ఐవీఆర్‌సీఎల్‌కు పెరిగిన నష్టాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జూన్ త్రైమాసికం స్టాండలోన్ ఫలితాల్లో ఐవీఆర్‌సీఎల్ నష్టాలు క్రితంతో పోలిస్తే రూ.153 కోట్ల నుంచి రూ.245 కోట్లకు చేరాయి. టర్నోవరు రూ.452 కోట్ల నుంచి రూ.522 కోట్లకు పెరిగింది.
మూడు రెట్లు పెరిగిన గాయత్రి లాభం..
గాయత్రి ప్రాజెక్ట్స్ స్టాండలోన్ ఫలితాల్లో నికరలాభం క్రితంతో పోలిస్తే సుమారు మూడు రెట్లు అధికమై రూ.45 కోట్లు నమోదు చేసింది. టర్నోవరు రూ.440 కోట్ల నుంచి రూ.660 కోట్లకు చేరింది.
గాయత్రి షుగర్స్‌కు నష్టం..
జూన్ క్వార్టరులో గాయత్రి షుగర్స్‌కు రూ.9 కోట్ల నష్టం వాటిల్లింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.15 కోట్ల నికరలాభం ఆర్జించింది. టర్నోవరు రూ.132 కోట్ల నుంచి రూ.15 కోట్లకు పడింది.
ఎన్‌సీఎల్ లాభం రూ.16 కోట్లు..
జూన్ క్వార్టరు స్టాండలోన్ ఫలితాల్లో ఎన్‌సీఎల్ ఇండస్ట్రీస్ నికరలాభం రూ.9 కోట్ల నుంచి రూ.16 కోట్లకు ఎగిసింది. టర్నోవరు రూ.192 కోట్ల నుంచి రూ.227 కోట్లకు చేరింది.
సువెన్‌లైఫ్ లాభం రూ.29 కోట్లు..
త్రైమాసికం స్టాండలోన్ ఫలితాల్లో సువెన్‌లైఫ్ నికరలాభం క్రితంతో పోలిస్తే సుమారు 9% తగ్గి రూ.29 కోట్లు నమోదు చేసింది. టర్నోవరు రూ.137 కోట్ల నుంచి రూ.146 కోట్లకు చేరింది.
స్వల్పంగా తగ్గిన గ్రాన్యూల్స్ లాభం..
గ్రాన్యూల్స్ ఇండియా జూన్ క్వార్టరు కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నికరలాభం క్రితంతో పోలిస్తే రూ.40 కోట్ల నుంచి రూ.37 కోట్లకు చేరింది. టర్నోవరు రూ.353 కోట్ల నుంచి రూ.386 కోట్లకు ఎగిసింది. రూ.1 విలువ కలిగిన ఒక్కో షేరుపై 25 పైసల తొలి మధ్యంతర డివిడెండు చెల్లించాలని నిర్ణయించింది.
30 శాతం పెరిగిన పెన్నార్ లాభం..
జూన్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో పెన్నార్ ఇండస్ట్రీస్ నికరలాభం క్రితంతో పోలిస్తే 30 శాతం పెరిగి రూ.13 కోట్లు నమోదు చేసింది. టర్నోవరు రూ.338 కోట్ల నుంచి రూ.460 కోట్లకు చేరింది.