మా అమ్మాయికి మంచి విద్య అందించాలనుంది. ప్రస్తుతం రూ.లక్షల్లో ఫీజులున్నాయి. తన వయసు ఇప్పుడు 10 ఏళ్లు. తన పేరుమీద నెలకు రూ.20వేల వరకూ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాం. మంచి రాబడులు వచ్చే పథకాలు ఏవైనా ఉన్నాయా? కనీసం 13 ఏళ్లు ఇన్వెస్ట్ చేస్తే ఎంత రాబడి అంచనా వేయవచ్చు? - విక్రమ్
పిల్లలకు మెరుగైన విద్యను అందించాలనే మీ కోరికకు ధన్యవాదాలు. మీరు అన్నట్లు ప్రస్తుతం ఫీజులు భారీగా పెరుగుతున్నాయి. మీ పాప వయసు 10 ఏళ్లు. తాను ఉన్నత చదువులు చదివేటప్పటికీ ద్రవ్యోల్బణం, పెరుగుతున్న ఖర్చులు లెక్కేస్తే చాలా డబ్బు అవసరం అవుతుంది. విద్యా ద్రవ్యోల్బణం ఏటా పెరుగుతూనే ఉంది. పెట్టుబడిపై అధిక రాబడి వచ్చేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. దీనికి డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లను ఎంచుకోవచ్చు. మీరు నెలకు రూ.20వేలు పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు. 13 ఏళ్ల పాటు 12 శాతం రాబడితో మీ ఇన్వెస్ట్‌మెంట్ దాదాపు రూ.75,18,623 అయ్యే అవకాశం ఉంది. అయితే ముందుగా మీరు అమ్మాయి భవిష్యత్ అవసరాలకు ఆర్థిక రక్షణ కల్పించాలి. అందుకోసం టర్మ్‌పాలసీను తీసుకోవాలి. మీ లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో మీకు ఏదైనా జరిగినా పాలసీ డబ్బు మీ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలుస్తుంది.
ఇదీ చదవండి: ‘ఎవరికి చెల్లింపులు చేసినా నాకు తెలుస్తుంది’
ఇటీవల కాలంలో బంగారం ధరలు తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. ఇప్పుడు ఇందులో ఇన్వెస్ట్ చేయడం సరైన నిర్ణయమేనా? ఎంత సమయం పెట్టుబడి పెట్టాలి? - ప్రకాశ్
పెట్టుబడులను డైవెర్సిఫైడ్‌గా ఉంచుకోవాలి. ఓకే విభాగంలో ఇన్వెస్ట్ చేయకూడదు. బంగారం ధరల్లో ఒడిదొడుకులు సహజం. తాత్కాలికంగా ధరలు పెరుగుతున్నాయని, తగ్గుతున్నాయని ఇన్వెస్ట్ చేయకూడదు. దీర్ఘకాలం కొనసాగితేనే ఇన్వెస్ట్ చేయాలి. మీ పెట్టుబడిలో 10-15 శాతం మేరకే బంగారంలో ఉండేలా చూసుకోవాలి. అంతకుమించి పెట్టుబడి మంచిది కాదు. మిగతా మొత్తాన్ని విభిన్న ఈక్విటీ ఫండ్లలో ఇన్వెస్ట్ చేయండి. కనీసం అయిదేళ్లకు మించి సమయం ఉంటేనే మంచి రాబడులు అందుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment