ఇన్‌ఫ్రాపై దృష్టి పెట్టాలి
ఏఐఐబీ ప్రెసిడెంటుకి ప్రధాని సూచన
న్యూఢిల్లీ: ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ) ఆసియా దేశాల వృద్ధికి తోడ్పడేలా రైలు..రోడ్డు.. పోర్టుల ద్వారా కనెక్టివిటీని పెంచేలా మౌలిక రంగ అభివృద్ధిపై దృష్టి సారించాలని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఏఐఐబీ ప్రెసిడెంటుగా నియమితులైన జిన్ లికున్‌తో సోమవారం ఆయన భేటీ అయ్యారు. కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి బైటపడేసేందుకు ఇన్‌ఫ్రాను మెరుగుపర్చుకోవడం కీలకమని మోదీ పేర్కొన్నారు. ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకులకు పోటీ పూర్వకంగా ఏర్పాటైన ఏఐఐబీ వచ్చే నెలలో కార్యకలాపాలు ప్రారంభించనుంది.