న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా మరోసారి తన పత్ర్యేకతను నిలబెట్టుకుంది. సమయపాలనలో విమర్శలు, సిబ్బంది ప్రవర్తన లాంటి అంశాల్లో విమర్శలుఎదుర్కొంటున్నపటికీ విమాన సేవలు అందిస్తున్న ప్రభుత్వ సంస్థల్లో రారాజుగా నిలిచింది. దేశంలో ప్రభుత్వ విమాన రంగంలో ఏకైక సంస్థ ఎయిర్ఇండియా జాతీయ రంగంలో టాప్ ప్లేస్ లో చోటు దక్కించుకుంది. అంతర్జాతీయ ప్రైవేట్ ఎయిర్లైన్స్ విభాగంలో సింగపూర్ ఎయిర్ లైన్స్ మొదటి స్థానంలో నిలిచింది. లుఫ్తాన్సా, బ్రిటిష్ ఎయిర్ లైన్స్, ఖతార్ ఎయిర్ లైన్స్, ఇండిగో, గో ఎయిర్ తరువాతి స్థానాలతో సరిపెట్టుకున్నాయి.
అటు దేశీయ అత్యంత ప్రముఖ ఏవియేషన్ బ్రాండ్స్ లో స్పైస్ జెట్ టాప్ ప్లేస్ కొట్టేసింది. 'మెస్ట్ రెప్యూటెడ్ బ్రాండ్స్ ఇన్ 2016 ' పేరుతో విడుదల చేసిన డొమెస్టిక్ ప్రయివేటు ఎయిర్ లైన్స్ స్పైస్ జెట్ ఈ ఘనత సాధించింది. 34 శాతం లోయర్ బ్రాండ్ రిపుటేషన్ తో జెట్ ఎయిర్ వేస్, 9శాతంతో ఇండిగో తరువాతి స్థానాల్లో నిలిచాయి .ట్రస్ట్ రీసెర్చ్ ఎడ్వైజరీ (టీఆర్ఏ) విడుదల చేసిన నివేదికలో దేశీయ ప్రైవేట్ విమానయాన సంస్థల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. . మీడియా ఎనలటిక్స్ సంస్థ బ్లూ బైట్స్ భాగస్వామ్యంతో టీఆర్ఏ ఈ అధ్యయనం నిర్వహంచింది.
టాప్ లో ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్
Published Wed, Jul 20 2016 12:40 PM | Last Updated on Mon, Sep 4 2017 5:29 AM
Advertisement
Advertisement