ICC ODI Batting Rankings: India Captain Rohit Sharma Enters Top 3 Closes to Virat Kohli ODI Rankings - Sakshi
Sakshi News home page

ICC ODI Rankings: మూడో స్థానానికి రోహిత్‌.. కోహ్లికి మరింత దగ్గర

Published Wed, Feb 9 2022 4:30 PM | Last Updated on Wed, Feb 9 2022 5:41 PM

India captain Rohit Sharma Enters Top 3 Closes Virat Kohli ODI Rankings - Sakshi

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో రోహిత్‌ శర్మ తన పాయింట్లను మెరుగుపరుచుకున్నాడు. తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో తొలి మూడు స్థానాల్లో ఉన్న బాబర్‌ అజమ్‌, విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మల మధ్య ఎలాంటి మార్పు లేదు. అయితే విండీస్‌తో జరిగిన తొలి వన్డేలో హాఫ్‌ సెంచరీతో రాణించిన రోహిత్‌ మ్యాచ్‌ విజయంలో కీలకపాత్ర పోషించాడు. దీంతో రోహిత్‌ ఖాతాలో రెండు పాయింట్లు జమ అయ్యాయి. ప్రస్తుతం రోహిత్‌ 807 పాయింట్లతో మూడో స్థానంలో ఉండగా.. కోహ్లి 828 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా.. బాబార్‌ అజమ్‌ 873 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.

ఇక మిగతావారిలో చూసుకుంటే ఇంగ్లండ్‌ ఆటగాడు జో రూట్‌, పాకిస్తాన్‌ ఓపెనర్‌ ఫఖర్‌ జమాన్‌లు టాప్‌టెన్‌లోకి దూసుకొచ్చారు. 741 పాయిం‍ట్లతో ఫఖర్‌ జమాన్‌ తొమ్మిదో స్థానంలో ఉండగా.. జో రూట్‌ 740 పాయింట్లతో పదో స్థానంలో ఉన్నాడు. ఇక బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఎలాంటి మార్పు లేదు. విండీస్‌ ఆల్‌రౌండర్‌ జేసన్‌ హోల్డర్‌ మాత్రం ఆల్‌రౌండర్‌ ర్యాంకింగ్స్‌లో టాప్‌ 20లోకి ప్రవేశించాడు. టీమిండియాతో తొలి వన్డేలో హాఫ్‌ సెంచరీతో రాణించిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement