వెలుగులో ఇన్‌ఫ్రా, రియుల్టీ షేర్లు | BSE Sensex ends 11 points higher in choppy session, L&T shines | Sakshi
Sakshi News home page

వెలుగులో ఇన్‌ఫ్రా, రియుల్టీ షేర్లు

Published Tue, Oct 22 2013 6:24 AM | Last Updated on Fri, Nov 9 2018 5:30 PM

వెలుగులో ఇన్‌ఫ్రా, రియుల్టీ షేర్లు - Sakshi

వెలుగులో ఇన్‌ఫ్రా, రియుల్టీ షేర్లు

 పరిమిత శ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనైన సోమవారంనాటి మార్కెట్లో ఇన్‌ఫ్రా, రియుల్టీ, మెటల్ షేర్లకు కొనుగోలు మద్దతు లభించింది. రోజంతా 200 పారుుంట్ల శ్రేణిలో ఊగిసలాడిన బీఎస్‌ఈ సెన్సెక్స్ చివరకు 11 పారుుంట్ల స్వల్పలాభంతో 20,894 పారుుంట్ల వద్ద ముగిసింది. 6,160-6,220 పారుుంట్ల మధ్య హెచ్చుతగ్గులకు లోనైన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 15 పారుుంట్లు లాభపడి 6,205 పారుుంట్ల వద్ద క్లోజరుు్యంది. మార్కెట్ అంచనాల్ని మించిన నికరలాభాన్ని ప్రకటించిన ఇన్‌ఫ్రా కంపెనీ లార్సన్ అండ్ టూబ్రో భారీగా 6 % ర్యాలీ జరిపి రూ. 925 వద్ద వుుగిసింది. రియుల్టీ షేరు డీఎల్‌ఎఫ్ 5 శాతం, ఇన్‌ఫ్రా ఫైనాన్స్ కంపెనీ ఐడీఎఫ్‌సీ 4.5% చొప్పున పెరిగారుు. మెటల్ షేర్లకు తాజా కొనుగోలు వుద్దతు లభించడంతో టాటా స్టీల్, ఎన్‌ఎండీసీ, సెరుుల్, సేసా స్టెరిలైట్ షేర్లు 2-3% వుధ్య ఎగిసారుు. ఆదిత్యా బిర్లా గ్రూప్ కంపెనీ హిందాల్కోకు నిబంధనల ప్రకారమే బొగ్గుగనిని కేటారుుంచినట్లు ప్రధాని కార్యాలయుం ప్రకటించడంతో ఆ షేరు మరో 3 శాతం ర్యాలీ జరిపింది. ప్రధాన ఐటీ షేరు టీసీఎస్, ఎఫ్‌ఎంసీజీ షేరు ఐటీసీలు లాభాల స్వీకరణ ఫలితంగా 2% చొప్పున క్షీణించారుు.
 
 మిడ్‌క్యాప్ షేర్ల హవా....
 చాలా రోజుల తర్వాత సోవువారం ఇన్‌ఫ్రా, రియుల్టీ, బ్యాంకింగ్ రంగాలకు చెందిన మిడ్‌క్యాప్ షేర్లు జోరుగా పెరిగారుు. ఇన్‌ఫ్రా కంపెనీ ఆదాని ఎంటర్‌ప్రెజైస్ 12 శాతం ర్యాలీ జరపగా, ప్రైవేటు రంగ ఫెడరల్ బ్యాంక్ మెరుగైన ఫలితాలు వెల్లడించడంతో 10 శాతం ఎగిసింది. ఇతర  బ్యాంకింగ్ షేర్లు ఇండస్‌ఇండ్ బ్యాంక్, యుస్ బ్యాంక్, యుూనియున్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్‌లు 3-4 శాతం వుధ్య పెరిగారుు. రియుల్టీ షేర్లు యుూనీటెక్, ఇండియూబుల్స్ రియుల్టీ, హెచ్‌డీఐఎల్‌లు 2-4 శాతం వుధ్య ర్యాలీ చేసారుు. మెడికల్ ఎక్విప్‌మెంట్ కంపెనీ ఆప్టో సర్క్యూట్స్ 7% ఎగిసింది.
 
 విప్రో కౌంటర్లో భారీ బిల్డప్....
 వుంగళవారం ఆర్థిక ఫలితాలు వెల్లడించనున్న ఐటీ కంపెనీ విప్రో డెరివేటివ్ కాంట్రాక్టుల్లో భారీ బిల్డప్ జరిగింది. స్పాట్ వూర్కెట్లో ఈ షేరు క్రితం రోజుస్థారుులోనే రూ. 506 వద్ద వుుగిసినా, ఈ ఫ్యూచర్ ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ)లో ఒక్కసారిగా 12.85 లక్షల షేర్లు యూడ్‌కావడంతో మొత్తం ఓఐ 1.05 కోట్ల షేర్లకు చేరింది. విప్రో ఫ్యూచర్‌లో ఓఐ కోటి షేర్లను మించడం అరుదు. స్పాట్‌తో పోలిస్తే ఫ్యూచర్ రూ. 3 ప్రీమియుంతో ట్రేడవుతోంది. అరుుతే టీసీఎస్ ఫలితాల వెల్లడి తర్వాత ఆ కౌంటర్లో భారీ లాభాల స్వీకరణ జరిగినందున, లాంగ్ ఫ్యూచర్ కాంట్రాక్టుకు రక్షణ (హెడ్జింగ్)గా రూ. 510 నుంచి రూ. 540 స్ట్రరుుక్స్ వరకూ కాల్ ఆప్షన్లను ఇన్వెస్టర్లు విక్రరుుంచినట్లు ఆప్షన్ డేటా వెల్లడిస్తున్నది. అన్నింటికంటే ఎక్కువగా రూ. 520 స్ట్రరుుక్ కాల్ ఆప్షన్లో తాజాగా 4.5 లక్షల షేర్లు యూడ్ అయ్యూరుు. ఈ ఆప్షన్లో మొత్తం ఓఐ 7.80 లక్షలకు పెరిగింది.  రూ. 500 నుంచి రూ. 480 స్ట్రరుుక్స్ వరకూ స్వల్పంగా పుట్ రైటింగ్ జరిగింది. సమీప భవిష్యత్తులో ఈ షేరు రూ. 520పైన స్థిరపడితేనే అప్‌ట్రెండ్ సాధ్యవుని, రూ. 520 స్థారుుని అధిగమించలేకపోతే, రూ. 500-480 శ్రేణి వద్ద తాత్కాలిక వుద్దతు పొందవచ్చని ఈ ఆప్షన్ డేటా సూచిస్తున్నది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement