత్వ కోర్టు, దిల్లీ సింగిల్ బెంచ్ తీర్పులను అనుసరించిన స్పైస్‌జెట్.. మారన్, ఆయనకు చెందిన కేఏఎల్ ఎయిర్‌వేస్‌కు రూ.580 కోట్లు అసలు, రూ.150 కోట్లు వడ్డీ చొప్పున రూ.730 కోట్లు చెల్లించింది.
స్పైస్‌జెట్, కంపెనీ ప్రస్తుత ప్రమోటరు అజయ్‌సింగ్ మారన్‌కు రూ.580 కోట్లను వడ్డీతో పాటు చెల్లించాలని గతంలో జారీ చేసిన ఆదేశాలను సమర్థించిన ఏకసభ్య ధర్మాసనం ఉత్తర్వులను హైకోర్టు డివిజన్ బెంచ్ మే 17న దిల్లీ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం పక్కనపెట్టింది. దాంతో కళానిధి మారన్, ఆయన సంస్థ కేఏఎల్ ఎయిర్‌వేస్‌కు చెల్లించిన రూ.730 కోట్ల మొత్తం నుంచి రూ.450 కోట్లు రీఫండ్ ఇవ్వాలని కోరనున్నట్లు స్పైస్‌జెట్ తెలిపింది.
దాంతో మారన్ దిల్లీ హైకోర్టు ద్విసభ్య ధర్మాససం ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేయనున్నట్లు తెలిపారు. ఎఫ్‌టీఐ కన్సల్టింగ్ ఎల్‌ఎల్‌పీ నిర్ణయించిన రూ.1323 కోట్ల నష్టాన్ని సైతం స్పైస్‌జెట్ నుంచి కోరనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు కూడా తమకు అనుకూలంగా ఉన్నాయని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment