దూసుకెళ్లిన స్పైస్జెట్ | SpiceJet's Q2 net profit up 103% | Sakshi
Sakshi News home page

దూసుకెళ్లిన స్పైస్జెట్

Published Fri, Nov 25 2016 5:29 PM | Last Updated on Mon, Sep 4 2017 9:06 PM

దూసుకెళ్లిన స్పైస్జెట్

దూసుకెళ్లిన స్పైస్జెట్

ముంబై : బడ్జెట్ ప్యాసెంజర్ క్యారియర్ స్పైస్జెట్ 2016-17 రెండో త్రైమాసికంలో దూసుకెళ్లింది. తన నికర లాభాల్లో రెట్టింపు లాభాలను నమోదుచేసి 103 శాతం ఎగిసింది. గతేడాది ఇదే క్వార్టర్లో రూ.29 కోట్లగా ఉన్న కంపెనీ నికర లాభాలు, ఈ త్రైమాసికంలో రూ.58.9 కోట్లకు పెంచుకోగలిగింది.  మార్కెట్లో పోటీ వాతావరణం విపరీతంగా పెరుగుతున్నప్పటికీ, స్పైస్జెట్ అనూహ్యమైన పనితీరును నమోదుచేయగలిగిందని ఈ ప్యాసెంజర్ క్యారియర్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ సింగ్ చెప్పారు.
 
తమకు నెలకొన్న న్యాయబద్ధమైన సమ్యసల నుంచి బయటపడగలిగామని, తమ నగదు నిల్వలను పెంచుకోవడానికి ప్రయత్నించినట్టు ఆయన పేర్కొన్నారు. ఈ ఎయిర్లైన్కు ఈ క్వార్టర్ వరుసగా ఏడవ క్వార్టర్ లాభాలుగా నమోదైంది. 2014 డిసెంబర్లో చాలా సవాళ్లను ఎదుర్కొన్న ఈ ఎయిర్లైన్, మేనేజ్మెంట్, కంట్రోల్లో మార్పులతో లాభాల బాటలోకి పయనించి, మార్కెట్లో నిలదొక్కుకోగలిగిందని కంపెనీ పేర్కొంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement