హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఇన్‌ఫ్రా రంగ కంపెనీ ఐవీఆర్‌సీఎల్‌కు రూ.405.13 కోట్ల విలువైన ఆర్డర్లు వచ్చాయి. వీటిలో ఒడిశా వాటర్ సప్లై, సెవరేజ్ బోర్డ్ నుంచి రూ.295.11 కోట్ల ఆర్డరు దక్కించుకుంది. అలాగే పుణేలో గోద్రెజ్ ప్రాణ రెసిడెన్షియల్ ప్రాజెక్టు నిర్మాణం కోసం డ్రీమ్ వరల్డ్ ల్యాండ్‌మార్క్స్ నుంచి రూ.110.02 కోట్ల కాంట్రాక్టు పొందింది.