
స్పైస్‌జెట్ లక్కీ7 సేల్
ముంబై: దేశీయ విమానయాన సంస్థ స్పైస్ జెట్ మరోసారి తగ్గింపు ధరలపై విమాన టికెట్లను ఆఫర్ చేస్తోంది. లక్కీ 7 సేల్ ను బుధవారం ప్రకటించింది. స్పైస్ జెట్ దేశీయ రూట్ లో రూ.777 (అన్ని చార్జీలు కలిపి) లకు ఒక వైపు ధరలను ప్రకటించింది.
ఫిబ్రవరి 25 వ తేదీతో ఈ ఆఫర్ లో బుకింగ్స్ ముగియనున్నాయి. ఇలా బుక్ చేసుకున్న టికెట్ల ద్వారా మార్చి9-ఏప్రిల్ 13మధ్య ప్రయాణానికి అనుమతిస్తునట్టు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
కాగా బడ్జెట్ కేరియర్ స్పైస్ జెట్ ఫిబ్రవరి 13 న, ఈ ఎయిర్లైన్స్ ఫిబ్రవరి 28 సెప్టెంబర్ 20 మధ్య ప్రయాణానికి చెల్లుబాటయ్యేలా రూ 798 ప్రయాణ ఛార్జీలను పరిచయంచేసిన సంగతి తెలిసిందే.