రూ.737కే స్పైస్జెట్ టికెట్ | SpiceJet offers tickets for Rs 737 in annual sale, Bangalore-Delhi at 2900 | Sakshi
Sakshi News home page

రూ.737కే స్పైస్జెట్ టికెట్

Published Tue, Nov 22 2016 1:11 AM | Last Updated on Mon, Sep 4 2017 8:43 PM

రూ.737కే స్పైస్జెట్ టికెట్

రూ.737కే స్పైస్జెట్ టికెట్

న్యూఢిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ ‘స్పైస్‌జెట్’ తాజాగా ‘స్పైసీ యాన్యువల్ సేల్’ ఆఫర్‌ను ప్రకటించింది. సంస్థ ఇందులో భాగంగా ప్రయాణికుల కోసం విమాన టికెట్లను రూ.737 నుంచే అందిస్తోంది. ఈ స్కీమ్ నాలుగు రోజులపాటు (ఈనెల 24 వరకు) అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. ఆఫర్‌లో భాగంగా టికెట్‌లను బుక్ చేసుకున్నవారు వచ్చే ఏడాది జనవరి 9 నుంచి అక్టోబర్ 28 మధ్యకాలంలో ఎప్పుడైనా ప్రయాణించొచ్చు. చెన్నై-కోయంబత్తూరు-చెన్నై, జమ్మూ-శ్రీనగర్-జమ్మూ, చంఢీగర్-శ్రీనగర్-చంఢీగర్, అగర్తల-గువాహతి వంటి 500 కిలోమీటర్ల దూరపు ప్రాంతాలకు మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుందని పేర్కొంది. ఈ ఆఫర్ కేవలం దేశీ రూట్లకే పరిమితమని, నాన్-స్టాప్ ఫ్లైట్స్‌కు మాత్రమే వర్తిస్తుందని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement