తగ్గిన జీవీకే నష్టాలు | GVK Power and Infra FY15 losses rise to Rs 834.68 crore | Sakshi
Sakshi News home page

తగ్గిన జీవీకే నష్టాలు

Published Sun, May 17 2015 1:44 AM | Last Updated on Sun, Sep 3 2017 2:10 AM

తగ్గిన జీవీకే నష్టాలు

తగ్గిన జీవీకే నష్టాలు

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీవికే ఇన్‌ఫ్రా మార్చితో ముగిసిన నాల్గవ త్రైమాసికంలో రూ. 865 కోట్ల ఆదాయంపై రూ. 109 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. అంతకుముందు ఏడాది ఇదే కాలానికి కంపెనీ రూ. 716 కోట్ల ఆదాయంపై రూ. 235 కోట్ల నికర నష్టాలను నమోదు చేసింది. ఈ త్రైమాసికంలో ఎయిర్‌పోర్ట్ విభాగం రూ. 219 కోట్ల లాభాలను అందించడం నష్టాలు తగ్గడానికి ప్రధాన కారణంగా కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఏడాది మొత్తం మీద జీవీకే ఇన్‌ఫ్రా రూ. 3,050 కోట్ల ఆదాయం పై రూ. 835 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. 2013-14లో కంపెనీ రూ. 2,821 కోట్ల ఆదాయంపై రూ. 369 కోట్ల నికర నష్టాలను ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement